హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

OMG: పొట్టలో రూ.9 కోట్ల విలువైన డ్రగ్స్.. వీడొక్కడే సినిమా చూపించిన స్మగ్లర్.. స్కాన్ చేసి షాకైన పోలీసులు

OMG: పొట్టలో రూ.9 కోట్ల విలువైన డ్రగ్స్.. వీడొక్కడే సినిమా చూపించిన స్మగ్లర్.. స్కాన్ చేసి షాకైన పోలీసులు

డ్రగ్స్ మాఫియా (Drugs Mafia) అంటే అదో చీకటి సామ్రాజ్యం. పోలీసుల కళ్లుగప్పి డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడం మాఫియా స్టైల్. ఇక విదేశాల నుంచి వచ్చే డ్రగ్స్ ను చాలా తెలివిగా ఇండియాకు పంపుతుంటారు. చిన్నపాటి అనుమానం రాకుండా పక్కాగా ప్లాన్ చేస్తుంటారు.

ఇంకా చదవండి ...

  GT Hemanth Kumar, News18, Tirupati

  డ్రగ్స్ మాఫియా (Drugs Mafia) అంటే అదో చీకటి సామ్రాజ్యం. పోలీసుల కళ్లుగప్పి డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడం మాఫియా స్టైల్. ఇక విదేశాల నుంచి వచ్చే డ్రగ్స్ ను చాలా తెలివిగా ఇండియాకు పంపుతుంటారు. చిన్నపాటి అనుమానం రాకుండా పక్కాగా ప్లాన్ చేస్తుంటారు. కొన్నిసార్లు స్మగ్లర్ల ఐడియాలు చూసి పోలీసులే షాకవుతుంటారు. అలా ఉంటాయి వారి ప్లాన్స్. ఇటీవల కాలంలో ఇండియా (India) కు భారీ ఎత్తున డ్రగ్స్ అక్రమ మార్గంలో సరఫరా అవుతున్నాయి. ఇందులో స్వదేశీయులతో పాటు నైజీరియా వంటి ఆఫ్రికా దేశాలకు చెందిన వారు కూడా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారు. కొకైన్, హెరాయిన్ వంటి వాటిని విమాన, సముద్ర మార్గం గుండా కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి ఇండియాకు చేర్చుతున్నారు. తాజా ఓ నైజీరియన్.. సినిమా స్టైల్లో డ్రగ్స్ ను సరఫరా చేస్తూ అధికారులకు చిక్కాడు.

  వివరాల్లోకి వెళితే... 2022 జులై 14 వ తేదీ హడావిడిగా వెళ్తున్నారు. ఉగాండా నుంచి ఓ విమానం అప్పుడే చెన్నై ఇంటర్ నేషన్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది. ప్రయాణికులు తమ లగేజ్ తీసుకోని లాబీ దగ్గరకు వస్తున్నారు. అదే సమయంలో ఓ ప్రయాణికుడు అనుమానాస్పదంగా తిరుగుతుండటం చెన్నై కస్టమ్స్ అధికారులు గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టారు. తాను టాంజానియా పౌరుడని కస్టమ్స్ అధికారులకు ఆ ప్రయాణికుడు వెల్లడించారు. నువ్వేం తరలిస్తున్నావ్ అని కస్టమ్స్ అధికారులు ఆయనను ప్రశ్నించారు. వెంటనే తాను ఏమి అక్రమంగా తరలించడం లేదని చెప్పారు.

  ఇది చదవండి: కొడుకు మరణంతో కోడలిపై అనుమానం.. అత్తమామలు ఏం చేశారో చూడండి..!

  ఐతే అదే సమయంలో అతని పొట్టను చూసిన అధికారులు అనుమానంవచ్చి స్కాన్ చేసారు. స్కానింగ్ స్క్రీన్ పై చూసిన కస్టమ్స్ అధికారులు షాక్ కు గురయ్యారు. వీడోక్కడే సినిమాలో విలన్ తన పనివాళ్ళతో ఏమి తినకుండా పొట్టలో కేజీల కొద్దీ క్యాప్సూల్స్ పొట్టలో పెట్టి తరలించినట్లుగా పొట్ట నిండా క్యాప్సూల్స్ ఉన్నాయి. అందులో ఒక్క క్యాప్సూల్ పగిలిన ఆ మనిషి ప్రాణానికే ప్రమాదం. డాక్టర్ల సాయంతో ఒక్కో క్యాప్స్యూల్ ని బయటకు తీసి చూడగా అన్నింటిలోనూ హెరాయిన్ ఉంది.

  ఇది చదవండి: ఈమె పేరు మృదుల.. పేరులో ఉన్నంత సాఫ్ట్ కాదు..! ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా..

  మొత్తం 86 హెరాయిన్ నిండిన క్యాప్సూల్ ను అతని పొట్టలో నుంచి బయటకు తీశారు. వాటి బరువు 1.266 కెజిస్ కాగా.., దాని విలువ 8.86 కోట్లుగా అధికారులు వెల్లడించారు. మొత్తం హెరాయిన్ స్వాధీనం చేసుకొని టాంజానియా పౌరిడిని అదుపులోకి తీసుకున్నారు కస్టమ్స్ అధికారులు. మారక ద్రవ్యాల అక్రమ రవాణా వెనుకాల ఎవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి అతడి వద్ద 8 కొట్ల విలువ చేస్తే హెరాయిన్ ను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

  First published:

  Tags: Chennai, Drugs

  ఉత్తమ కథలు