ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్(YSR Congress) నేతలు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) నేతలు నిత్యం ఘాటైన మాటలతో విమర్శించుకుంటూనే ఉంటున్నారు. ఇటీవల జరిగిన ఘటనలే ఈ మాటల తూటాలకు పర్యావసానంగా చెప్పవచ్చు. సీఎం జగన్ (CM Jagan) అవమానకంగా మాట్లాడారంటూ వైసీపీ సానుభూతి పరులు టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేస్తే.. అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి గురించి కించపరిచేలా మాట్లాడారంటూ.. టీడీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. తాజాగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యల సంచలనంగా మారుతున్నాయి. నిన్న అనంతపురం జిల్లా ఎమ్మెల్యే తోపు దుర్తి ప్రకాష్ రెడ్డి, నేడు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.
చిత్తూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరైన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ కు చంద్రబాబు ప్రాణహాని తలపెడారని తామంతా భయపడుతున్నట్లు వ్యాఖ్యానించారు. జగన్ పై కుట్ర జరుగుతోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పేదల సంక్షేమ కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్న సీఎం జగన్ ను ప్రతి రోజూ అవనమాన కరంగా మాట్లాడుతున్నారన్న నారాయణ స్వామి.., వరద బాధితులను పరామర్శించడానికి వచ్చినప్పుడు కూడా చంద్రబాబు కుట్రపూరిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.
ఇటీవల చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన సమావేశం పెట్టి కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబును చంపుతామని బెరించారని.. వారిని హతమార్చేందుకు చందాలు కూడా పోగుచేస్తున్నారని నారాయణ స్వామి ఆరోపించారు. కమ్మ వనసమారాధనలో చేసిన వ్యాఖ్యలను తామంతా ఖండిస్తే.. చంద్రబాబు కనీసం ఖండించలేదని ఆరోపించారు. ఎక్కడ చూసినా హత్యలు జరిపించాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఉన్నట్లున్నారని విమర్శించారు. సీఎం జగన్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
ఇది చదవండి: కొవిడ్ పై మిషన్ సంజీవని పోరాటం.. గుంటూరులో అవగాహన కార్యక్రమం
అనంతపురం జిల్లా రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని హత్యకు కుట్ర జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో ప్రతిపక్ష టీడీపీ నేతలు ఈ కుట్రకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. జగన్ ను హత్య చేసి అయినా.. అధికారంలోకి రావాలని టీడీపీ భావిస్తోందన్నారు. అందుకు ఇటీవల వదర ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే నిదర్శనం అన్నారు. సీఎం జగన్ గాల్లో వచ్చి.. గాల్లోనే కలిసిపోతారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారని అప్పటి వ్యాఖ్యలు గుర్తు చేశారు. అంతేకాదు సీఎంను జైలుకు పంపేందుకు టీడీపీ కుట్ర పన్నుతోందని ఆయన అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chandrababu Naidu, Chittoor, Narayana Swamy