Home /News /andhra-pradesh /

TIRUPATI COUPLE COMMITS SUICIDE AFTER FACING PRESSURE FROM MONEY LENDERS IN CHITTOOR DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT

Sad News: అందమైన జీవితంలో అనుకోని కష్టం.. పిల్లల్ని వదిలేసి వెళ్లిపోవడానికి మనసెలా వచ్చిందో..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Sad Story: వారిది అందమైన జీవితం. ఉన్నదాంట్లో హాయిగానే జీవిస్తున్నారు. అందరి జీవితాల్లో చీకట్లు నింపిన కరోనా వారిజీవితాన్ని నేరుగా కాకపోయినా పరోక్షంగా దెబ్బతీసింది. కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు కాస్త ధైర్యంగా ఉండి పోరాడితో సరిపోయేదానికి కఠిన నిర్ణయం తీసుకున్నారా దంపతులు.

ఇంకా చదవండి ...
  GT Hemanth Kumar, News18, Tirupati

  వారిది అందమైన జీవితం. ఉన్నదాంట్లో హాయిగానే జీవిస్తున్నారు. అందరి జీవితాల్లో చీకట్లు నింపిన కరోనా వారిజీవితాన్ని నేరుగా కాకపోయినా పరోక్షంగా దెబ్బతీసింది. కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు కాస్త ధైర్యంగా ఉండి పోరాడితో సరిపోయేదానికి కఠిన నిర్ణయం తీసుకున్నారా దంపతులు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లా (Chittoor District) నగరికి చెందిన శివ నాగ భాస్కర్, గౌరి దంపతులు నివాసముంటున్నారు. భాస్కర్ హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తుండేవాడు. గౌరి యూనియన్ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తోంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఐతే నాలుగేళ్లుగా ఇద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో ఉంటూ ఉద్యోగం చేస్తున్నారు. గౌరి బదిలీ కోసం యత్నించినా సాధ్యపడలేదు. కరోనా కారణంగా భాస్కర్ నిర్వహిస్తున్న చిట్టీ వ్యాపారం కూడా డల్ అయింది. చిట్టీలు కట్టాల్సిన వారు ఇవ్వకపోవడం, పాడుకున్నవారికి తన సొంతడబ్బులు చెల్లించడంతో అప్పులపాలయ్యారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో బలవన్మరణానికి పాల్పడ్డారు.

  గౌరీ తన డైరీలో ఏం రాసిందంటే...???
  “మేము చేసింది తప్పు.. అందుకు అందరూ మమ్మల్ని క్షమించాలి.. మాకు బ్రతకాలని ఉన్నా..మాకు వేరొక మార్గం కనిపించలేదు.. తమలోని‌ భాధను వేరోక పనితో దూరం చేసుకునేందుకు 2019లో ఐదు లక్షల రూపాయల చీటీ వ్యాపారం మొదలు పెట్టాను..2020 మార్చి వరకూ బాగానే నడిచింది.. కరోనాతో చీటీలు కట్టేవారే కరువయ్యారు.‌ దీంతో చీటీల వ్యాపారంతో పూర్తిగా నష్టపోవాల్సి వచ్చింది. వేరే మార్గం లేక చీటీలు వేసి ప్రతి ఒక్కరిని ఇద్దరు కలిసి అడిగాం.. కానీ ఎవరూ చీటీలు కట్టేందుకు ముందుకురాలేదు. దీంతో చీటీ నడపలేకపోయాం.. చివరగా హౌసింగ్ లోన్ కోసం ఎంతో ప్రయత్నించాం, ప్రొద్దుటూరు, ముద్దనూరు, నగిరి మేనేజర్లను అడిగినా కసురుకున్నారు. నలభై లక్షల రుణం వస్తుంది.. 15 లక్షల రూపాయలు రుణం ఇచ్చినా తమ కష్టాలు గట్టు ఎక్కుతాయని బ్యాంక్ మేనేజర్లను బ్రతిమలాడాం‌ కానీ బ్యాంక్ మేనేజర్లు రుణం ఇవ్వలేదు. తమకు లోన్ ఇవ్వక పోవడంపై కారణం ఏంటో తెలియదు. ఆర్ధిక ఇబ్బందులు తమను వేధించినా ఇన్నాళ్ళు పిల్లలను చూసి భరిస్తూ వచ్చాం కానీ గత వారం క్రితం అప్పు ఇచ్చిన కృష్ణారెడ్డి బ్యాంకు వచ్చి తన డబ్బులు ఇవ్వాలంటూ తీవ్రంగా ఒత్తిడి తీసుకుని రావడమే కాకుండా అసభ్యకర పధజాలంతో దూషించడం కారణంగానే తాము బలవన్మరణంకు పాల్పడాల్సి వస్తొందని, ఇంటి పత్రాలు అప్పుల వారి వద్ద ఉందని, ఆ పత్రాలు తమ పిల్లలకు చేందేలా చూడాలని కోరుతూ.. అమ్మ, నాన్న, వదినా, అత్తలు క్షమించండి” అంటూ గౌరీ డైరీలో రాసింది.

  ఇది చదవండి: వాళ్లిద్దరిదీ ఓ క్యూట్ లవ్ స్టోరీ.. కానీ ఆజంట విధిరాత ఇలా ఉంటుందని ఎవరూ ఊహించలేకపోయారు..!


  తల్లిదండ్రుల బలవన్మరణంతో ఈ ఇద్దరు చిన్నారులు ఒంటరివారయ్యారు. వీరిని గత 17 రోజుల క్రితం మేనత్త ఇంటికి పంపించారని బంధువులు అంటున్నారు. అప్పు విషయమై ఓ వ్యక్తి మానసికంగా వేధింపులకు గురి చేయడం కారణంగానే దంపతులు మృతికి చేందారని బంధువులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నగిరి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Chittoor, Suicide

  తదుపరి వార్తలు