GT Hemanth Kumar, Tirupathi, News18
అరచేతిలో ప్రపంచాన్ని చుట్టేసే టెక్నాలజీ (Technology) మన సొంతం. 6 అంగుళాలుండే స్మార్ట్ ఫోన్లతోనే (Smart Phone) దాదాపు అన్ని పనులు జరిగిపోతున్నాయి. టెక్నాలజీ మంచిపనులకు వాడితే సరే.. కానీ కొందరు కేటుగాళ్లు మాత్రం సైబర్ నేరాలకు (Cyber Crime) వాడేసుకుంటున్నారు. మొబైల్స్, ల్యాప్ టాప్ లతో పాటుగా హైసెక్యూరిటీతో ఉండే ప్రభుత్వ రంగ డివైస్ లను ఇట్టే ట్యాపరింగ్ చేసేస్తున్నారు మాయగాళ్లు. ఒకప్పుడు డబ్బులు కావాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిన పరిస్థిచి. ఆ తర్వాత ఏటీఎంల ద్వారా క్యాష్ విత్ డ్రా చేసుకుంటున్నాం. ఐతే ఇదే అదునుగా చేసుకుంటున్న కొందరు కేటుగాళ్లు నయా సైబర్ దందాకు తెరలేపారు. జనాలకు టోకరా వేస్తే ఏం సంపాదిస్తాంలే అనుకున్నారో ఏమో.. బ్యాంకులకే టోకరా వేయడం మొదలుపెట్టారు. ఏకంగా ఏటీఎంలకే ఎర్త్ పెట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తిరుపతి నగరంతో (Tirupathi) పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏటీఎంలను ట్యాంపర్ చేసి భారీగా దోచేశారు. బ్యాంక్ కంట్రోల్లో ఉండే ఏటీఎంలను తమ గుప్పెట్లో పెట్టుకొని క్రైమ్ సీన్ నడిపించారు. ఈ ఏడాది అక్టోబర్ నుంచి పలు ఏటీఎంలలో సాంకేతిక లోపాలు చోటు చేసుకోవడాన్ని బ్యాంక్ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఈనెల 2వ తేదీన రాత్రి తిరుపతిలోని రామానుజ సర్కిల్ లో ఇద్దరు దుండగులు ఏటీఎంను ట్యాంపర్ చేసినట్లు గుర్తించారు.
ట్యాంపరింగ్ ద్వారా నగరంలోని చాలా ఏటీఎంలలో నగదు కాజేసినట్లు గుర్తించారు. దీంతో ఫిర్యాదు నమోదైన ఏటీఎం నుంచే తీగలాగడం మొదలుపెట్టారు. బ్యాంక్ నుంచి సేకరించిన సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను ఆర్టీసీ బస్ స్టాండ్ లోని ఏటీఎం వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారించగా ఇదొక అంతర్రాష్ట్ర ముఠాగా తేలింది.
ఇది చదవండి: పెళ్లై 9ఏళ్లైనా ప్రియుడ్ని వదలని భార్య.. భర్త నచ్చజెప్పినా వినలేదు.. చివరకి..
నిందితులు హర్యానా రాష్ట్రం నుహ్ జిల్లా పిప్రోలి గ్రామానికి చెందిన అరిఫ్ఖాన్(25), సలీంఖాన్(25)గా గుర్తించారు. వీరిపై తిరుపతి ఈస్ట్, వెస్ట్ పోలీస్ స్టేషన్లతో పాటు ఎస్వీయూ, తిరుచానూరు స్టేషన్లలో కూడా కేసులు నమోదయ్యాయి. నిందితుల నుంచి నుంచి వివిధ బ్యాంకులకు చెందిన 99 ఏటీఎం కార్డులు, రెండు మొబైల్ ఫోన్లు, రెండు తాళాలు, రూ.20 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. వారి బ్యాంకు ఖాతాలోని రూ.60 వేల నగదును ఫ్రీజ్ చేసినట్లు తెలిపారు. సైబర్ క్రైమ్ ముఠాకు సహకరించిన నకీబాహుసేన్, ఇలియాస్, హక్ముద్దీన్ పరారీల. ఉన్నట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన పోలీసులు, కానిస్టేబుళ్లను అభినందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, ATM, CYBER CRIME, Tirupati