హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tirumala: తిరుమల ఘాట్ రోడ్డును పరిశీలించిన ఐఐటీ బృందం.., నిపుణులేమన్నారంటే..!

Tirumala: తిరుమల ఘాట్ రోడ్డును పరిశీలించిన ఐఐటీ బృందం.., నిపుణులేమన్నారంటే..!

తిరుమల ఘాట్ రోడ్డును పరిశీలిస్తున్న ఐఐటీ బృందం

తిరుమల ఘాట్ రోడ్డును పరిశీలిస్తున్న ఐఐటీ బృందం

కలియుగ వైకుంఠం తిరుమలకు (Tirumala) వెళ్లే ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో ఘాట్ రిటైనింగ్ వాల్స్ దెబ్బతిన్నాయి. దీంతో ఘాట్ రోడ్డుపై రాకపోకలు నిలిపేసిన టీటీడీ (TTD).. మరమ్మతులు చేపట్టింది. ఇందులో భాగంగా ఢిల్లీ ఐఐటీ నిపుణులు ఘాట్ రోడ్డును పరిశీలించారు.

ఇంకా చదవండి ...

  కలియుగ వైకుంఠం తిరుమలకు (Tirumala) వెళ్లే ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో ఘాట్ రిటైనింగ్ వాల్స్ దెబ్బతిన్నాయి. దీంతో ఘాట్ రోడ్డుపై రాకపోకలు నిలిపేసిన టీటీడీ (TTD).. మరమ్మతులు చేపట్టింది. ఇందులో భాగంగా ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగి పడ్డ ప్రదేశాలను ఢిల్లీ నుండి వచ్చిన ఐఐటీ నిపుణుల బృందం పరిశీలించింది. టీటీడీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఐఐటీ బృందానికి ఘాట్ రోడ్డు పరిస్ధితిని వివరించింది. ఘాట్ రోడ్డుతో పాటు ప్రక్కనే ఉన్న కొండ పరిస్ధితిని వారికి వివరించారు. ఇటీవల్ల కురుస్తున్న వర్షాల కారణంగా ఘాట్ రోడ్డులో తరచూ కొండ చరియలు విరిగి పడుతున్న క్రమంలో భక్తుల భధ్రత దృష్ట్యా శాశ్వత పరిష్కారం దిశగా టిటిడి చర్యలు చేపడుతుంది.

  బుధవారం వేకువజామున రెండోవ ఘాట్ రోడ్డులో భారీ బండరాళ్ళు, వృక్షాలు విరిగి పడడంతో నాలుగు ప్రాంతాల్లో ఘాట్ రోడ్డు చివరి అంచు ధ్వంసం అయింది.. దీంతో రెండోవ ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలను టీటీడీ అధికారులు నిలిపేశారు. కొండచరియలు విరిగి పడిన నాలుగు ప్రదేశాల్లో మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ ఐటీ నిపుణుల బృందం ఘాట్ రోడ్డులోని ప్రమాదకర ప్రదేశాలను పరిశీలించి టిటిడి నివేదిక సమర్పించనుంది.

  ఇది చదవండి: శ్రీవారి భక్తులకు అలర్ట్.. దర్శనం వాయిదా వేసుకోవాలన్న టీటీడీ.. కారణం ఇదే..!


  దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం ఏర్పడిన భారీ పర్వతాలు కావడంతో పరిస్థితిని కూలంకషంగా అధ్యయనం చేయాలని బృందం అభిప్రాయపడింది. అలాగే గతంలో అడపాదడపా విరిగిపడిన కొండచరియలతో పోలిస్తే ప్రస్తుతం జరిగిన ఘటన అత్యంత ప్రమాద కరమైనదని టీటీడీ ఇంజనీరింగ్ అధికారి రామచంద్రారెడ్డి తెలిపారు. భగవంతుడి దయతో భారీ ప్రమాదం జరిగినా భక్తులు సురక్షితంగా బయటపడగలరు అని తెలిపారు. టీటీడీ ఉన్నతాధికారులకు పరిస్థితిని తెలియజేసి సమస్యను శాశ్వతంగా పరిష్కరించే విధంగా చర్యలు చేపడతాంమని అన్నారు.


  ఇది చదవండి: అఖండ మూవీకి అధికారుల బ్రేక్.. ఏపీలో థియేటర్ సీజ్.. కారణం ఇదే..!


  ఇదిలా ఉంటే గత 30ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 15 రోజుల పాటు భారీ వర్షాలు కురవడంతో తిరుమల కొండలు తడిముద్దయ్యాయి. తిరుమల శ్రీవారి మెట్ల మార్గం చాలా వరకు ధ్వంసమైంది. అలాగే పలుచోట్ల రోడ్లు, భవనాలు కూడా దెబ్బతిన్నాయి. భారీ వర్షాలకు ఘాట్ రోడ్లపై కొండచరియలు విరిగిపడే ప్రమాదముండటంతో భక్తులు తిరుమల ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటే మంచిదని టీటీడీ సూచించింది. వర్షాల వల్ల తిరుమల రాలేకపోయిన భక్తులకు ఆరు నెలల్లో ఎప్పుడైనా దర్శనం చేసుకునే విధంగా ఆన్ లైన్లో రీ షెడ్యూల్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. ఇప్పటికీ టీటీడీ ఐటీ విభాగం వెబ్ సైట్లో మార్పులు చేస్తోంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Tirumala Temple, Tirumala tirupati devasthanam