• Home
  • »
  • News
  • »
  • andhra-pradesh
  • »
  • TIRUPATI CORONA VIRUS EFFECT TIRUMALA TIRUPATI DEVASTHANAM TAKE KEY DECISION IMPLEMENT ON MAY 1ST ON WARDS NGS TPT

Corona effect on TTD: శ్రీవారి భక్తులకు మరో షాక్. టీటీడీ కీలక ప్రకటన. మే 1 నుంచి అమలు

తిరుమల శ్రీవారి ఆలయం(ప్రతీకాత్మక చిత్రం)

తిరుమల తిరుపతి దేవస్థానంపై కరోనా ఎఫెక్ట్ పడింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. మే 1 నుంచి మరిన్ని ఆంక్షలపై ఫోకస్ చేసింది.

  • Share this:
    కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి పై కరోనా ఎఫెక్ట్ పడింది. రోజు రోజుకూ కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో  భక్తుల శ్రేయస్సు కోసం ఇప్పటికే పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న తిరుమల తిరుపతి దేవస్ధానం (tirumala tirupati devasthanam) కరోనా వ్యాధి వ్యాప్తి నివారణకు వీలైనన్ని ముందస్తు జాగ్రత్తలు చేపడుతోంది.. ఇప్పటికే ఈ నెల 12వ తేదీ నుండి సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపి వేసింది. కొద్ది రోజులుగా తిరుమలలో ఎక్కువ కరోనా కేసులు నమోదు అవుతుండడంతో టీటీడీలో ఆందోళన మొదలైంది. తొలిదశలో కరోనా నివారణలో దేశంలోని ఎన్నో దేవాలయాలకు ఆదర్శంగా నిల్చిన టీటీడీ. మరోసారి కోవిడ్ నిబంధనలు అమలు చేస్తు భక్తులను అనుమతిస్తు వస్తోంది.. అయితే ఉగాది నుండి స్వామి వారి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలనే నిర్ణయంపై వెనక్కి తగ్గింది.. క్రమేపి భక్తుల సంఖ్యను తగ్గిస్తూ..పరిమిత సంఖ్యలోనే భక్తులను కోండకు అనుమించే విధంగా చర్యలు తీసుకుంటోంది.

    రాష్ట్ర వ్యాప్తంగా సెకెండ్ వేవ్  వ్యాప్తి వేగంగా దూసుకు వస్తున్న నేపథ్యంలో టీటీడీ అదికారులు మరోసారి కోవిడ్ నిబంధనలు ప్రవేశపెట్టారు. స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్యను క్రమేపి తగ్గించాలని నిర్ణయం తీసుకుంది.  భక్తుల ఆరోగ్య భధ్రత నేపథ్యంలో కొండపై కఠినమైన నిబంధనలు అమలు చేస్తోంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడి దర్శనార్ధం నిత్యం వేలాదిగా భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు.సప్తగిరులపై స్వయంభుగా వెలిసిన ఆ దేవదేవుడిని నిత్యం 70వేల నుంచి లక్ష మంది భక్తులు వరకు దర్శించుకుంటుండగా.. ప్రస్తుతం కోవిడ్ 19 నేపథ్యంలో ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది. కరోనా మహమ్మారి తిరుమలలో ప్రబలకుండా మార్చి 20వ తేదీ నుంచి దాదాపు 80రోజుల పాటు దర్శనాలను నిలిపివేసిన టీటీడీ.. ఆ తరువాత కేంద్రం ఇచ్చిన సడలింపులతో జూన్ 8వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో దర్శనాలను పునఃప్రారంభించింది. స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించడం ప్రారంభించినప్పటికీ గతంలోలా వేలాది మంది భక్తులను అనుమతించకుండా పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తూ కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలు ప్రకారం ప్రతి ఒక్కరు మాస్క్ ను ధరించడంతో పాటు క్యూ లైన్లలో భౌతిక దూరం పాటిస్తూ స్వామి వారిని దర్శించుకునెలా టీటీడీ ఏర్పాట్లను చేసింది.

    దర్శనాలు ప్రారంభించిన సమయంలో నిత్యం 6వేల మంది భక్తులను అనుమతించిన టీటీడీ.. తరువాత కేంద్ర నిబంధనలను పాటిస్తూ ఎంత మందికీ దర్శనం కల్పించవచ్చో ఆలయంలోని పరిస్థితులను బేరీజు వేసుకుంటూ క్రమంగా దర్శనం సంఖ్యను పెంచుతూ వచ్చింది. ప్రస్తుతం నిత్యం దాదాపుగా 55వేల మంది భక్తులను టీటీడీ శ్రీవారి దర్శనానికి అనుమతిస్తోంది. తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడూ నిబంధనలను కచ్చితంగా పాటించెలా టీటీడీ గట్టి చర్యలు చేపట్టంది. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించడంతో పాటు తప్పనిసరిగా మాస్క్ ను ధరించేలా చర్యలను తీసుకొంది .ఇక భక్తులు స్వామి వారి దర్శనానికి వెళ్లే సమయంలో మాస్క్ ధరించి వుంటేనే క్యూకాంప్లెక్స్ లోకి అనుమతించేది.

    తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే అలిపిరి నడక, రోడ్డు మార్గం, శ్రీవారి మెట్టు కాలిబాట మార్గంలోను స్క్రీనింగ్ టెస్టులు, వాహనాలపై శానిటైజేషన్  చేస్తూ వచ్చారు. విదేశాల నుంచి వచ్చే ఎన్ఆర్ఐ భక్తులు 28 రోజులు దాటినా తరువాతే స్వామి వారి దర్శనానికి రావాలని, ఒకవేళ తిరుమలకు వచ్చిన వారు కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారు టీటీడీని సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పుష్కరిణిలోకి భక్తులు అనుమతిని పూర్తిగా రద్దు చేసింది.

    ముఖ్యంగా చిత్తూరు జిల్లాలోనూ వందకు పైగా కేసులు ప్రతి నిత్యం నమోదు అవుతున్నాయి. ఈ నేపధ్యంలో శ్రీవారి దర్శనాలపై టీటీడీ ఉన్నత స్ధాయి సమీక్ష నిర్వహించి కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇటు స్ధానికులతో పాటు శ్రీవారి కోలువులో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు కరోనా సోకడంతో టీటీడీ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. తిరుమలకు నాలుగు కిలో మీటర్లు  దూరంలో ఉన్న ధర్మగిరి వేద పాఠశాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్ధుల్లో80 మందికి పైగా కరోనా నిర్ధారణ కావడంతో వేద పాఠశాలకు టిటిడి సెలవు ప్రకటించింది. తిరుమల, తిరుపతిలతో కూడా భారీగా కేసులు నమోదు కావడంతో దర్శనాల కుదింపుపై నిర్ణయం తీసుకున్నటీటీడీ రోజుకు 22 వేల టికెట్లను జారీ చేస్తున్న టైంస్లాట్ టికెట్లను 15 వేలకు కుదిస్తూ నిర్ణయించింది.. కరోనా కట్టడి కాక పోవడంతో 12వ తేదీ నుండి పూర్తిగా టైం స్లాట్ టోకెన్లను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే కేసులు తగ్గుముఖం పట్టే వరకూ టైం స్లాట్ టోకెన్లను నిలిపి వేయాలనే యోచనలో టిటిడి ఉన్నట్లు తెలుస్తోంది. ఉగాది నుండి ఆర్జిత సేవలకు భక్తుల అనుమతించాలని తీసుకున్న నిర్ణయంపై టీటీడీ వెనక్కు తగ్గింది.


    మరోవైపు ముందస్తుంగా ఆన్ లైన్ లో విడుదలన చేసిన 300 ప్రత్యేక ప్రవేశ దర్శనంలో కూడా టికెట్ల సంఖ్యను కుదించేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. మే నెలల 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనుంది టీటీడీ.  ఈ నెల 20వ తేదీన విడుదల చేసే టిక్కెట్ల కోటను 15 వేలకు కుందుంచేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. అలాగే  మే 1 నుంచి 15 వేల మంది ప్రత్యేక ప్రవేశ దర్శనం పొందిన భక్తులను మాత్రమే దర్శన భాగ్యం  కల్పించనుంది. 
    Published by:Nagesh Paina
    First published: