Home /News /andhra-pradesh /

TIRUPATI CONTROVERSY OVER TIRUMALA TIRUPATHI DEVASTHANAM UDAYASTHAMANA SEVA TICKETS FULL DETAILS HERE PRN TPT

TTD Controversy: మరో వివాదంలో టీటీడీ.. ఉదయాస్తమాన సేవా టికెట్లపై కాంట్రవర్సీ..

శ్రీవారి ఆలయం (ఫైల్)

శ్రీవారి ఆలయం (ఫైల్)

TTD: వేకువ జామున సుప్రభాతం మొదలుకొని రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీ వేంకటేశ్వరుడుని కనులారా తరించే అవకాశం ఉదయాస్తమాన సేవ టిక్కెట్లు కలిగిన భక్తులకు లభిస్తుంది. దీంతో ఉదయాస్తమాన సేవ టిక్కెట్లు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు.

    GT Hemanth Kumar, Tirupathi, News18

    కలియుగ వైకుంఠ నాధుడైన శ్రీ వేంకటేశ్వరుడుని క్షణకాల దర్శనం కోసం భక్తులు పరితప్పించి పోతుంటారు.. తమ జీవిత కాలంలో ఒక్కసారైనా స్వామి వారి దర్శనం భాగ్యం కలిగితే‌ వారి జీవితం ధన్యం అయినట్లే.. దేశ విదేశాల నుండి వివిధ రూపాల్లో భక్తులు తిరుమలకు చేరుకుంటారు.. గంటల తరబడి వేచి ఉండి స్వామి‌ వారిని దర్శించుకోనిదే తిరిగి వెళ్ళరు భక్తులు.. అలాంటిది స్వామి వారిని కొన్ని నిమిషాల పాటు చూసి తరించే భాగ్యం ఉదయాస్తమాన సేవా టికెట్ల ద్వారా భక్తులకు లభిస్తుంది.. ఇక వేకువ జామున సుప్రభాతం మొదలుకొని రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీ వేంకటేశ్వరుడుని కనులారా తరించే అవకాశం ఉదయాస్తమాన సేవ టిక్కెట్లు కలిగిన భక్తులకు లభిస్తుంది. దీంతో ఉదయాస్తమాన సేవ టిక్కెట్లు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు అంటే నమ్ముతారా.. డబ్బున్న వారేతే సేవా టిక్కెట్ల కోసం పోటీ పడుతుంటారు.

    టీటీడీ ఉదయాస్తమాన సేవ టిక్కెట్లను ప్రవేశ పెట్టిన కొద్దిరోజుల్లోనే భక్తులు కొనుగోలు చేయడంతో‌ ఆ తర్వాత వీటి కేటాయింపును తాత్కాలికంగా నిలిపివేసింది. సామాన్య భక్తులకు దర్శనంలో అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు ఉదయాస్తమాన సేవా టిక్కెట్లను నిలిపివేసిన టిటిడి.., గతంలో భక్తులకు జారీ చేసిన టికెట్లు కాలపరిమితి ముగిసిపోవడంతో ఖాళీగా ఉన్న టిక్కెట్లను తిరిగి భక్తులకు కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం ఉదయాస్తమాన సేవా టికెట్లను ఓ మంచి ఉద్దేశంతో భక్తులకు కేటాయించాలని నిర్ణయించుకుంది. వీటి కేటాయింపు ద్వారా వచ్చే ఆదాయాన్ని తిరుపతిలోని చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి వినియోగించాలని భావిస్తోంది.

    ఇది చదవండి: ఏపీలో సినిమా హాళ్లపై కొనసాగుతున్న దాడులు.. ఆ ఒక్క జిల్లాలోనే 15 థియేటర్లు సీజ్


    గతంలో సాధారణ రోజులలో లక్ష రూపాయలుగా, శుక్రవారం నాడు 5 లక్షల రూపాయలు ఉన్న ఉదయాస్తమాన సేవ టికెట్ల ధర, ఇప్పుడు సాధరణ రోజులలో కోటి రూపాయలుగా, శుక్రవారం నాడు స్వామి వారికి అభిషేకసేవలో పాల్గొనే అవకాశం ఉండడంతో టికెట్ ధరను కోటిన్నరగా నిర్ణయించాలని టీటీడీ భావిస్తోంది. గతంలో భక్తులకు కేటాయించిన టిక్కెట్ల కాలపరిమితి ముగియడంతో ప్రస్తుతం టీటీడీ వద్ద 531 ఉదయాస్తమాన సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఆన్లైన్లో పారదర్శకంగా భక్తులకు కేటాయించేందుకు ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది.

    ఇది చదవండి: హోదాపై మరోసారి స్పందించిన కేంద్రం.. ఆ బకాయిలతో సంబంధం లేదని క్లారిటీ..


    శ్రీవారి దర్శన టిక్కెట్లు కేటాయించిన తరహాలోనే ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన ఉదయాస్తమాన సేవా టిక్కెట్లు కేటాయించేలా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఉదయాస్తమాన సేవా టిక్కెట్లు కేటాయింపుపై పాలకమండలి నిర్ణయం తీసుకోవడం ఇందుకు సంబంధిచిన విధి విధానాలు కూడా ఖరారు చేసే భాధ్యత అధికారులకు అప్పగించింది. వీలైనంత త్వరగా టిక్కెట్లు ఆన్లైన్ లో‌ ఉంచేందుకు టిటిడి‌ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వైపు కోటి, కోటిన్నర రూపాయల ధర నిర్ణయించినా,టిక్కెట్లు వెంటనే భక్తులు పొందే అవకాశాలు ఉన్నాయని టీటీడీ అంచనా వేసింది.

    ఇది చదవండి: ధనుర్మాసంలో శ్రీవారికి జరిగే ప్రత్యేక సేవలివే..! ఈ మాసంలో సుప్రభాతసేవ ఎందుకు ఉండదో తెలుసా...?


    ఇప్పటికే ఉదయాస్తమాన సేవా టిక్కెట్లు కేటాయించాలని భక్తులు నుంచి టీటీడీకి విజ్ఞప్తులు భారీగా రావడంతో వీటి ద్వారా లభించే నిధులు చిన్నపిల్లల ఆసుపత్రికి వినియోగించాలని పాలక మండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఉదయాస్తమాన సేవ టిక్కెట్లు కొనుకోలుకు టీటీడీ సభ్యులు కూడా ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. వీటి ద్వారా టీటీడీకి దాదాపు 600 కోట్ల రూపాయల వరకు నిధులు సమకూరే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనాకి వచ్చారు. ఈ నిధులన్నీ ఇతరత్ర కార్యక్రమాలకు కేటాయించే అవకాశం లేకుండా చిన్నపిల్లల కార్డియాక్ హాస్పిటల్ అభివృద్ధికి కేటాయించేందుకు చర్యలు తీసుకుంటోంది.

    ఇది చదవండి: శ్రీవారి ఆలయం గురించి ఈ విశేషాలు తెలుసా..? అడుగడుగునా గోవిందుడి ప్రతిరూపాలే..!


    టీటీడీ‌ పాలక మండలి తీసుకున్న ఈ నిర్ణయంపై చాలా మంది భక్తులు, రాజకీయ‌ నాయకులు స్వాగతిస్తుంటే కొందరు‌ మాత్రం టిటిడి తప్పుడు నిర్ణయం తీసుకుందని‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కిస్కింద్ క్షేత్రంకు చేందిన పీఠాధిపతి గొవిందానంద సరస్వతీ స్వామీ శ్రీవారి ఆలయంలో స్వామి వారి సేవలను భక్తులకు ఉచితంగా దర్శించుకునే అవకాశం కల్పచాలని డిమాండ్ చేశారు. శ్రీవారిని రోడ్డుపై పెట్టి స్వామి సేవలను ఏవిధంగా కోటి రూపాయలకు విక్రయిస్తారని ఆయన ప్రశ్నించారు.

    ఇది చదవండి: తిరుమల శ్రీవారి సుప్రభాత సేవకు ఎందుకంతటి ప్రాముఖ్యత..? ఈ పూజలో ఎన్ని ఘట్టాలుంటాయో తెలుసా..?


    శ్రీ వేంకటేశ్వరుడు సేవలు వెల కట్టలేనిదని, సేవలను టిక్కెట్ల రూపంలో విక్రయించి దాని ద్వారా వచ్చే నగదును చిన్న పిల్లల ఆసుపత్రికి ఉపయోగించరాదని, ఆసుపత్రి నిర్వహణ పూర్తిగా ప్రభుత్వం భరించాలని గోవిందానంద సరస్వతి కోరారు..అయితే టిటిడి పాలక మండలి నిర్ణయం పూర్తిగా తప్పుడు నిర్ణయం తీసుకుందని, వేంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

    టీటీడీపై కొందరు స్వాములు మిడిమిడి జ్ఞానంతో వ్యాఖ్యలు చేస్తున్నారని టిటిడి పాలక మండలి సభ్యుడు పోకల‌ అశోక్ కుమార్ ఆరోపించారు.. ఇవాళ తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోకల అశోక్ కుమార్ ఉదయాస్తమాన సేవపై ఇటీవల్ల కిస్కింద క్షేత్రం పీఠాధిపతులు గోవిందానంద సరస్వతి స్వామిజీ చేసిన వ్యాఖ్యలపై టిటిడి పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్ స్పందించారు. ఈ‌ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గోవిందానంద సరస్వతి వ్యాఖ్యలు ఖండిస్తున్నాంమని.., ఉదయాస్తమాన సేవ అంటే ఏంటో ఆయనకు తెలియదన్నారు. ఇవాళే మొదలెట్టినట్లు, డబ్బుల కోసం టీటీడీ చేస్తున్నట్లు దుష్ప్రచారం చేయడం సబబు కాదన్నారు. 1983లోనే టిటిడి ఉదయాస్తమాన సేవలు ప్రారంభించిందని వివరించారు.. 2006లో డొనేషన్స్ ఆగిపోయాయని, వీటి లైఫ్ టైం 25 ఏళ్ళు మాత్రమే ఉంటుందని,ప్రస్తుతం 531 ఖాళీలు ఏర్పడ్డాయని, 2006లో పది లక్షలకు పెంచడం జరిగిందన్నారు.. చిన్న పిల్లలకు వైద్యం కోసం ఉదయాస్తమాన సేవల ద్వారా వచ్చిన విరాళాన్ని కేటాయించాలని టిటిడి పాలక‌మండలి నిర్ణయించిందన్నారు. టీటీడీపై మాట్లాడాలని పూర్వఫలాలు తెలుసుకోకుండా మాట్లాడం మంచి పద్దతి కాదని విమర్శించారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Tirumala Temple, Tirumala tirupati devasthanam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు