GT Hemanth Kumar, Tirupathi, News18
దేశంలో ఎన్ని పదవులు ఉన్నా ఆ పదవంటేనే ఎంతో స్పెషల్. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వం (AP Government) నియమించే టీటీడీ పాలకమండలి (TTD Board) పదవి కోసం దేశ వ్యాప్తంగా భారీ ఒత్తిడులు ఉంటాయి. అలాంటి పాలకమండలి నియామకం గత కొన్నేళ్ళుగు ఓ వివాదం వెంటాడుతూ వస్తుంది. తెలంగాణ నుంచి విడిపోయిన అనంతరం ఈ వివాదం ప్రారంభం కావడం విశేషం. నిజానికి ధార్మిక పరిషత్ లో హిందువులను మాత్రమే నియమించాలనే నిబంధనలు ఉన్నాయి. కేవలం హిందువులైన వారినే పాలకమండలి సభ్యులుగా నియమిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ హయాంలో పుట్టా సుధాకర్ యాదవ్ ను టీటీడీ అధ్యక్షుడిగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నయమించింది. ఐతే ఆయన క్రిస్టియన్ మతానికి సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారని.. ఆయన క్రిస్టియన్ అంటూ ప్రచారం జరిగింది. తాను క్రిస్టియన్ కాదు మొర్రో సుధాకర్ యాదవ్ మొత్తుకున్నా సోషల్ మీడియాలో మాత్రం ట్రోల్ల్స్ ఆగలేదు.
ఇక అప్పటి టీడీపీ ఎమ్మెల్యే అనితను పాలకమండలి సభ్యురాలిగా ఏపీ ప్రభుత్వం నియమించింది. వెలగపూడి అనిత క్రిస్టియన్ అంటూ అన్యమతస్థులకు ఎలా పాలకమండలిలో చోటు కల్పిస్తారంటూ హిందూ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. దింతో అప్పటి టీడీపీ ప్రభుత్వం వెనక్కు తగ్గి అనితను పాలకమండలి సభ్యుల జాబితా నుంచి తప్పించించి. అంతటితో ఆ వివాదం సమసిపోయింది.
వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఏర్పాటు చేసిన పాలకమండలిపై విమర్శలు వెల్లువెత్తాయి. సీఎం బాబాయ్.... వైవీ సుబ్బారెడ్డి క్రిస్టియన్ అంటూ జోరుగా ప్రచారం సాగింది. అయితే అయన స్వచ్ఛమైన హిందువు అంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు స్పష్టం చేయడంతో వివాదం సర్దుమణిగింది. ఇక వరుసగా రెండోసారి వైవీ సుబ్బారెడ్డికే టీటీడీ ఛైర్మన్ పదవి కట్టబెట్టిన ప్రభుత్వం.. పాలకమండలిలో మాత్రం మార్పులు చేసింది. ఐతే పాలకమండలిలో ఓ సభ్యునిపై విపరీతమైన ట్రోలింగ్స్ సాగుతోంది. ఆయనే నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య. ఆయన్ను టీటీడీ సభ్యుడిగా నియమించడం వివాదాస్పదమవుతోంది. ఇందుకు ప్రధాన కారణం ఆయన గురించి గూగుల్ లో సర్చ్ చేస్తే సిలువ మోస్తున్న ఫొటోలు రావడమే.
క్రిస్టియన్ అయిన సంజీవయ్యకు ఎలా పాలకమండలి సభ్యులుగా అవకాశం ఇచ్చారంటూ హిందూ సంఘాలు, బీజేపీ నేతలు, ప్రశ్నిస్తున్నారు. క్రిస్టియన్ ప్రభుత్వం కాబట్టే క్రిస్టియన్ ను టీటీడీ పాలకమండలిలో సభ్యులుగా వేసి టీటీడీ ప్రతిష్ట దిగజారుస్తునట్లు విమర్శలు చేశారు. ఇక అధికార పార్టీ రెబెల్ ఎంపీ రఘురామా కృష్ణంరాజు సైతం సంజీవయ్య క్రిస్టియన్ అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో వివాదంపై స్పందించిన సంజీవయ్య తాను హిందువుగానే పుట్టానని.... హిందువుగానే చస్తాని స్టేటమంటే ఇచ్చారు. శిలువ మోస్తున్న తన ఫొటోలను కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. టీటీడీ బోర్డ్ మెంబర్ అయిన నన్ను దొంగ దెబ్బ తీసేందుకె శిలువ మోసిన చిత్రాలు వైరల్ చేస్తున్నారని ఆరోపించారు. కొందరు ఆ పదవికి నేను అనర్హుడని ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తనపై ప్రసార మాధ్యమాల్లో వస్తున్నవన్నీ అసత్య ప్రచారాలేనని చెప్పారాయన.
ఎవరో కురుక్షేత్ర పరిరక్షణ సమితి లో ఉండే ఒక దొంగ స్వామి తనపై అసత్య ప్రచారాలను చేస్తున్నాడని తాను పుట్టుకతోనే హిందువునని తమ కుటుంబానికి వెంకటేశ్వరస్వామి కులదైవము అని చెప్పారు. 2017 లో శాసన సభ్యునిగా ఉన్నప్పుడు సూళ్లూరుపేటలో క్రిస్టియన్ సోదరుల కోరిక మేరకు శిలువను మోశానని వివరించారు. ఇప్పుడు టీటీడీ బోర్డ్ మెంబర్ ని గనుక, తనని ఎవరైనా శిలువ మోయాలని కోరితే సున్నితంగా తప్పుకుంటానని అన్నారు. పాత వీడియోలను ఇప్పుడు ప్రసార మాధ్యమాల్లో పెట్టి తనను అప్రతిష్టపాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ttd, Ysrcp