హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: దేవస్థానంలో దారుణం.. మానవత్వం మరచి ఇంత దారుణమా..? ఏం జరిగింది అంటే?

Andhra Pradesh: దేవస్థానంలో దారుణం.. మానవత్వం మరచి ఇంత దారుణమా..? ఏం జరిగింది అంటే?

జొన్నవాడ కామక్ష్మి టెంపుల్ లో దారుణం

జొన్నవాడ కామక్ష్మి టెంపుల్ లో దారుణం

Andhra Pradesh: కొన్ని సార్లు వారు చూసేందే నిజమనుకుని.. విచక్షణా రహితంగా ప్రవర్తిస్తుంటారు కొందరు. అవతల వారు ఏం చెప్పినా నమ్మరు.. వినే ప్రయత్నం కూడా చేయరు. అలా ఓ వ్యక్తి ఆవేశానికి ఓ యువకుడు నరకం అనుభవించాడు.

 • News18 Telugu
 • Last Updated :
 • Nellore, India

  GT Hemanth Kumar, Tirupathi, News18

  Andhra Pradesh: కొందరు మనుషులు అప్పుడప్పుడు మానవత్వాన్ని మరిచిపోతారు. నరరూప రాక్షసులుగా మారుతారు. అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటారు. వారి ప్రవర్తనతో ఎదుటి వారిని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. ఏదైనా తప్పు జరిగితే.. అది ఎవరు చేశారు..? అసలు ఆ వ్యక్తి తప్పు చేశాడో లేదో తెలియకుండానే శిక్షలు వేసేస్తుంటారు. అది కూడా అతి దారుణంగా..  విచక్షణా రహితంగా దాడి చేస్తున్న సంఘటనలు నిత్యం చూస్తూనే ఉంటాం. అలాంటి దారుణమే జొన్నవాడ కామాక్షి ఆలయం (Jonnavada Kamkshi Temple) లో చోటు చేసుకుంది.

  అసలు ఏం జరిగింది అంటే..? ఇద్దరు యువకులు వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇద్దరు మాట్లాడుకుంటూ సరదాగా ఆ వీధిలో నడుస్తుండగా... సడన్ గా ఓ కుక్క (Dog) భీకరంగా అరవ సాగింది. కుక్కను చూసిన ఇద్దరు యువకులు భయంతో పరుగులు తీశారు. ఇంతలో ఓ వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. కట్టేసిన కుక్కను ఆ ఇద్దరు యువకులపై కుక్కను ఉసిగొల్పాడు. కుక్క దాడికి ఓ యువకుడు బలి అవ్వగా..  మరో యువకుడు తప్పించుకున్న ఘటన సంచలనంగా మారింది. 

  నెల్లూరు జిల్లా (Nellore District) బుచ్చిరెడ్డి పాలెం మండలం జొన్నవాడ (Jonnavada) లో రాత్రి సమయంలో ఇద్దరు యువకులు.. నడుచుకుంటు వస్తున్నారు. ఇద్దరు తమ సాధక బాధలు చర్చించుకుంటూ నెమ్మదిగా వెళ్తున్నారు. అసలే కాస్త చీకటి కావడంతో అటు ఇటు వీధి కుక్కలు స్వైర వివాహం చేస్తున్నాయి. దింతో కుక్కలు ఉన్న చోట నిదానంగా అటు ఇటు చూస్తూ నడవ సాగారు. ఒక్కసారిగా భారీ ఆకారం ఉన్న కుక్క గట్టిగ మొరగటం ప్రారంభించింది.

  ఆ కుక్క మొరగటం చూసిన ఇద్దరు యువకులు భయానికి గురైయ్యారు. కుక్క దగ్గర నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని పరుగులు పెట్టారు. అదే సమయంలో ఇంటి బయటకు వచ్చిన కుక్క యజమాని రమేష్ పరుగులు తీస్తున్న ఉద్దరు యువకులను చూసి... దొంగలుగా భావించాడు. వెంటనే కుక్కను ఉసిగొల్పి యువకులపైకి తరిమాడు.

  ఇదీ చదవండి : హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుకు కారణం ఇదే.. ఎన్టీఆర్ పేరు పెట్టమని టీడీపీ ముందుకు రావాలన్న జగన్

  దీన్ని గుర్తించిన ఇద్దరు యువకులు తమ పరుగులో వేగం పెంచారు. అందులో ఓ యువకుడు కుక్క కాటుకు బలైయ్యాడు. మరో యువకుడు అక్కడ నుంచి తప్పించుకొని పారిపోయాడు. కుక్క కాటుతో కిందపడిన ఆ యువకుడిని  రమేశ్ విచక్షణా రహితంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా కుక్కతో మల్లి మల్లి మళ్లీ కరిపించాడు. తాను దొంగను కాదు కుక్కను చూసి పారిపోతున్నాను అని చెప్పిన వినకుండా... ఆ యువకుడిని స్థానిక  దేవస్థానం ప్రాంగణంలోకి తీసుకెళ్లరూ.

  ఇదీ చదవండి : ఈ నెల 27న తిరుమలకు సీఎం జగన్ .. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రమ్మని ఆహ్వానం

  అక్కడ తాను మనిషిని అనే మానవత్వం మరచి గొలుసులతో కట్టివేసి విచాకక్షణ రహితంగా కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. స్ప్రహ కోల్పోయేలా దాడి చేసాడు. ఈ దారుణాన్ని చూసిన స్థానికులు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దీనిపై ఫిర్యాదు అందలేదని ఎస్సై వీరప్రతాప్ తెలిపారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, Hindu Temples, Nellore Dist

  ఉత్తమ కథలు