TIRUPATI COLLECTOR OFFICE EMPLOYEE SEXUALLY HARASSING WOMAN FOR ANGANWADI OFFICE FULL DETAILS HERE PRN TPT
Harassment: రూమ్ కి వస్తేనే ప్రభుత్వ ఉద్యోగం.. కలెక్టరేట్ లో యువతికి వేధింపులు.. ఎక్కడంటే..!
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కర్నూలు జిల్లాలోని (Kurnool District) ఓ గ్రామంలో అంగన్ వాడీ టీచర్ పోస్టు ఐదేళ్లుగా ఖాళీగా ఉంది. దీంతో ఓ యువతి తాను ఆ పోస్టుకు అన్ని విధాలుగా అర్హురాలినని భావించి దరఖాస్తు చేసుకుంది. కానీ ఆమె అనుకున్నది ఒకటి.. అక్కడ జరిగింది మరొకటి.
మనిషి హాయిగా బ్రతకాలంటే ఏదైనా ఉపాధి కావాలి. అందుకే సొంతంగా వ్యాపారం కొందరు చేస్తుంటే..! మరి కొందరు ఉద్యోగాలు చేస్తుంటారు. ప్రస్తుత సమాజంలో పురుషులకు పోటీగా మహిళలు ఉద్యోగావకాశాలు (Job Opportunities) అందిపుచ్చుకుంటున్నారు. ప్రైవేట్ తో పాటు ప్రభుత్వ రంగంలోనూ మహిళలు మెరుగైన ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఐతే మహిళలు ఎక్కడ పనిచేస్తూన్నా వారికి వేధింపులు ఎదురవుతూనే ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. అలాంటి వేధింపులకు పాల్పడిన వారిపై బదిలీ వేటు వేసి చేతులు దులుపుకుంటున్న సందర్భాలే ఎక్కువ. ప్రభుత్వ కార్యాలయాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం కావాలన్నా ఉన్నతాధికారులకు ఎంతో కొంత సమర్పించుకోవాల్సిన పరిస్థితి. అదే మహిళల పరిస్థితి అయితే భిన్నం. మహిళల విషయంలో లంచానికి మించి సమర్పించుకోవాల్సిన దుస్థితి నెలకొంటోంది. అంగన్ వాడీ టీచర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసిన ఓ మహిళ ఉద్యోగంలో చేరకుండానే లైంగిక వేధింపులు (Harassment) ఎదుర్కోవలసి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని కర్నూలు జిల్లాలోని (Kurnool District) ఓ గ్రామంలో అంగన్ వాడీ టీచర్ పోస్టు ఐదేళ్లుగా ఖాళీగా ఉంది. దీంతో ఓ యువతి తాను ఆ పోస్టుకు అన్ని విధాలుగా అర్హురాలినని భావించి దరఖాస్తు చేసుకుంది. ఉద్యోగానికి అప్లై చేసుకునేముందు ఆధార్, ఫోన్ నెంబర్ వంటి వివరాలను ఆన్ లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆన్ లైన్ పోల్టల్లో తనకు సంబంధించిన అన్ని వివరాలను నమోదు చేసుకుంది.
ఐతే కలెక్టరేట్లోని ఎల్ఆర్ఓ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ సదరు యువతి ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఆన్లైన్ ప్రక్రియ నమోదుకు వెళ్లిన నాటి సాయంత్రం నుంచే ఆ యువతితో మొబైల్ ద్వారా మాట్లాడటం ప్రారంభించాడు. కచ్చితంగా ఉద్యోగం కావాలంటే నేను చెప్పింది చేయాలి అంటూ హుకుం జారీ చేసాడు. ఉద్యోగం డబ్బుతో అయ్యే పనికాదని.. పడక సుఖం కావాలని వేధించడం మొదలుపెట్టాడు.
ఓ ఉన్నతాధికారి రూమ్ కు వెళ్లి అతనితో ఏకాంతంగా గడిపితే అపాయింట్ మెంట్ ఆర్డర్ వస్తుందని చెప్పాడు. ఐతే ముందుగానే అప్రమత్తమైన బాధితురాలు సదరు ఫోన్ కాల్ ను రికార్డ్ చేసింది. ఆ తర్వాతి రోజే కలెక్టర్ కోటేశ్వరరావుకు ఫోన్ సంభాషణను వినిపిచింది. యువతి నుంచి ఫిర్యాదు స్వీకరించిన కలెక్టర్ విచారణ జరపాలని డీఆర్ఓను ఆదేశించారు. వేధింపులకు పాల్పడ్డ జూనియర్ అసిస్టెంట్ ను సస్పెండ్ చేశారు.
ఈ వ్యవహారంలో ఒక డిప్యూటీ తహసీల్దార్, ఆర్ఐ హస్తం ఉన్నట్లు తెలిసింది. ఐతే నేరుగా చర్యలు తీసుకోకుండా డిప్యూటేషన్ పై వచ్చిన వారిని తిరిగి బదిలీ చేశారు. తప్పుచేసిన వారిని శిక్షించకుండా దానికి సహకరించిన వారిపై చర్యలు తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.