8 Years Boy feeding Family : ఎనిమిదేళ్ల వయసులోనే కుటుంబ భారం.., ఆ చిన్నారి కష్టం ఎవరికీ రాకూడదు..

ఆటో నడుపుతున్న రాజగోపాల్ రెడ్డి

Andhra Pradesh: ఎనిమిదేళ్ల వయసంటే డబ్బులు, సంపాదన, కుటుంబ పోషణ అనే పదాలకు అర్ధం తెలియని వయసు. కానీ ఓ చిన్నారి మాత్రం కుటుంబానికి తానే పెద్దదిక్కయ్యాడు.

  • Share this:
    GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18

    ఆటలాడుకుంటూ... పాటపాడుకుంటూ....హాయిగా సాగే జీవితమే బాల్యం. పెద్దలు చెప్పినట్లు స్కూళ్లకు వెళ్లడం, గురువులు చెప్పిన పాఠాలు నేర్చుకోవడం., బడి సమయం కాగానే బయట తోటి విద్యార్థులతో సరదాగా ఆటలు ఆడుకోవడం చిన్నారులు చేస్తుంటారు. అసలు సంపాదన కుటుంబ భారం అంటే ఏంటో తెలియని అమాయకత్వం వారిది. కానీ ఓ చిన్నారికి మాత్రం అడుకోవాల్సిన వయసులో అనుకోని కష్టం వచ్చి పడింది. ఎనిమిదేళ్ల వయసులో కుటుంబ బాధ్యతలను ఆ బుడ్డోడు మోస్తున్నాడు. అమ్మనాన్నలతో సహా ఇద్దరు తమ్ముళ్ల పోషణకు తన రెండు రెక్కలు ముక్కలు చేసుకుంటూ తన కుటుంబానికి పెద్దదిక్కుగా మారాడు. తాను ఒక్కరోజు పనికి వెళ్లకుంటే... అమ్మానాన్నలు, తమ్ముళ్లు పస్తులుండాల్సిన దుస్థితి. కుటుంబ పోషణకు ఆ చిన్నారి శ్రమిస్తున్న తీరు చూస్తే.., అయ్యో అనిపించక మానదు.

    వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ లోని  చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజవర్గంలో ఓ యువకుడు కారులో వెళ్తున్నాడు. వెళ్లే దారిలో నూతనంగా మార్కెట్లోకి వచ్చిన బ్యాటరీ ఆటోను చూశాడు. ఆటో నడిపే వ్యక్తిన చూసిన ఆ యువకుడు ఒక్కసారిగా అవాక్కఅయ్యాడు. ఆ బ్యాటరీ ఆటో నడుపుతోంది యువకుడో, వృద్ధుడో కాదు... ఎనిమిదేళ్ల చిన్నారి రాజగోపాల్ రెడ్డి. పసివాడైన రాజగోపాల్ రెడ్డి ఆటో నడపడాన్ని గుర్తించిన ఆ యువకుడు వెంటనే అక్కడ ఆగిపోయి ఇంత చిన్న వయసులో ఎందుకు ఆటో నడుపుతున్నావ్ అని ప్రశ్నించారు.

    ఇది చదవండి: ఏపీకి అలర్ట్... సెప్టెంబర్ నెలంతా వానలే.. ముఖ్యంగా ఈ జిల్లాల్లో..


    దీంతో ఘటన చూసిన జనం... ఒక్కసారిగా ఆ ఆటో వద్ద గుమిగూడారు. జనమంతా రావడంతో ఆ బాలుడు కంగారుపడిపోయాడు. నీకు ఏమి కాదు ఎందుకు ఆటో నడుపుతున్నావ్ అని ప్రశ్నించగా.., వెనుక కూర్చొని ఉన్న వ్యక్తి నుంచి అనూహ్య సమాధానాలు వచ్చాయి. తాను ఆటో నడుపుతున్న బాలుడు రాజగోపాల్ రెడ్డి తండ్రినంటూ ఆటో వెనకున్న వ్యక్తి సమాధానం ఇచ్చాడు. రాజగోపాల్ రెడ్డి తన పెద్దకుమారుడని.. ఇంటులో మరో ఇద్దరు కొడుకులున్నట్లు చెప్పాడు. ముగ్గురు కొడుకులున్న తాము అంధులమని తన కష్టాన్ని చెప్పుకున్నాడు.

    ఇది చదవండి: బస్ టికెట్ల బుకింగ్ కు కొత్త యాప్... అభి బస్ తో ఏపీఎస్ ఆర్టీసీ బిగ్ డీల్...


    చిత్తూరు జిల్లా గంగులపల్లికి చెందిన అంధ దంపతుల కుమారుడు రాజగోపాల్ రెడ్డి. తల్లిదండ్రులిద్దరికీ చూపులేకపోవడంతో కుటుంబ పోషణ భారం ఎనిమిదేళ్ల చిన్నారిపై పడింది. తల్లిదండ్రులతో పాటు తమ్ముళ్లకు పట్టెడన్నం పెట్టేందుకు ఈ-రిక్షాలో గ్రామాల్లో తిరుగుతూ ఉప్పు, పప్పుదినుసులు, ఇతర నిత్యావసరాలు విక్రయిస్తూ పొట్టపోసుకుంటున్నాడు. ఎనిమిదేళ్ల వయసులో ఆటో నడపడం చట్టరీత్యా నేరమైనప్పటికీ కడుపు నింపుకోవాలంటే తప్పదని వారు చెప్తున్నారు.

    రాజగోపాల్ ఒక్కరోజు ఆట తీయకుంటే ఆ కుటుంబానికి ఆ రోజు తిండిగింజలు లేనట్లే. డబ్బులుంటే ఏంటీ.. సంపాదనకు అర్ధమేంటి అనే చెప్పినా అర్ధం చేసుకునేలేని వయసు రాజగోపాల్ రెడ్డిది. అయినా సరే ఇంత చిన్నవయసులో కుంటుంబ భారాన్ని తన భుజాలపై వేసుకొని విధికి ఎదురుదీతున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వంగానీ, నేతలు గానీ స్పందించి ఆ చిన్నారి కుటుంబానికి అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు.
    Published by:Purna Chandra
    First published: