GT Hemanth Kumar, Tirupathi, News18
Tirumala: ఆనంద నిలయమై.. భక్తుల పాలిట కల్పతరువై. . శ్రీశ్రీనివాసుని ముక్తి మార్గం సప్తగిరుల్లో వెలసిన పుణ్య క్షేత్రమే తిరుమల (Tirumala). కలియుగ వైకుంఠంలో కొలువైన శ్రీవారిని వివిధ నామాలతో భక్తులు భజన చేస్తుంటారు. గోవింద నామ స్మరణ చేస్తూ ఉంటారు. అందులో మనం ఎక్కువగా స్మరించే నామాల్లో ఒకటి ఆనంద నిలయ గోవింద. అసలు ఆనంద నిలయం అంటే ఏమిటి..? ఆ పేరు ఎలా వచ్చింది..? అంటే పెద్ద కథే ఉంది. కలియుగంలో భక్తుల రక్షణార్థం ఇలవైకుంఠంలో శ్రీ వెంకటేశ్వ స్వామి (Lord Venkateswara Swamay) వెలసినాడు శ్రీహరి. అచెంచలమైన భక్తి భావంతో భక్తులు నిత్యం లక్షల సంఖ్యలో తిరుమలకు చేరుకొని ఆనంద నిలయంలో కొవులైన శ్రీవారిని దర్శించుకుంటారు. కలియుగ వైకుంఠంలో వెలసిన శ్రీవారి దర్శనార్థం దేశవిదేశాల నుంచి భక్తులు తరలివచ్చి.. ఆపద మొక్కులవాడ గోవిందా., ఆనంద నిలయ గోవింద...గోవిందా అంటూ స్వామి వారిని స్మరిస్తూ ఉంటారు.
ఎన్ని నామాలతో పిలిచినా పలుకుతూ.. భక్తుల కష్టాలు.. కోర్కెలను శ్రీ వెంకటేశ్వర స్వామి వచ్చి తీర్చుతారని భక్తుల విశ్వాసం. స్వయం వ్యక్తమై వెలసిన ఈ క్షేత్రం భక్తుల పాలిట కల్పతరువు.. స్వామి వారిని దర్శిస్తే సకల పాపాలు తొలగి ముక్తి మార్గం వస్తుందంటారు. అందుకే శ్రీవారి ఆనంద నిలయం నిత్యకల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతోంది. అసలు ఆనంద నిలయం అంటే ఏంటో తెలుసా?
శ్రీ శ్రీనివాసుడు అర్చావతారమూర్తిగా కొలువైన దివ్య సన్నిధే ఆనందనిలయం. ఆ ఆనంద నిలయానికి భౌతిక రూపమే భౌతిక స్వరూపమే విమానం. అందువల్ల తిరుమలలోని శ్రీవేంకటేశ్వరుని గర్భగుడి మీద గల సువర్ణమయ నిర్మాణాన్ని ఆనంద నిలయ విమానం అంటారు. విష్ణుదేవుని ఆన మేరకు గరుత్మంతుడు వైకుంఠం నుంచి క్రీడాచలాన్ని భూలోకానికి తీసికొని వచ్చినట్లు, దానిని సువర్ణముఖీ నదికి ఉత్తరం వైపున్న శేషాచల కొండలలో ప్రతిష్ఠించినట్లు ఆ క్రీడాద్రి మీద భూవరాహస్వామి శ్వేతవరాహకల్పం నుంచి నివసిస్తున్నట్లు అనేక పురాణాలు పేర్కొన్నాయి.
ఇదీ చదవండి : చెవిరెడ్డి రాజకీయ సన్యాసం..! సీఎం జగన్ విరవిధేయుడు నిర్ణయానికి కారణం అదేనా?
తిరుమల చరిత్రను ప్రామాణికంగా తీసుకొనే శ్రీ వేంకటాచలమాహాత్మ్యంలోని భవిష్యోత్తర పురాణంలో ఒక కథ ఉంది. ఒక రోజు వాయుదేవుడు ఆదిశేషునితో వాదిస్తూ పందానికి దిగాడు. పందెం ప్రకారం ఆదిశేషుడు మేరుపర్వత పుత్రుడైన ఆనందపర్వతాన్ని చుట్టుకొన్నాడు. అతనిని కదలించడానికి వాయు దేవుడు తన సామర్థ్యం అంతా వినియోగించినా వీలుకాలేదు. చివరకు శేషునితో ముడిపడిన ఆనందాద్రిని భూలోకంలో సువర్ణముఖీనది ఉత్తర ఒడ్డుకు తోశాడు. శేషుడు పశ్చాత్తాపంతో శేషాచలపర్వతంగా రూపొందాడు. ఆతని శిరస్సు మీద ఆనందపర్వతం ఆనందనిలయ విమానంగా మారిపోయింది. ఇది ఆనందనిలయ విమానపుట్టుక రహస్యమని పురాణాలూ చెప్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Tirumala, Tirumala tirupati devasthanam, Ttd news