GT Hemanth Kumar, Tirupathi, News18
Kanipakam: వివాదాల సుడిగుండంగా మారుతోంది కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం (kanipakam Varasiddhi Vinayaka Swamy Temple). బంగారు వీభూదిపెట్టి వివాదం నుంచి.. టీటీడీ టిక్కెట్ల వివాదం (TTD Tickets Vivadham) మరువకముందే మరో వివాదంలో చిక్కుంది. ఆలయంలో పనిచేసే సిబ్బంది.. అర్చకులకపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి చొరవతో.. కొన్ని వివాదాలు ముగిసిపోతున్నాయి. కానీ కొందురు సిబ్బంది.. ఆలయ అర్చకుల తీరుతో కొన్ని వివాదాలు కొని తెచ్చుకున్నట్టు అవుతోంది. ఆలయం ఏర్పడిన నాటి నుంచి ఉభయదారుల సలహా మేరకు నిర్ణయాలు తీసుకొనే వారు. కానీ ప్రస్తుతం ఉభయదారులు ఆలయ నిర్వాహకులపై.. అర్చకులపై ఆరోపణలు చేయడంతో మరోమారు వార్తల్లోకి వచ్చింది.
శివాలయానికి ఇచ్చిన అమ్మవార్ల విగ్రహం.. గోల్డ్ కోటెడ్ ఆభరణాలు ఇచ్చిన రసీదు ఇవ్వలేదని మీడియా ముఖంగా ఆరోపణలు చేస్తున్నారు. స్వామి వారిని ఎంతో భక్తితో కొలిచే భక్తులకు మొండి చేయి చూపిస్తున్నారని చిత్తూరు నగరం కట్టమంచికి చెందిన ఉభయదారులు కె విజయలక్ష్మి మహేష్ చక్రవర్తి ఆరోపించారు. చిత్తూరు నగరంలోని కట్టమంచిలో ఆలయ అర్చకులపై సంచళన ఆరోపణలు చేశారు.
శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న మరగదాంబిక సమేత శ్రీ మణికంటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఏడాది దసరా ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఒక లక్ష రూపాయలు వెచ్చించి లక్ష్మీ, సరస్వతి అమ్మవార్లకు అభిషేకం, లక్ష్మీ పూజ, శాశ్వత గ్రామోత్సవానికి గాను అప్పటి కాణిపాకం ఆలయ ఈవో పూర్ణచంద్రరావు నుంచి 2013 అక్టోబర్ 16వ తేదీన అనుమతి పొంది ఉన్నామని పేర్కొన్నారు. ఈ క్రమంలో 2013 వ సంవత్సరంలో సంబంధిత ఆలయ ప్రాంగణంలో రాహుకేత మండప నిర్మాణంతో పాటు, 25 వేల రూపాయలు వెచ్చించి సరస్వతి అమ్మవారు, 35 వేల రూపాయలు వెచ్చించి లక్ష్మీదేవి అమ్మవార్ల విగ్రహాలను కొనుగోలుకు గాను నగదు రూపంలో అప్పటి మణికంఠేశ్వర స్వామి ఆలయ ఉప ప్రధాన అర్చకులుగా ఉన్న సోమశేఖర్ స్వామి వారికి అందజేశామన్నారు.
అదే క్రమంలో సోమశేఖర్ స్వామి వారి వినతి మేరకు మరో రూ 50 వేలుతో లక్ష్మీదేవి, సరస్వతి అమ్మవార్లకు గోల్డ్ కోటెడ్ ఆభరణాలను నగదు రూపేనా కానుకగా అందజేసినట్లు వెల్లడించారు.. ఈ విగ్రహాలకు, ఆభరణాలకు సంబంధించి పది సంవత్సరాలుగా కావస్తున్నా ఇప్పటి వరకు తనకు ఎటువంటి రసీదులు సైతం ఇవ్వలేదని వారు ఆరోపించారు. రసీదులు అడిగినప్పుడల్లా ఏదో కుంటి సాకులు చెప్పి కాలం వెలగదీస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల కాణిపాకం ఆలయంలో విభూది పట్టికి సంబంధించిన వేలూరు నారాయణి అమ్మ దేవస్థానం వారు కోరిన వెంటనే రసీదులు ఇచ్చారని, అయితే తనకు మాత్రం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా రంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అదే విధంగా ఇటీవల స్వామి వారి ఆలయ జీర్నోదరణ తరువాత నిర్వహించిన ఆలయ కుంభాభిషేక కార్యక్రమానికి సైతం తనకు ఆహ్వానం లేదని, కనీసం తనకు తీర్థప్రసాదాలు సైతం చేర్చలేదంటూ ఆలయ ఉభయదారులు విజయలక్ష్మి ఆరోపించారు.. అమ్మవార్ల విగ్రహాలు, గోల్డ్ కోటెడ్ ఆభరణాలు మాయం.. రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారితో పాటు మరో 17 మంది సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి కాణిపాకంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను అరికట్టడంతో పాటు ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కాణిపాకం ఆలయ ఉభయదారులు కె.విజయలక్ష్మీ కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Chitoor, Hindu Temples