TIRUPATI EMPLOYEE ARRESTED FOR THEFT FOREIGN CURRENCY IN SRIVARI PARAKAMANI IN TIRUMALA TEMPLE FULL DETAILS HERE PRN TPT
Tirumala Temple: శ్రీవారి పరకామణిలో చోరీ.., విదేశీ కరెన్సీలు మాయం.. ఇది అతడిపనే..!
శ్రీవారి ఆలయం (ఫైల్)
Tirumala: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కోవులైన పవిత్ర పుణ్య క్షేత్ర తిరుమల. ఆనంద నిలయంలో కొలువైన శ్రీవేంకటేశ్వరుని దివ్య మంగళ స్వరూపాన్ని క్షణకాలం దర్శించుకుంటే చాలని భక్తులు పరితపించిపోతారు. ఇలా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తులు నగదును కానుకల రూపంలో హుండీలో సమర్పిస్తుంటారు.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కోవులైన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల (Tirumala). ఆనంద నిలయంలో కొలువైన శ్రీవేంకటేశ్వరుని (Lord Venkateswara Swamy) దివ్య మంగళ స్వరూపాన్ని క్షణకాలం దర్శించుకుంటే చాలని భక్తులు పరితపించిపోతారు. ఇలా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తులు నగదును కానుకల రూపంలో హుండీలో సమర్పిస్తుంటారు. స్వదేశీ కరెన్సీ నోట్ల నుంచి విదేశీ డాలర్ల వరకు శ్రీవారి హుండీలో కానుకల రూపంలో సమర్పించి మొక్కులు చెల్లిచుకుంటారు. హుండీలో వచ్చిన కానుకలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరకమణిలో హుండీ ద్వారా స్వామి వారికి వచ్చిన ఆదాయాన్ని లెక్కిస్తుంటారు. ఈ పరకామణిని నోట్ల పరకామణిని., నాణేల పరకామణి ఏర్పాటు చేశారు టీటీడీ అధికారులు. స్వామి వారికి భక్తి శ్రద్ధలతో సమర్పించే కానుకలను హైసెక్యురిటీ నడుమ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కానీ ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మాత్రం తన చేతివాటం చూపించాడు.
పరకామణిని మండపంలో విదేశీ డాలర్లలను చోరీ చేసిన ఘటన విజిలెన్స్ అధికారుల విచారణలో బయటపడింది. తిరుమలలోని శ్రీవారి ఆలయంలో పరకామణి మండపంలో చిల్లర నాణేలు, కరెన్సీ నోట్లను లెక్కిస్తుంటారు. కరెన్సీ లెక్కింపుకు శాశ్వత, రిటైర్డ్ ఉద్యోగులచే నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పరకామణి మండపంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సైతం విధులు నిర్వహిస్తుంటారు. ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిలో ఎలాంటి దుర్బుద్ధి పుట్టిందేమో గాని.., శ్రీవారికీ భక్తులు సమర్పించే కానుకలను లెక్కింపు చేసే పరకామణి మండపంలో కరెన్సీ నోట్లు చోరికి గురయ్యాయి.
పరకామణి మండపంలో పని చేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఈ చోరికి పాల్పడినట్లు టీటీడీ విజిలెన్స్ అధికారులు సాక్ష్యాలతో సహా నిర్ధారణకు వచ్చారు. చోరికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా విజిలెన్స్ అధికారులకు దిమ్మ తిరిగే విషయాలు బయట పడ్డాయి. గత కొద్దీ నెలలుగా ఈ వ్యక్తి కరెన్సీ నోట్లను చోరీ చేస్తున్నట్లు.., అందులో స్వదేశీతో పాటు విదేశీ కరెన్సీని చోరీ చేసినట్లు చెప్పినట్లు సమాచారం. దీంతో ఉల్లికిపడ్డ విజిలెన్స్ అధికారులు ఈ విషయాన్ని గొప్యంగా వుంచి ఈ ఘటన పై రహస్యంగా దర్యాప్తు చేస్తున్నారు. పరకామణి మండపంలో చోరీ జరిగినట్లు విజిలెన్స్ అధికారులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.
శ్రీవారి సమర్పించే కానుకలు అపహరకు గురి కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఎంతో భక్తి శ్రద్దలతో సమర్పించేనగదు అపహరణ చేయడమేంటని హుండీ కానుకలు మనోభావాలకు సంబంధించిన విషయం కావడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.