హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Costly Cow: ఎత్తు మూడు అడుగులే.. కానీ కాసుల వర్షం కురిపించింది.. ఎందుకంత స్పెషలో తెలుసా..?

Costly Cow: ఎత్తు మూడు అడుగులే.. కానీ కాసుల వర్షం కురిపించింది.. ఎందుకంత స్పెషలో తెలుసా..?

4.10 లక్షలు పలికిన పుంగనూరు ఆవు

4.10 లక్షలు పలికిన పుంగనూరు ఆవు

Costly Cow: సాధారణంగా ఆవులు అంటే వాటి ధర వేలల్లో ఉంటుంది. మంచి జాతి.. బాహుబలి లాంటి ఆవు అయితే లక్ష వరకు పలకొచ్చు.. కానీ మూడెత్తులే ఉన్న ఆవు ధర.. దాదాపు ఐదు లక్షల వరకు పలికింది అంటే నమ్ముతారా.? కానీ నిజం.. అది పుంగనూరు జాతి ఆవు కావడంతోనే ఆ ధర పలికింది.. మరి దీని ప్రత్యేకత ఏంటో తెలుసా..?

ఇంకా చదవండి ...

Costly Cow: ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లా (Chitoor District) ఆవులకు చాలా ఫేమస్.  ఒంగోలు గిత్తలు, గిర్ ఆవులు చాలా ఫేమస్ అయ్యాయి.. ఆ పశు జాతుల్లాగే పుంగనూరు ఆవులు ప్రపంచంలోనే ప్రత్యేకమైనవిగా గుర్తింపు పొందాయి. పుంగనూరు (Punganur) ఆవులు పొట్టిగా, ముద్దుగా ఉంటాయి. వాటి రూపం చూడగానే ఆకర్షిస్తుంది. వీటిని మొదటిసారి చూసినవారు మాత్రం అవి ఆవులా, దూడలా అని తికమకపడుతుంటారు. అందుకు కారణం కూడా ఉంది. ఈ పుంగనూరు ఆవులు మామూలు ఆవు దూడల సైజులో ఉంటాయి. కాళ్లు పొట్టిగా ఉండి, ఎత్తు 70 నుంచి 90 సెంటీమీటర్లు ఉంటుంది. సాధారణంగా ఇవి ఇవి 2 అడుగుల 4 అంగుళాల నుంచి 3 అడుగుల వరకు ఎత్తు పెరుగుతాయి. 115 నుంచి 200 కిలోల బరువు ఉంటాయి. ఎక్కువగా బూడిద, తెలుపు రంగుల్లో ఉంటాయి. విశాలమైన నుదురు, చిన్న కొమ్ములు వీటి ప్రత్యేకత కాగా, తోక మాత్రం నేలను తాకుతూ ఉండడం మరో ప్రత్యేకత. దీనికి తోడు పుంగనూరు ఆవు పాలలో ఔషధ గుణాలు ఉంటాయని స్థానిక రైతుల నమ్మకం.  ఈ పాలు చాలా రుచిగా ఉంటాయి. మామూలు ఆవు పాలలో 3.5 శాతం వెన్న ఉంటే ఈ ఆవు పాలలో 6 నుంచి 8 శాతం వెన్న ఉంటుంది. ఈ పాలు సుగంధ వాసనలతో, ఆయుర్వేద గుణాలతో ఉంటాయి.

ఆంధ్రప్రదేశ్ లోని ప్రాంతాల్లో ఈ ఆవులను అధిక ధర వెచ్చించి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. ప్రస్తుతం ఒక్కో ఆవు ధర 3 లక్షల రూపాయల నుంచి రూ. 5లక్షల వరకూ పలుకుతోంది. తాజాగా తెనాలికి చెందిన ఓ వ్యక్తి పుంగనూరు ఆవును 4 లక్షల 10 వేల రూపాయలకు విక్రయించినట్లు తెలిసింది. హరిద్వార్ నుంచి వచ్చిన బాబా రాందేవ్ (Baba Ramdev) ఆశ్రమ ప్రతినిధులు ఆవును పరిశీలించి భారీ ధర వెచ్చి కొనుగోలు చేసినట్లు తెలిసింది.


చిన్న చెవులు, మూపురం, తోక నేలకు ఆనడం, గంగడోలు కిందకు రావడం, ముందు కాళ్లు పొడవుండి వెనక కాళ్లు పొట్టిగా ఉండటం వీటి లక్షణాలు. వీటిపైన నీళ్లు పోస్తే వెనక్కి వెళ్లిపోతాయి. అలాంటి లక్షణాలుంటే దాన్ని అసలైన పుంగనూరు ఆవుగా గుర్తించవచ్చు. ఈ ఆవులను రైతులు ప్రత్యేక శ్రద్ధతో పెంచుతారు. చిన్నగా ఉండటంతో పాటు వాటిని ముద్దుగానూ చాలా మంది పెంచుకుంటారు.

ఇదీ చదవండి : భర్త కోసం భార్య అలుపెరుగని పోరాటం.. ఎందుకో తెలుసా..?

రైతులు కూడా వీటిని తక్కువ ఖర్చుతో పెంచుకోవచ్చు. ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా ఇవి తట్టుకుంటాయి. ఈ ఆవు పొట్టిగా ఉండి, చూడగానే ఆకర్షిస్తుంది. అందువల్ల వీటికి ఇప్పుడు డిమాండ్ పెరుగుతోంది.

ఇదీ చదవండి : అహోబిలంలో భక్తుల సందడి.. ఆలయం చుట్టూ జలాల హోరు

కొంతమంది వీటిని పిల్లల్లాగా ఇళ్లల్లోనే పెంచుకుంటున్నారు సంప్రదాయ వైద్యాన్ని పాటించేవారు ఈ ఆవు పాలకు బాగా ప్రాధాన్యం ఇస్తారు. అలాగే ప్రస్తుతం ఈ ఆవు మూత్రాన్ని లీటర్ పది రూపాయలకు కొంటున్నారు. పేడ కిలో ఐదు రూపాయల వరకు అమ్ముతారు.

First published: