Home /News /andhra-pradesh /

TIRUPATI ENGINEERING STUDENTS INVENTED NEW DEVICE FOR FARMERS TO STEP OUT OF PROBLEMS IN CHITTOOR DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT

Smart Device for Farmers: రైతుల కోసం ఇంజనీరింగ్ విద్యార్థుల అద్భుత సృష్టి.. నీటికష్టాలకు చెక్ పడినట్లే..!

రైతుల కోసం స్మార్ట్ డివైజ్ రపొందించిన విద్యార్థి

రైతుల కోసం స్మార్ట్ డివైజ్ రపొందించిన విద్యార్థి

Farmers Problems: ప్రభుత్వాలు, అధికారులు వారికి ఎన్ని పథకాలు అమలు చేసినా పూర్తిస్థాయిలో సమస్యలు తీరడం లేదు. అలాంటి రైతులను కష్టాల కడలి నుంచి గట్టెక్కించేందుకు ఇండనీరింగ్ విద్యార్థుల (Engineering Students) బృందం అద్భుతమే సృష్టిచింది.

ఇంకా చదవండి ...
  GT Hemanth Kumar, Tirupati, News18

  Smart Device for Farmers: ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతన్నలకు నిత్యం సమస్యలే. విత్తునాటిన దగ్గర్నుంచి పంట చేతికొచ్చేవరకు ప్రతిక్షణం సమస్యలతోనే సవాసం చేయాల్సిన పరిస్థితి. అన్నీ చక్కగా ఉన్నా ప్రకృతి కనికరిస్తుందన్న నమ్మకం లేదు. వేసిన పంటను చంటి బిడ్డను తల్లి కాపాడుకుంటున్నట్లు రైతన్న తన పంటను ప్రతినిత్యం కాపాడుకుంటూ వస్తాడు. సరైన సమయంలో నీటిని అందించేందుకు పగలు రాత్రి అనే తేడాలేకుండా శ్రమిస్తుంటాడు రైతన్న. రాత్రి సమయాల్లో చిమ్మ చీకటిని సైతం లెక్క చేయకుండా.. నీరు విడుదల చేసేందుకు పొలాల వద్దకు వెళ్తుంటారు. అలాంటి సమయాల్లో కొందరు రైతులు విద్యుత్ షాక్ లకు, మరికొందరు పాముకాట్లకు బలవుతుంటారు. ఐతే ప్రభుత్వాలు, అధికారులు వారికి ఎన్ని పథకాలు అమలు చేసినా పూర్తిస్థాయిలో సమస్యలు తీరడం లేదు. అలాంటి రైతులను కష్టాల కడలి నుంచి గట్టెక్కించేందుకు ఇండనీరింగ్ విద్యార్థుల బృందం అద్భుతమే సృష్టిచింది.

  రైతుల కష్టాలు తీర్చాలన్న ఆలోచన..
  వ్యవసాయాన్ని నమ్ముకొని రైతన్నలకు తాను చదువుకున్న చదువు ఉపయోగ పడాలని ఓ ఇంజనీర్ సంకల్పించాడు. తనకు తెలిసిన పరిజ్ఞానంతో రైతన్నకు సహాయం చేయాలనీ ఆ యువకుడు తన మిత్ర బృందంతో కలసి సరికొత్త ఆవిష్కరణను రూపొందిచాడు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని  చిత్తూరు జిల్లా (Chittoor District) పీలేరుకు చెందిన షేక్ అల్తాఫ్ కు ఎప్పుడూ చదువుపైనే ధ్యాస. ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో (IIIT) ఇంజనీరింగ్ చదువుతున్నాడు. రైతుల కష్టాలను మీడియాలో చూసిన అల్తాఫ్ కు వారికి ఏదైనా ఉపయోగపడే పరికరాన్ని రూపొందించాలని భావించాడు.

  ఇది చదవండి: గోమాతంటే ఆ రైతుకు ఎంతప్రేమో.. ఆవుదూడకు ఘనంగా బర్త్ డే వేడుకలు..


  మిత్రుల సాయంతో కలసాకారం
  తాను కలలుగన్న ప్రాజెక్టును వెంటనే తన మిత్రులకు తెలిపాడు. నెల్లూరుకు చెందిన ఉమ్మడి విజయ్, మదనపల్లెకు చెందిన గుడుపల్లె అరవింద్, అనంతకు చెందిన ఇర్ఫాన్ భాషా, కడపకు చెందిన జనపాటి మనోజ్, గాది లింగప్పకు వివరించాడు. దీంతో వారంతా నాలుగేళ్ల పాటు కష్టపడి పంటకు సమయానికి నీరు పారించేలా ఇంటెలిజెన్స్ ఇరిగేషన్ బాట్!ను తయారు చేశారు. దీనిని మైక్రో కంట్రోలర్., సెన్సార్లు., మోటార్., సోలార్ ఫ్రేమ్ తో రూపొందించి బ్యాటరీల సహాయంతో పనిచేసేలా రూపొందించారు.

  ఇది చదవండి: ఏపీ ప్రభుత్వంపై ఆనందయ్య సంచలన వ్యాఖ్యలు... పొలిటికల్ ఎంట్రీ ఖాయమా..?


  పక్కా సమాచారం
  ఈ యంత్రానికి ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను కోడ్ చేసి మైక్రో కంట్రోలర్ కు అనుసంధానం చేశారు. ఈ పరికరానికి రూపొందించడానికి సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ అగ్రిప్రెన్యూర్ షిప్ ప్రోగ్రాంలో సైతం శిక్షణ పొందారు. వాతావరణంలో మార్పులు, నీటి పారుదలలో హెచ్చు తగ్గులు, పురుగుల మందు వాడకం వల్ల పంట దిగుబడి తగ్గుబడి తగ్గి రైతులు నష్టపోతున్నారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు అల్తాఫ్ నూతన ఆవిష్కరణ చేశాడు. ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ అనే సాంకేతిక పరిజ్ఞానంతో సెల్ ఫోన్ కు ఈ బాట్ ను అనుసంధానం చేసే విధంగా ఓ యాప్ సైతం రూపొందించారు.

  ఇది చదవండి: భర్తపై వీళ్లకు ఎంతప్రేమో చూడండి..! వాళ్ల ప్రేమకు చిహ్నం ఇదే..!


  ప్రత్యేక యాప్ ద్వారా ఆపరేషన్
  ప్రత్యేక యాప్ ద్వారా ఈ బాట్ ను రైతు ఆపరేట్ చేసే విధంగా డిజైన్ చేశారు. పంటకు ఎంత నీరు వెళ్ళింది, భూమిలో తేమ శాతం ఎంత.., వాతావరణంలో మార్పులను ఈ ఇంటిలిజెన్స్ బాట్ ద్వారా తెలుసుకోవచ్చు. పాలిహౌస్, గ్రీన్ హౌస్ పంటలకు ఇది బాగా పనిచేస్తుంది. రైతులు అందుబాటులో లేకపోయిన ఈ బాట్ పనిచేయడంతో రైతుల కష్టాలు దాదాపు తగ్గినట్లే. పంటకు అవసరమైన నీరు మాత్రమే ప్రవహించేలా చేయడంతో పంట దిగుబడి బాగా వచ్చేలా చేయవచ్చు.

  ఇది చదవండి: దేవుడి వరమంటే ఇదేనేమో..! బిడ్డలు దూరమైన రోజే కవలలు జననం..


  కేంద్రం ఆర్ధికసాయం
  అల్తాఫ్ బృందం రూపొందించిన పరికరం రైతులకు ఉపయుక్తంగా ఉండటంతో హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్స్‌ టెన్షన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ రూ.3.3లక్షల ప్రోత్సాహకాన్ని మంజూరు చేసింది. ప్రయోగదశలో ఉన్న ఈ ఆవిష్కరణను త్వరలోనే పూర్తిచేసి రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామంటోంది అల్తాఫ్‌ మిత్రబృందం.

  మరో ఆవిష్కరణకు సిద్ధం
  ఇక ఆర్థోపెడిక్ పేషంట్లకు మరో పరికరాన్ని కనుగొంటున్నారు ఈ మిత్రబృందం సభ్యులు. కాళ్ళు చచ్చుబడి మంచంపై జీవితాన్ని కొనసాగిస్తున్న వారికీ ఉపయోగపడేలా ఈ పరికరాన్ని రూపొందిస్తున్నారు. ఒక్క వీల్ ఛైర్ ను విశ్రాంతి తీసుకొనే బెడ్ గాను., కాలకృత్యాలు తీర్చుకొనే టాయిలెట్స్., నడవడానికి వీలుగా ఈ చైర్ ను రూపొందిస్తున్నారు. ప్రయోగదశలో ఉన్న ఈ పరికరం త్వరలోనే అందుబాటులో తెచ్చేనందుకు కృషి చేస్తున్నారు అల్తాఫ్.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Engineering, Farmers, Technology, Water problem

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు