Home /News /andhra-pradesh /

TIRUPATI DRUNKEN HUSBAND CLIMB CELL TOWER FOR IN LAWS NOT SENDING HIS WIFE IN CHITTOOR DISTRICT ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT

Wife and Husband: అత్తను అరెస్ట్ చేస్తేనే టవర్ దిగుతా.. అల్లుడు చేసిన పనికి పరుగులు పెట్టిన పోలీసులు..

అత్తమీద కోపంతో సెల్ టవర్ ఎక్కిన అల్లుడు

అత్తమీద కోపంతో సెల్ టవర్ ఎక్కిన అల్లుడు

Wife and Husband: కాపురం అన్న తర్వాత చిన్నచిన్న కలహాలు వస్తూనే ఉంటాయి. భార్యాభర్తలు ఒకరినొకరు అర్ధం చేసుకోని ముందుకెళ్తే సంసారం సజావుగా సాగుతుంది. అలా కాదని ఇద్దరిలో ఎవరు తగ్గకపోయినా నిత్యం గొడవలు జరుగుతూనే ఉంటాయి.

    GT Hemanth Kumar, Tirupathi, News18

    కాపురం అన్న తర్వాత చిన్నచిన్న కలహాలు వస్తూనే ఉంటాయి. భార్యాభర్తలు ఒకరినొకరు అర్ధం చేసుకోని ముందుకెళ్తే సంసారం సజావుగా సాగుతుంది. అలా కాదని ఇద్దరిలో ఎవరు తగ్గకపోయినా నిత్యం గొడవలు జరుగుతూనే ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితం పెళ్లికి ముందు ఒకలా.. పెళ్లి తర్వాత మరోలా ఉంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత కుటుంబ పోషణ, బాధ్యతలు మీదపడతాయి. భార్యాపిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వడం భర్త విధి. అలా కాకుండా తన సుఖం తాను చూసుకొని వ్యసనాలకు బానిసైతే చిక్కులు తప్పవు. అలా పెళ్లైన పిల్లలున్న ఓ వ్యక్తి తాగుడుకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు. దీంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఐతే భార్యకు నచ్చజెప్పి కాపురానికి తీసుకొద్దామనుకున్న భర్తకు.. అత్తింటివారు షాకిచ్చారు. దీంతో ఎలాగైనా అత్తింటివారిని తన దారికి తెచ్చకోవాలన్న ఉద్దేశంతో పోలీసులు, అధికారులను పరుగులు పెట్టించాడు. పోలీసులు కూడా కాస్త తెలివిని ఉపయోగించి అతగాడిని కంట్రోల్ చేశారు.

    వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలోని రాజీవ్ నగర్లో క్రాంతి, ప్రమీల దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఒక పాప ది. క్రాంతి పెయింటర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఐతే మద్యం అలవాటున్న క్రాంతి వచ్చిన కాస్త సంపాదనను తాగుడికే ఖర్చు చేస్తూ కుటుంబాన్ని సరిగా పట్టించుకోవడం లేదు. దీంతో అప్పుడప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కొన్నాళ్ల భర్త వేధింపులను భరించిన ప్రమీల.. తనకష్టాన్ని తల్లితో చెప్పుకొని బాధపడింది.

    ఇది చదవండి: భర్తకు ఫోన్ చేసి నీ భార్యను పంపాలంటూ వేధింపులు.. పోలీస్ కంప్లైంట్ ఇస్తే సీన్ రివర్స్..


    ఐతే కూతురు తనదగ్గర ఉంటే అల్లుడు మారతాడని భావించిన ప్రమీల తల్లి ఆమెను పుట్టింటికి తీసుకెళ్లిపోయింది. పలుసార్లు ఇంటికి రావాలని భార్యను కోరినా ఆమె వినకపోవడంతో తాను తాగుడు మానేశానని రావాలని కోరాడు. భర్త మాటలు నమ్మిన ప్రమీల ఇంటికి వచ్చింది. కొన్నిరోజులు బాగానే ఉన్న క్రాంతి మళ్లీ తాగుడు మొదలుపెట్టాడు. ఈ విషయంలో గొడవ జరగడంతో భార్యను చితకబాదాడు. దీంతో ఆమె మళ్లీ పుట్టింటకి వెళ్లిపోయింది.

    ఇది చదవండి: కట్టుకున్న భర్తే అంత మాట అనే సరికి తట్టుకోలేకపోయింది... ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది


    ప్రమీలను మెట్టినింటికి పంపేది లేదని ఆమె తల్లి, అన్న,.. క్రాంతికి తెగేసి చెప్పారు. భార్య ఇంటికి రాకపోవడం, అత్తింటివారు ఎదురుతిరగడంతో వారిని ఎలాగైనా దారికి తెచ్చుకోవాలని భావించిన క్రాంతి.. మదనపల్లె- పుంగనూరు రోడ్డులోని డీఎస్పీ కార్యాలయానికి ఎదురుగా ఉన్న సెల్ టవర్ ఎక్కాడు. స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో అతడ్ని కిందకు దించే ప్రయ్నం చేశారు. ఐతే సబ్ కలెక్టర్ వచ్చేవరకు తాను దిగనని.. ఆయనకే తన కష్టం చెప్పుకుంటానని భీష్మించుకొని కూర్చున్నాడు.

    ఇది చదవండి: మూడేళ్లు వెంటపడి అమ్మాయిని పెళ్లికి ఒప్పించాడు.. తాళి కట్టిన తర్వాతి రోజే ట్విస్ట్

    కాసేపటికి భార్య అక్కడికి వచ్చి బ్రతిమిలాడినా క్రాంతి వినలేదు. తన అత్తను, బావమరిది కారణంగానే భార్య కాపురానికి రావడం లేదని వారిని అరెస్ట్ చేస్తేగానీ దిగనని స్పషఅటం చేశాడు. ఐతే పోలీసులు వాళ్లిద్దరినీ పిలిపించి కేసు నమోదు చేస్తున్నట్లు చెప్పడంతో ఎట్టకేలకు క్రాంతి కిందకు దిగివచ్చాడు. మొత్తానికి పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి క్రాంతిని కిందకు దించారని స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Chittoor, Wife and husband

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు