Home /News /andhra-pradesh /

TIRUPATI ENGINEERING STUDENTS ARRESTED IN ROBBERY CASE AS PARENTS HELPED THEM IN CHITTOOR DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT

Chittoor: కొడుకు దోపిడీలకు.. తల్లిదండ్రుల స్కెచ్.. అబ్బా ఏం ఫ్యామిలీరా బాబు..! చివరికి ఎలా చిక్కారంటే..!

పోలీసుల అదుపులో నిందితులు

పోలీసుల అదుపులో నిందితులు

Chittoor: అడ్డదారులు తొక్కుతున్న పిల్లలను అమ్మ సన్మార్గంలో ప్రయాణించేలా చేస్తుంది. చెడు వ్యసనాల కోసం అడ్డదారులు తొక్కుతున్న యువతను మందలించాల్సింది తల్లితండ్రులే. కానీ ఓ తల్లిదండ్రులు మాత్రం కొడుకు చేసే నేరాలకు స్కెచ్ వేసి అడ్డంగా బుక్కయ్యారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Chittoor, India
  GT Hemanth Kumar, News18, Tirupati

  అడ్డదారులు తొక్కుతున్న పిల్లలను అమ్మ సన్మార్గంలో ప్రయాణించేలా చేస్తుంది. చెడు వ్యసనాల కోసం అడ్డదారులు తొక్కుతున్న యువతను మందలించాల్సింది తల్లితండ్రులే. ప్రస్తుత సమాజంలో ఎన్నో నేరాలు, మరెన్నో ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. యుక్త వయసురాగానే జల్సాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు యువకులు. వ్యసనాలకు కావాల్సిన డబ్బు సులువుగా దొరకదు. కష్టపడకుండా డబ్బులు సంపాదించాలంటే అడ్డదారులు తొక్కాల్సిందే. ఒకటి దోపిడీలు చేయడం అయితే.. మరొకటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడటం. ఇలా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు (Chittoor) లో వ్యసనాలకు బానిసలైన కొందరు యువకులు ముఠాగా ఏర్పడి డబ్బులు సంపాదించాలని భావించారు. ఎం చేయాలన్న ఆలోచనకు ఓ యువకునికి ఓ మహిళ సూచనలు చేసి... దారి దోపిడీ స్కెట్ వేసింది. ఇంతకు ఆ మహిళ ఎవరో తెలుసుకుని పోలీసులే షాక్ గురయ్యారు.

  గంగాధర నెల్లూరు మండలం కాలేపల్లి సమీపంలో చిత్తూరు-తర్చూరు హైవే వద్ద కేసీసీ నిర్మాణ సంస్థ పలు నిర్మాణాలు చేపడుతోంది. నిర్మాణాలు సజావుగా సాగుతుందా లేదా అక్కడ అవసరాలు ఏంటి అని నిత్యం ఆ సంస్థ పిఆర్ఓ పర్యవేక్షిస్తుంటారు. ఆగస్టు ఒకటో తేదీ కంపెనీ పీఆర్వో జాన్సన్ హైవే పై ప్రయాణం చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా దారి దోపిడీ ముఠా దాడి చేసి 12 లక్షల రూపాయలు దోచుకెళ్లారు. వెంటనే జాన్సన్ చిత్తూరు ఈస్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరి.. గురువారం ఉదయం 5 గంటలకు నిందితులను అరెస్టు చేశారు.

  ఇది చదవండి: ఒంటరి మహిళలే అతడి టార్గెట్.. మాటల్లోకి దించి లాడ్జికి తీసుకెళ్తాడు.. ఆపై మత్తుమందు ఇచ్చి..


  దోపిడీకి పాల్పడ్డవారందరూ చిత్తూరుకు చెందిన యువకులుగా గుర్తాంచారు. ఈ ముఠా గ్యాంగ్ లీడర్ 19 సంవత్సరాల మక్కిని భరత్. అతడు గతంలోనూ పలు నేరాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. మొత్తం 13 మంది నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 11 లక్షల రూపాయలు నగదు,రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, నేరానికి ఉపయోగించిన ఇనుప రాడ్లు స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురు పరారైనట్లు పోలీసులు వెల్లడించారు.

  ఇది చదవండి: వరుసకు చెల్లి.. ప్రేమ పేరుతో వేధింపులు.. చివరికి ఎంత దారుణానికి ఒడిగట్టాడంటే..!

  ఈ దోపిడీకి స్కెచ్ వేసింది మరెవరూ కాదు. గ్యాంగ్ లీడర్ భరత్ తల్లి తేజస్విని. దోపిడీ ముఠాలోని వాళ్లదంరూ 20ఏళ్ల లోపు వయసువారే. జల్సాలు, దురలవాట్లకు బానిసలై నేరాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలింది. ముఠా నాయకుడు మక్కిని భరత్ తో పాటు కే. విక్రమ్, తేజశ్రీ, సందీప్, జి పవన్ కుమార్,ఏ చరణ్ రాజ్,ఏ లవ కుమార్,కె పవన్ కుమార్, వీ కృష్ణ లను రిమాండ్ కు తరలించారు పోలీసులు. రూపేష్, సాయి, పరంధామనాయుడు, ధనరాజ్ లు పరారీలో ఉన్నారు. నిందితుల్లో చాలా మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Chittoor

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు