హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

College Love: స్టూడెంట్ తో లెక్చరర్ ప్రేమాయణం.. ఫిజిక్స్ క్లాస్ లో కెమిస్ట్రీ పాఠాలు.. కట్ చేస్తే..

College Love: స్టూడెంట్ తో లెక్చరర్ ప్రేమాయణం.. ఫిజిక్స్ క్లాస్ లో కెమిస్ట్రీ పాఠాలు.. కట్ చేస్తే..

;తిరుపతిలో స్టూడెంట్ ను తీసుకెళ్లిపోయిన లెక్చరర్

;తిరుపతిలో స్టూడెంట్ ను తీసుకెళ్లిపోయిన లెక్చరర్

తిరుపతి (Tirupathi) గాంధీ రోడ్డులోని చైతన్య జూనియర్ కళాశాలలో లక్ష్మి (పేరు మార్చాం) ఇంటర్ బైపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఎంతో చురుగ్గా చదివే లక్ష్మీ అన్నిటిలోను మంచి మార్కులను సాధిస్తూ వస్తోంది. ఇదే కాలేజీలో కార్తీకేయ ఫిజిక్స్ లెక్చరర్ గా పనిచేస్తున్నాడు.

ఇంకా చదవండి ...

  GT Hemanth Kumar, Tirupathi, News18

  ఆమె ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్. ఈ ఏడాదే స్కూల్ నుంచి కాలేజీలోకి అడుగుపెట్టింది. కాలేజీకి వెళ్లి చక్కగా చదువుకోవాల్సింది కాస్తా ట్రాక్ తప్పింది. ఇంటర్ పూర్తి చేసి డాక్టర్ కావాల్సింది పోయి.. ఒకరికి లవర్ గా మారింది. అక్కడితో ఆగలేదు. తెలిసీ తెలియని వయసులోనే గడప దాటేసింది. ఇక అతడో ఫిజిక్స్ లెక్చరర్. ఇంటర్ విద్యార్థులకు పాఠాలు చెబుతూ వాళ్ల భవిష్యత్తు తీర్చిదిద్దాల్సిన బాధ్యత అతడిపై ఉంది. కానీ మనోడు ఫిజిక్స్ చెప్పకుండా అమ్మాయిలకు కెమిస్ట్రీ పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు. అక్కడితో ఆగలేదు ఓ విద్యార్థికి ప్రేమ పాఠాలు కూడా చెప్పాడు. ఆమెను పూర్తిగా తన మాయలో పడేలా చేసి ఆమెను తీసుకొని వెళ్లిపోయాడు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తిరుపతి (Tirupathi) లో చోటు చేసుకుందీ ఘటన. స్టూడెంట్ తో లవ్ ట్రాక్ నడిపిన లెక్చరర్ ఆమెను తీసుకొని వెళ్లిపోయాడు.

  వివరాల్లోకి వెళ్తే.., తిరుపతి గాంధీ రోడ్డులోని చైతన్య జూనియర్ కళాశాలలో లక్ష్మి (పేరు మార్చాం) ఇంటర్ బైపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఎంతో చురుగ్గా చదివే లక్ష్మీ అన్నిటిలోను మంచి మార్కులను సాధిస్తూ వస్తోంది. ఇదే కాలేజీలో కార్తీకేయ ఫిజిక్స్ లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. తన పని తాను చేయాల్సింది పోయి.. ఫిజిక్స్ నేర్పీస్తూనే లక్ష్మీకి ప్రేమ పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు. తొలుత చదువులో ఆమెను ప్రోత్సహిస్తున్నట్లే కనిపించి.. ఆ తర్వాత మెల్లగా ముగ్గులోకి దిచాడు. పూర్తిగా తన మాయలో పడేలా చేశాడు. లెక్చరర్ చెప్పిన మాటలకు లక్ష్మీ మనసు పారేసుకుంది. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు.

  ఇది చదవండి: ప్రియురాలితో భర్త రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య..


  ఐతే నిత్యం ఫోన్లో మాట్లాడుతున్న లక్ష్మీని గమనించిన తల్లిదండ్రులు ఆమెను మందలించారు. ఇప్పుడే ప్రేమ దోమ అంటూ కెరీర్ ను పాడుచేసుకోవద్దని హెచ్చరించారు. పెద్దలు మందలించిన తర్వాతి రోజు సాయంత్రం ఆమె ఇంటికి రాలేదు. తమ కుమార్తెకేమైందని కంగారుగా కాలేజీకి వెళ్లిన తల్లిదండ్రులకు తోటి విద్యార్థులు చెప్పిన మాటలు విని షాక్ తప్పలేదు. ఫిజిక్స్ లెక్చరర్ కార్తికేయ ఆమెను తీసుకొని వెళ్లిపోయాడు.

  ఇది చదవండి: ఈ మహాతల్లి చూడండి ఏం ఘనకార్యం చేసిందో..! పుట్టిల్లు అనే ఇంగిత జ్ఞానం కూడా లేదా..?


  ఇదే విషయంపై కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. అటు పోలీస్ స్టేషన్ కు వెళ్లినా పోలీసులు సరిగా స్పందించడం లేదని చెబుతున్నారు. తమ కుమార్తె అదృశ్యమై ఇప్పటికి నాలుగురోజులైందని.. ఇప్పుడు ఎవర్ని ఆశ్రయించాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదిలేక తెలిసిన వారు, బంధువుల సాయంతో తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలిస్తున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Lovers, Tirupati

  ఉత్తమ కథలు