TTD Cashew Controversy: టీటీడీలో ముదురుతున్న జీడిపప్పు వివాదం.. వారి సహకారం లేకుండానే జరిగిందా..?

శ్రీవారి లడ్డూ ప్రసాదం.. (ఫైల్)

తిరుమల శ్రీవారి ఆలయంతో (Tirumala Temple) పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో (TTD Temples) ప్రసాదాలు, అన్నప్రసాదం తయారీలో వాడే ముడిసరుకుల సరఫరాకు రెండేళ్లకోసారి టెండర్లు పిలుస్తారు.

 • Share this:
  GT Hemant Kumar, Tirupati, News18

  Tirumala Prasadam: శ్రీవేంకటేశ్వరుడు (Lord Venkateswara Swamy) ఎంతటి అలంకార ప్రియుడో.., అంతటి నైవేద్య ప్రియుడు కూడా. శ్రీవారికి నిత్యం నిర్వహించే సుప్రభాత సేవ మొదలుకొని ఏకాంత సేవ వరకు అనేక రకాల అన్నప్రసాదాలు, పిండి వంటలు నివేదనగా సమర్పిస్తారు. భగవంతుని దర్శనం అనంతరం అయన అనుగ్రహంగా భక్తులు భావించేది నైవేద్య ప్రసధమే. వెంకన్న దర్శన బాగ్యం అనంతరం శ్రీవారి లడ్డు ప్రసాదాలను (Tirumala Laddu Prasadam) భక్తులు శ్రీవారి అనుగ్రహంగా బావిస్తారు. భక్తులకు తెలియని ఎన్నో ప్రసాదాలను మూలమూర్తికి నివేదిస్తుంటారు. నిత్యం నిర్వహించే కైంకర్యాలను బట్టి స్వామి వారికి నివేదన సమర్పిస్తారు. పాలు, వెన్న మొదలుకొని పొంగళ్ళు, పులిహోర, చక్కెర పొంగలి వంటి ఎంతో రుచికరమైన ప్రసాదాలను స్వామి వారికి నైవేద్య సమర్పణ చేస్తారు. కమ్మటి దోశలు ఘాటైన మిరియాల పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారని కొద్ది మందికి మాత్రమే తెలుసు.

  వైఖానస అగమోక్తంగా శ్రీవారికి ఇప్పటికి కట్టెల పొయ్య మీదే ప్రసాదాలను తాయారు చేస్తారు. విమాన ప్రదిక్షిణ మార్గంలో శ్రీవారి గర్భాలయానికి ఆగ్నేయములో ప్రధాన పోటు ఉంటుంది. ఈ పోటులోనే శ్రీ వేంకటేశ్వరునికి నైవేధ్యంగా సమర్పించే అన్నప్రసాదం, పిండి వంటలు తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన ప్రసాదాన్ని ముందుగా క్షేత్ర సంప్రదాయం ప్రకారం శ్రీ భువరహ స్వామి వారికి సమర్పించిన అనంతరం శ్రీవారికి గంటానాధాల మధ్య నైవేద్యం సమర్పిస్తారు. ఆ తర్వాత శ్రీ వారి ఆలయంలోని పరివార దేవతామూర్తులకు, ఆలయం ఏదురుగా ఉన్న భేడి ఆంజనేయ స్వామి వారికి నైవేద్య సమర్పణ జరుగుతుంది. శ్రీవారికి 50 రకాలకు పైగా నైవేద్యాలు సమర్పిస్తుంటారు. శ్రీ వేంకటేశ్వరుని దర్శనం అనంతరం చెక్కర పొంగలి, పులిహోర, దద్దోజనం, మిరియాల పొంగలి, చిన్న లడ్డులను భక్తులకు వితరణ చేస్తారు. వివిధ ఆర్జిత సేవల్లో పాల్గొన్న భక్తులకు వడ, దోశ, జిలేబి, పెద్ద లడ్డు, మురుకు, పెద్ద వడ, తదితర ప్రసాదాలను అందజేస్తారు.

  ఇది చదవండి: శ్రీవారి భక్తులకు అలర్ట్... ఉచిత దర్శన టోకెన్లపై టీటీడీ సంచలన నిర్ణయం...


  టెండర్ల ద్వారా ముడిసరుకుల కొనుగోలు...

  ఇలా తయారు చేసే ప్రసాదాలకు కావలసిన ముడి సరుకుల కొనుగోలుకు టీటీడీ (TTD) ఈ ప్రొక్యూమెంట్ ద్వారా టెండర్లకు పిలుస్తుంది. నిత్యం స్వామి వారికి నివేదించే నైవేద్యాలు, ప్రసాదాలు, అన్నదానం, అనుబంధ ఆలయాల్లో ప్రసాదాల తయారీకి కావాల్సిన ముడిసరుకుల కొనుగోలుకు టీటీడీ టెండర్లు ఆహ్వానిస్తుంది. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ టెండర్ల కోసం భారీగానే పోటీ ఉంటుంది. ఎవరు తక్కువ ధరకు కోట్ చేస్తే వారికే టెండర్ కట్టబెడతారు. టెండర్ దక్కించుకున్న సంస్థలు రెండేళ్లపాటు ప్రసాదాల తయారీకి సంబంధించిన ముడిసరుకులు సరఫరా చేస్తాయి. ఇలా జీడీపప్పు, కంది, ఉద్ది, ఇతర పప్పులు ధాన్యాలు సరఫరా చేస్తాయి. ప్రసాదాల తయారీలో ఏ1 గ్రేడ సరుకులను మాత్రమే టీటీడీ వినియోగిస్తూ వస్తుంది.

  ఇది చదవండి: ఆ జిల్లాలో మహిళే మహారాణులు... పార్టీ ఏదైనా వారిదే రాజ్యం..


  శ్రీవారి ప్రసాదం, నిత్యాన్నదానం, టీటీడీ అనుబంధ ఆలయాల్లో ప్రసాదానికి కావలసిన ముడి సరుకుల్లో ప్రధానమైనది జీడీపప్పు. రెండేళ్లకుగానూ 1 లక్ష 70 వేల కేజీల జీడిపప్పు సరఫరా చేసేందుకు టీటీడీ టెండర్ పిలిచింది. ఇందులో అతి తక్కువగా కోడ్ చేసిన బెంగళూరుకుచెందిన హిందుస్తాన్ ముక్తా కంపెనీ టెండర్ దక్కించుకుంది. గ్రేడ్-1 రకం జీడిపప్పు కేజీకి రూ.650, గ్రేడ్-2 రకం జీడిపప్పురూ.534లకు హిందుస్తాన్ ముక్తా సంస్థ సరఫరా చేస్తోంది.

  ఇది చదవండి: భక్తులకు శుభవార్త చెప్పడం వెనుక కారణం ఇదేనా..? పెరటాశి నెల అంటే ఏమిటీ..?  ఐతే సోమవారం వేర్ హౌస్ విభాగంలో నాసిరకం జీడిపప్పు కలకలం రేపింది. నాసిరకం, పురుగులు పట్టిన జీడిపప్పు గోల్మాల్ ఉదంతం వెలుగు చూసింది. నెలకోసారి సరఫరా చేసే జీడిపప్పు మెత్తబడిన నాసిరకం మాత్రమే కాకుండా పురుగులు పట్టి ఉండటం గమనార్హం. దాదాపు 10 లారీల లోడుతో 150 టన్నుల జీడిపప్పును వెనక్కు పంపింది టీటీడీ. మరుసటి నెలలో పురుగులు పట్టిన జీడిపప్పు ప్యాకింగ్ మార్చి మళ్లీ టీటీడీకే పంపింది సరఫరా సంస్థ.

  ఇది చదవండి: చంద్రబాబు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. మంత్రి కొడాలి నాని సవాల్


  వేర్ హౌస్ విభాగం నుంచి గోవిందరాజ స్వామి, ఇతర టీటీడీ అనుబంధ ఆలయాలు, తిరుమలలోని నిత్యాన్నదానంకు ఈ పురుగులు పట్టి, నాసిరకంగా ఉన్న జీడిపప్పులు పంపిణి చేశారు. ఆయా విభాగాధి పతులు టీటీడీ ఈవో జవహర్ రెడ్డికి, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డికి నాసిరకం జీడిపప్పు వచ్చినట్లు పిర్యాదు చేశారు. తిప్పి పంపిన లోడునే సరఫరా సంస్థ ప్యాకింగ్ మార్చి పంపించినా.. వేర్ హౌస్ డిపార్ట్మెంట్ ఏంచేస్తోందని అరా తీశారు.

  లోపాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించేందుకు టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి విజిలెన్స్ విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు టీటీడీ వేర్ హౌస్ విభాగంలో పనిచేసే ఉద్యోగులకు తాయిలాలు అందించి వారి సహాయంతో కొందరు కాంట్రాక్టర్లు శ్రీవారి ప్రసాదాలకు నాసిరకం జీడిపప్పును తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారుల విచారణలో తేలినట్లు సమాచారం. సరఫరా సంస్థతో మార్కెటింగ్ విభాగంలో కొందరు ఉద్యోగుల కుమ్మక్కయినట్లు తెలుస్తోంది. విజిలెన్స్ నివేదిక మేరకు కాంట్రాక్టర్ తో పాటు ఇంటి దొంగలపై కూడా చర్యలు తీసుకునేందుకు టీటీడీ సిద్ధమవుతునట్లు సమాచారం.
  Published by:Purna Chandra
  First published: