హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: 'తప్పుచేసిన వాడు జైలుకు పోతాడు..' ఏపీ ప్రభుత్వంపై వైసీపీ నేత సంచలన కామెంట్స్...

AP Politics: 'తప్పుచేసిన వాడు జైలుకు పోతాడు..' ఏపీ ప్రభుత్వంపై వైసీపీ నేత సంచలన కామెంట్స్...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో (YSR Congress Party) కలకలం రేగింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి (DL Ravindra Reddy) ప్రభుత్వంపై (AP Government) సంచలన ఆరోపణలు చేశారు.

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో (YSR Congress Party) కలకలం రేగింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి (DL Ravindra Reddy) ప్రభుత్వంపై (AP Government) సంచలన ఆరోపణలు చేశారు. మంత్రులు, సలహాదారులు, అవినీతి, రైతుల సమస్యలు ఇలా పలు అంశాల్లో ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. అంతేకాదు తన పొలిటికల్స్ ప్లాన్స్ పైనా కీలక విషయాలు బయటపెట్టారు. కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న డీఎల్ రవీంద్రా రెడ్డి.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. వైసీపీని వీడుతున్నట్లు సంకేతాలిచ్చారు. 2024 ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన డీఎల్ రవీంద్రారెడ్డి ఏ పార్టీ తరపున పోటీ చేస్తానన్నది ఇప్పుడే చెప్పలేనన్నారు. ప్రతిభ ఆధారంగానే పార్టీ టికెట్ వస్తుందంటున్నారు. రాష్ట్రంలో మంత్రులు డమ్మీలుగా మారిపోయారని సంచలన ఆరోపణలు చేశారు.

  రెడ్లకు బుద్ధొచ్చింది

  రాష్ట్రంలో రెడ్ల ప్రభుత్వం రావాలని కోరుకున్న వారందరికీ తగిన బుద్ధి వచ్చిందని డీఎల్ రవీంద్రారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దురదృష్టకరమైన పరిస్థితి నెలకొందని.., వ్యవసాయం సంక్షోభంలో పడిపోయిందన్నారు. రైతును పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ ఆయిల్ వ్యాపారం చేసే అంబటి కృష్ణారెడ్డికి వ్యవసాయ శాఖలో సలహాదారుడి పదవి ఇచ్చారని ఆరోపించారు. తప్పు చేసిన వాడు తప్పకుండా జైలుకు పోతాడని చెప్పారు.

  ఇది చదవండి: సీఎం జగన్ సతీమణి భారతిపై సీపీఐ నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు..


  కౌలు రైతులెక్కడ..?

  ఏపీలో పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసే కౌలు రైతు కరువయ్యాడని.. తన సొంతపొలాన్నే కౌలుకు తీసుకునే నాథుడే లేడని తెలిపారు డీఎల్. సొంత ఖజానా నింపుకోవడమే ధ్యేయంగా పాలకులు పని చేస్తున్నారని డీఎల్ ఆరోపించారు. రాష్ట్రంలో ఏ శాఖ మంత్రి ఆ శాఖకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం లేదని.., దారినపోయే వారందరూ ప్రెస్ మీట్ లు పెడుతున్నారని కౌంటర్లు వేశారు. ప్రభుత్వం ఇచ్చే ఐదు వందలు, వెయ్యికి ఆశపడి ఎవరు బ్రతకవద్దని.., సొంతంగా సంపాదించుకోవడం నేర్చుకోండంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

  ఇది చదవండి: జ్యోతిష్యురాలితో ఎమ్మెల్యే రోజా భేటీ.. మంత్రి పదవి కోసమేనా..?


  ప్రశ్నించాల్సిందే..!

  సమాజంలో జరుగుతున్న అక్రమాలపై పాలకులను మీడియా ప్రశ్నించాలన్న డీఎల్.. ప్రశ్నించుకుంటే అధోగతి పాలవుతుందన్నారు. భూములు ఆక్రమించుకోవడం ఖజానా నింపుకోవడమే పాలకులు పనిగా పెట్టుకున్నారని.., రాష్ట్ర పరిస్థితి, భావితరాల గురించి ఎవరు ఆలోచన చేయడం లేదున్నారు. పేదల బియ్యాన్ని 70 శాతం ప్రజలు తినకుండా అమ్ముకుంటున్నారని.., సబ్సిడీ ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ సిస్టం ద్వారా అందించడం ఉత్తమమని సూచించారు.

  ఇది చదవండి: ఆ ఐడియా మనకెందుకు రాలేదబ్బా..? జగన్ ప్రచార వ్యూహంపై టీడీపీలో చర్చ..!


  వైసీపీని వీడటం ఖాయం..

  2014 ఎన్నికల తర్వాత అప్పటి అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో చేరిన డీఎల్ రవీంద్రారెడ్డి... 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో ఏ విషయంపైనైనా ఫైర్ బ్రాండ్ మాదిరిగా మాట్లాడే డీఎల్.., గత రెండేళ్లుగా సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు ఉన్నట్లుండి వైసీపీ సర్కార్ పై తీవ్రఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. డీఎల్ వ్యాఖ్యలతో ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు స్పష్టమైంది. ఐతే ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారనేది మాత్రం సస్పెన్స్ గా మారింది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ysrcp

  ఉత్తమ కథలు