GT Hemanth Kumar, Tirupathi, News18
Crime News: ఆధునిక టెక్నాలజీ (Latest Technology ) మేలు చాలానే జరుగుతున్నా.. నష్టాలు అంతకన్నా పెరుగుతున్నాయి. ముఖ్యంగా సైబర్ మోసాలు (Cyber Cheating) కొత్తపుంత తొక్కుతున్నాయి. ప్రస్తుత రోజులో రోజుకో తరహా కొత్త రకాల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. మార్కెట్ లో చిన్న చిన్న వస్తువుల నుంచి.. పెద్ద పెద్ద యంత్రాల వరకు నకిలీ ఏది... నిజమైన పరికరం ఏంటి అనేది కనిపెట్టడం చాల కష్టంగా మారింది. ప్రస్తుత ఆధునిక టెక్నాలజీ చాటున ఆన్లైన్ మోసాలు (Online Cheating) తార స్థాయిలో జరుగుతున్నాయి. ఒక్కో సారి ఒక్కో విధంగా మాయ చేస్తూ.... ప్రజల వద్ద డబ్బులను భారీగా దండుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు.
ఆండ్రాయిడ్ అందుబాటులో వచ్చిన నాటి నుంచి ఇలాంటి సైబర్ నేరాలు మరింత పెరిగిపోతున్నాయి. ఓటీపీ, యూపీఐ మోసాల నుంచి తాజాగా మరో సైబర్ మోసాలకు తేరా లేపారు కేటుగాళ్లు. వస్తువులు ఉచితం అని.. అమాయకులను నమ్మిస్తున్నారు.
అంతా ఫ్రీ అంటూ కొన్ని లక్షల రూపాయలు దండుకున్న విషయం కొత్తగా వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగిందన్న విషయం తెలిస్తే.. ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా ఇలాంటి మెసేజ్ లు వస్తే కచ్చితంగా అలర్ట్ అవ్వాల్సిందే.
మీకు కారు గిఫ్ట్ గా వచ్చిందని పోస్టుల ద్వారా గిఫ్ట్ వోచర్ పంపించి కార్డు స్కాచ్ చేస్తే మీకు ఇన్నోవా కారు వస్తుందని నమ్మిస్తారు. ఆ పేరుతో జీఎస్టీ, డెలివరీ టాక్స్ కడితే కారును అందజేస్తామని చెప్పి.. వేలాది రూపాయల దోపిడీకి పాల్పడుతున్న ముఠాపై జిల్లాలో దాదాపు 25 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.
ఇదీ చదవండి : శోభనం గదిలోనే ప్రాణం విడిచిన యవకులు.. ఇంత కథ ఉందా..?
ఈ మేరకు చిత్తూరు డిఎస్పి సుధాకర్ రెడ్డి పరివేక్షణలో చిత్తూరు వన్ టౌన్ సిఐ నరసింహరాజు ఆధ్వర్యంలో పెనుమూరు ఎస్సై అనిల్ కుమార్ చిత్తూరు వన్ టౌన్ సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేశారు. మోసాలకు పాల్పడుతున్న వారి కదిలికలపై ప్రత్యేక నిఘా ఉంచారు.
ఇదీ చదవండి : చంద్రబాబు సంచలన నిర్ణయం.. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ టిక్కెట్లు.. కారణం ఇదే
ఉదయం 6:30 గంటల ప్రాంతంలో చిత్తూరు రిజర్వు ఫారెస్ట్ సమీపంలో మెసానికల్ మైదానం దగ్గర ఐదు మంది అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్నారు పోలీసులు. అదుపులో ఉన్న వారిని పోలీస్ స్టైల్ లో విచారణ చేయడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ముఠా సభ్యులు రెండు మూడు బృందాలుగా ఏర్పడి బాధితుల ఫోన్ నెంబర్లు, అడ్రసులను సేకరించి పథకం ప్రకారం మోసపూరిత మాటలు చెప్పి గిఫ్ట్ కార్డుల ద్వారా వివిధ రకాల వస్తువులు అందిస్తామని చెప్పి మోసగించే వారు.
ఇదీ చదవండి : తిరుమల శ్రీవారి సేవలో ముకేశ్ అంబానీ.. టీటీడీకి భారీ విరాళం
వీరిపై చిత్తూరు ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో 21 మంది, కల్లూరు పోలీసు స్టేషన్ పరిధిలో ఒక్కరు, గంగాధర నెల్లూరు పోలీసు స్టేషన్ లో ఇద్దరు పిర్యాదు చేశారని, అయితే పూతలపట్టు పరిధిలో బాధితులు ఉన్నారన్నారు.. చిత్తూరు పరిసర ప్రాంతల్లో 25 మంది బాధితులు మోసపోయినట్లు గుర్తించారు పోలీసులు.
మోసాలు చేసేందుకు నిందితులు ఉపయోగించిన 30 సెల్ ఫోన్ లు, రెండు లాప్ టాప్ లను, 500 గిప్టు కార్డు లను, ఏటీఎం కార్డులను, 1 లక్ష 80 వేల రూపాయలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని చిత్తూర్ ఎస్పీ రిషాంత్ రెడ్డి పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Chittoor, Crime news