• HOME
 • »
 • NEWS
 • »
 • ANDHRA-PRADESH
 • »
 • TIRUPATI EARTHWORMS SMUGGLING TURNED INTO A SYNDICATE BUSINESS NEAR PULICAT LAKE IN NELLORE DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Andhra Pradesh: ఏపీలో జోరుగా వానపాముల స్మగ్లింగ్.. ఎందుకంత గిరాకీ..?

Andhra Pradesh: ఏపీలో జోరుగా వానపాముల స్మగ్లింగ్.. ఎందుకంత గిరాకీ..?

ఏపీలో వానపాములకు గిరాకీ

ఈ వ్యాపారంలో అక్రమార్కులు సిండికేట్ గా మారి వ్యాపారం చేస్తున్నారు. వీరికి రాజకీయ నాయకుల అండ ఉండటంతో రెచ్చిపోతున్నారు.

 • Share this:
  మనిషికి డబ్బంటే పిచ్చి. అది లేదినిదే బ్రతకలేరు. కొందరు డబ్బు సంపాదించేందుకు సన్మార్గాలు ఎంచుకుటుండగా.. మరికొందరు తప్పుడు మార్గాల్లో వెళ్తున్నారు. ఇందుకోసం మనిషికి సహకరించే జీవులను అక్రమంగా సంపాదిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇన్నాళ్లూ అడవి జంతువులు, ఎర్రచందనం మీద పడ్డ అక్రమార్కులు ఇప్పుడు రూటుమారుస్తున్నారు. ఎవరూ అనుమానించని.. ఎవరూ అడ్డుకోని జీవులను అక్రమంగా తరలిస్తూ లక్షలు వెనకేసుకుంటున్నారు. ఇంతకీ వీళ్లు స్మగ్లింగ్ చేసేంది ఏంటో తెలుసా..? వానపాములు...! అవును నిజమే.. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లో విస్తరించి ఉన్న పులికాట్ సరస్సు చేపలు, పక్షులకే కాదు వానపాముల లాంటి చిన్నచిన్న జీవులకు ఆలవాలం. సరస్సులో మత్స్యసంపదతో పాటు పలురకాల జీవరాశుల అభివృద్ధికి తోడ్పడుతున్న వానపాముల మనుగడ ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. సరస్సు వెంబడి చిత్తడి నేలల్లో అక్రమంగా తవ్వకాలు చేపడుతూ వానపాములను సేకరిస్తున్న కొన్నిముఠాలు వాటిని అక్రమంగా అమ్మేస్తున్నాయి. ప్రస్తుతం పులికాట్ ప్రాంతంలో వానపాముల సేకరణ ఓ మాఫియాలా మారింది. రాజకీయ నాయకుల అండదండలో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇదంతా బహిరంగానే జరుగుతున్నా అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు.

  సాధారణ వానపాముల కంటే పులికాట్ తీరంలో దొరికే పానపాములు లావుగా, పొడవుగా ఉంటాయి. సరస్సులోకి చేరే చెత్త, ఇతర కళేబరాలను భూమిలో కుళ్లేందుకు ఇవి సాయపడతాయి. దీని ద్వారా మరిన్నిజీవరాశులు ఉత్పత్తి అయి వలసపక్షలకు మంచి ఆహారాన్ని అందిస్తున్నాయి. సరస్సు సమీపంలో ఉండే పేదలను బుట్టలో వేసుకుంటున్న అక్రమార్కులు.. కిలో వానపాములకు రూ.1000 నుంచి రూ.1200 వరకు ముట్టజెబుతున్నారు. దీంతో వారంతా వానపాముల సేకరణకే పరిమితమవుతున్నారు. ప్రస్తుతం ఈ పని గిట్టుబాటవుతుండటంతో పలువురు వానపాముల సేకరణే వృత్తిగా ఎంచుకుంటున్నారు. సేకరించిన వానపాములను మట్టికుండలు, థర్మాకోల్ బాక్సులు, పాలితిన్ కవర్లలో పెట్టి అనుమానం రాకుండా తరలిస్తున్నారు.

  ఇదీ చదవండి: మండు వేసవిలోనూ ‘గజగజ' వణుకుతున్న గ్రామాలు.. ఎందుకో తెలుసా..?


  ఎందుకంత గిరాకీ..?
  వానపాములను ఆక్వా సాగులో ఆహారంగా వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఆక్వాసాగు విస్తీర్ణం పెరుగుతండటంతో పిల్లరొయ్యలకు గిరాకీ ఏర్పడుతోంది. దీంతో తల్లిరొయ్యలకు మేతగా వానపాములను వినియోగిస్తున్నారు. వానపాములను ఆహారంగా వేయడం వల్ల రొయ్యలు ఎక్కువ గుడ్లను పెడతాయని ఆక్వా సాగుదారులు నమ్ముతున్నారు. దీంతో కొందరు హేచరీల యజమానులు కిలో వానపాములకు రూ.3వేల నుంచి రూ.4వేల వరకు చెల్లిస్తున్నారు. ఇంత జరుగుతున్న వన్యప్రాణి సంరక్షణ అధికారులు మాత్రం ఫిర్యాదులు వస్తే తప్ప పట్టించుకోవడం లేదు.

   ఇది చదవండి: ఆ విషయంలో టీటీడీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందా...? అన్నీ శ్రీవారే చూసుకోవాలా..?


  ప్రస్తుతం వేనాడు, ఇరకం, వాటంబేడు ప్రాంతాల్లో వానపాముల వ్యాపారం జోరుగా సాగుతోంది. హైవేపై తనిఖీలు జరుగుతుంటే.. పడవలాల్లో తమిళనాడు వైపుకు తీసుకెళ్లి.. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. తమిళనాడులో వానపాముల సేకరణపై నిషేధం లేకపోవడంతో ఈ వృత్తి యథేచ్ఛగా సాగుతోంది.
  Published by:Purna Chandra
  First published: