హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Minister Narayana Swamy: అలా చేస్తే ఉరేసుకుంటా... చంద్రబాబుకు ఏపీ మంత్రి సవాల్..

Minister Narayana Swamy: అలా చేస్తే ఉరేసుకుంటా... చంద్రబాబుకు ఏపీ మంత్రి సవాల్..

డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

ఇటీవల టీడీపీపై (Telugu Desham Party) సంచలన వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ( CY CM Narayana Swamy) ప్రతిపక్ష నేత చంద్రబాబుకు (Nara Chandra Babu Naidu) మరో సవాల్ విసిరారు.

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan  Reddy) హాలిడే ట్రిప్ కు సిమ్లా వెళ్లినా.. రాష్ట్ర రాజకీయాలు మాత్రం వేడెక్కుతూనే ఉన్నాయి. కొన్నిరోజులుగా డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి (Minister Narayana Swamy) ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై (Nara Chandra Babu Naidu) అంతెత్తున లేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య టీడీపీపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్న నారాయణ స్వామి.. ఇటీవల టీడీపీ(Telugu Desham Party) సామర్ధ్యం, చంద్రబాబు రాజకీయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. టీటీపీకి ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసే దమ్ములేదన్న నారాయణ స్వామి.. ఒంటరిగా బరిలో దిగి రెండు సీట్లు గెలిస్తే చంద్రబాబు ఇంట్లో పాకీ పనిచేస్తానని సవాల్ విరిసారు. నారాయణ స్వామి కామెంట్స్ పై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే జరిగింది. ఎప్పుడూ సౌమ్యంగా మాట్లాడే నారాయణ స్వామి ఈ రేంజ్ లో సవాల్ చేయడంతో ఒకింత అందరూ ఆశ్చర్యపోయారు. తాజాగా నారాయణ స్వామి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన నారాయణ స్వామి... చంద్రబాబుపై మండిపడ్డారు. ప్రతిపక్షపార్టీ నేతలు పనిగట్టుకుని తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు . కాణిపాకం వినాయకుడి సాక్షిగా చంద్రబాబు తనపై చేసిన ఆరోపణలను నిరూపించడానికి సిద్ధమా అని ప్రశ్నించారు. దళితులంటే చంద్రబాబుకు చిన్నచూపని, అణగారిన వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టే తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూస్తూ వారి అభ్యున్నతికి నిరంతరం పోరాటం చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎపిలో జగనన్న ఇళ్ళ నిర్మాణం జరుగుతోందని.., ప్రభుత్వం చేస్తున్న అభివృద్థిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. విద్య,వైద్యానికి సిఎం పెద్ద పీట వేస్తున్నారన్నారు. టిడిపి హయాంలో జరిగిన అభివృద్ధి శూన్యమని.., నవరత్నాలను విమర్సించే అర్హత చంద్రబాబుకు లేదన్నారు.

  ఇది చదవండి : రాహుల్ ను అందుకే చంపాం... నోరు విప్పిన కోరాడ విజయ్..  ఈ క్రమంలో మరో అడుగు ముందుకేసిన నారాయణ స్వామి.. తనపై చేసిన ఆరోపణలను చంద్రబాబు నిరూపిస్తే బహిరంగంగా ఉరేసుకుంటానని.. అలా చేయకపోతే చంద్రబాబు ఉరేసుకుంటారా..? అని సవాల్ విసిరారు. ఈ క్రమంలో కాస్త భావోద్వేగానికి గురైన మంత్రి దమ్ముంటే తన సవాల్ ను స్వకరించాలన్నారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు.. తన నియోజకవర్గం గంగాధర నెల్లూరు వైపు చూడలేదని నారాయణ స్వామి విమర్శించారు.

  ఇది చదవండి: 50 పైసలకే కిలో కూరగాయలు.. మరీ అంత చౌకగానా..? రైతు కష్టానికి విలువ అంతేనా..?


  ఐతే నారాయణ స్వామి విమర్శలపై ప్రతిపక్ష నేతలు స్పందిస్తున్నారు. త్వరలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉండటంతో సీఎం జగన్ దృష్టిలో పడి తన పదవిని కాపాడుకునేందుకు చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని కౌంటర్ ఇస్తున్నారు. మరోవైపు వైసీపీ నేతలు మాత్రం తాము చేసిన ఆరోపణలు తప్పని ప్రూవ్ చేసుకోవలని రివర్స్ ఎటాక్ చేస్తున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Chandrababu Naidu, Narayana Swamy, TDP

  ఉత్తమ కథలు