Tirupati: ఆ గ్రామాలు నిత్యం గజగజ వణుకుతుంటాయి. మృత్యువు నిత్యం ఆ ఊళ్ల శివార్లలో మకాం వేస్తుంది. వేసవి వచ్చిందంటే ఈ బెడద ఇంకా ఎక్కువవుతోంది. ముందుగా అప్రమత్తమైతే సరి.. ఆదమరిస్తే మాత్రం ప్రాణాలు పోవాల్సిందే. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా వాసులకు గజరాజుల బెడతా తప్పడం లేదు. మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలను దాటి జిల్లాలోని పలు అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తున్నాయి. వేసవి కావడంతో దాహార్తిని తీర్చుకునేందుకు పంట పొలాలు., అటవీ సమీప ప్రాంత గ్రామాల వైపు హాథీలు పరుగులు పెడుతున్నాయి. కర్ణాటక, తమిళనాడు సరిహద్దు అటవీ ప్రాంతాల నుంచి కౌండిన్య అటవీ ప్రాంతం వైపు ఏనుగులను తరిమేస్తున్నారు అక్కడి ఫారెస్ట్ సిబ్బంది. ఏపీ వైపు ఏనుగుల గుంపులు...కౌండిన్య అటవీ ప్రాంతంలో ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. వందల సంఖ్యలో ఇక్కడ ఏనుగులు ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే అంశం పై పలుదపాలు...మూడు రాష్ట్రాల అటవీ శాఖ అధికారులు చర్చలకు కూర్చుకున్న ఫలితం లేకుండా పోయింది.
ఆ ఏనుగులు మీవంటి మీవని గొడవకు దిగినట్లు సమాచారం. ఒకరిపై మరొకరు దూషణలకు దిగిన సందర్భాలు ఉన్నాయని అటవీ శాఖ సిబ్బంది వాపోతున్నారు. ఒకరిపై మరొకరు దూషణలకు దిగటం తప్ప ఏనుగులు అటవీ ప్రాంతం నుంచి బయటకు రాకుండా ఉందేందుకు మూడు రాష్ట్రాల అధికారుల నిర్లక్ష్య ధోరణి పొట్టోచ్చినట్లు కనపడుతోంది. అధికారుల నిర్లక్ష్య ధోరణికి రైతులు బలైపోతున్నారు.
ఇప్పటికే కర్ణాటక తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న.., రైతులు గ్రామస్థులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఏనుగులు పంట పొలాలపై ఎప్పుడు దాడి చేస్తాయో.., వాటి దాడిలో ఎక్కడ చనిపోతామొనని గ్రామస్థులు బిక్కుబిక్కు మంటూ బ్రతుకుతున్న పరిస్థితి. ఏనుగుల బారి నుంచి మమల్ని కాపాడండి మహాబ్రభో అంటూ రైతులు, సరిహద్దు గ్రామా ప్రజలు పలమనేరు లోని ఫారెస్ట్ కార్యాలయాన్ని ముట్టడించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేసారు.అటవీ ప్రాంతం చుట్టూ గంధకాలు త్రవించి, సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి తమను కాపాడాలని అటవీ శాఖ అధికారులను ప్రాధేయ పడ్డారు. న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకు ఫారెస్ట్ కార్యాలయం నుంచి వెళ్ళేదే లేదని స్పష్టం చేసారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించడంతో స్థానిక సీఐ చొరవతో నిరసన ముగించారు.
గ్రామస్థుల నిరసన జరిగిన 10 రోజుల అనంతరం తంజావూరు గ్రామంలో వేకువజాము తొమ్మిది ఏనుగుల గల గుంపు పంట పొలాల వైపు వచ్చి ధ్వంసం చేస్తుంటే...రైతులు ఏనుగులను తరిమే ప్రయత్నం చేశారు. తరిమే క్రమంలో ఏనుగులు రైతులపై ఎదురు దాడికి దిగాయి. దాడిలో తంజావూరు గ్రామానికి చెందిన వల్లిగన్ అనే రైతును తీవ్రంగా గాయపరిచడంతో వల్లిగన్ అక్కడికక్కడే మరణించాడు. రైతులు వల్లిగన్ ను ఏనుగుల బారి నుంచి కాపాడాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
ఇకనైనా అటవీ శాఖా అధికారులు తమపై కరుణ చూపాలని కోరుతున్నారు బాధిత గ్రామస్థులు. అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు బయటకు రాకుండా ఎయిర్ గన్., బాణాసంచాలు పేల్చి గ్రామాలవైపు రాకుండా చూడాలని కోరుతున్నారు. అటవీ ప్రాంతం వైపు నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలని అభ్యర్థిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Elephant attacks