హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan Promise: ఒట్టేసి చెబుతున్నా.. మాట తప్పను.. సీఎం జగన్ ఇచ్చిన హామీ ఏంటో తెలుసా..?

CM Jagan Promise: ఒట్టేసి చెబుతున్నా.. మాట తప్పను.. సీఎం జగన్ ఇచ్చిన హామీ ఏంటో తెలుసా..?

సంక్షేమ పథకాల లబ్ధి కోసం మధ్యదళారీలు, పైరవీకారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పని లేకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లో జాబితాల ప్రదర్శన. సోషల్‌ ఆడిట్‌ ద్వారా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందని వైసీపీ సర్కారు తెలిపింది.

సంక్షేమ పథకాల లబ్ధి కోసం మధ్యదళారీలు, పైరవీకారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పని లేకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లో జాబితాల ప్రదర్శన. సోషల్‌ ఆడిట్‌ ద్వారా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందని వైసీపీ సర్కారు తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) రెండు రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వరద బాధితుల బాధలు, సమస్యలు తెలుసుకొని వారికి భరోసా ఇస్తున్నారు. తన టూర్లో భాగంగా ఉద్యోగులకు కూడా సీఎం వరాలిచ్చారు.

ఇంకా చదవండి ...

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) రెండు రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వరద బాధితుల బాధలు, సమస్యలు తెలుసుకొని వారికి భరోసా ఇస్తున్నారు. బాధితులకు ఏం చేయాలి.. ఎలా చేయాలి అనే అంశాలపై అధికారులకు సూచనలిస్తున్నారు. ఐతే వరద బాధితులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు సీఎంను కలిసి తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. తిరుపతి శ్రీకృష్ణనగర్లో పర్యటిస్తున్న సందర్భంగా టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగులు సీఎంను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా తమను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. వారం రోజులుగా టీటీడీ పరిపాలనా భవనం వద్ద నిరసన తెలుపుతున్నా పట్టించుకోలేదని సీఎం ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.

  కాంట్రాక్టు కార్మికుల బాధను శ్రద్దగా సీఎం జగన్ శ్రద్ధగా విన్నారు. అంతలోనే ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. హామీ ఇస్తే ఏముంది అనుకున్నారో ఏమో గానీ.., ఏకంగా కాంట్రాక్టు కార్మికురాలి తలపై చేతులు పెట్టి ఒట్టేసారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని ఒట్టేసి మరీ చెప్పారు. దీంతో కాంట్రాక్టు ఉద్యోగుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఉద్యోగాల క్రమబద్ధీకరణ కోసం నిరసన తెలుపుతున్న తమకు సీఎం హామీ ఇవ్వడం శుభపరిణామం అని కాంట్రాక్టు ఉద్యోగులు అంటున్నారు.

  ఇది చదవండి: పది రోజుల్లో పీఆర్సీ.. ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్..


  అంతకుముందు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు సీఎంన కలిసి తమ పీఆర్సీ అంశాన్ని పరిశీలించి త్వరగా నివేదిక విడుదల చేయాలని కోరారు. ఉద్యోగుల విజ్ఞప్తిపై స్పందించిన సీఎం దీనికి సంబంధించిన కసరత్తు పూర్తైందని జగన్ వారికి చెప్పారు. అలాగే 10 రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని తెలిపారు. దీంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. పీఆర్సీ నివేదిక వచ్చి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం విడుదల చేయుకండా జాప్యం చేస్తోందని కొందకాలంగా ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ ప్రకటన వారికి ఊరటనిచ్చింది.


  ఇది చదవండి: పోలవరం ట్రోల్స్ పై మంత్రి అనిల్ రియాక్షన్.. దమ్ముంటే ఆ పనిచేయాలని సవాల్..  ఇదిలా ఉంటే వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన సందర్భంగా పలు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కడప జిల్లా పులపుత్తూరులో పర్యటిస్తూ సీఎం జగన్ ఓ చంటిబిడ్డను ఎత్తుకొని ఆడించారు. బిడ్డను భుజాన వేసుకునే బాధితుల సమస్య విన్నారు. అలాగే తమకు వరద సాయం అందలేదని పలువురు సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. అప్పటికప్పుడు సాయం చేయాల్సిందిగా కలెక్టర్ ను ఆదేశించారు. సమస్య తీరకుంటే ఫోన్ చేయాలంటూ సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి ధనుంజయ రెడ్డి ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఇప్పుడు ఉద్యోగుల సమస్యలు తీరుస్తానంటూ ఓట్టేసి మరీ చెప్పారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Employees, Tirupati

  ఉత్తమ కథలు