Home /News /andhra-pradesh /

TIRUPATI CM YS JAGAN MOHAN REDDY COMPLETED EXERCISE ON TTD NEW BOARD FULL DETAILS HERE PRN TPT

TTD Board Update: టీటీడీ పాలకమండలిపై సీఎం జగన్ కసరత్తు పూర్తి..? కొత్త సభ్యులు వీరేనా..?

శ్రీవారి ఆలయం (ఫైల్)

శ్రీవారి ఆలయం (ఫైల్)

టీటీడీ పాలకమండలి (TTD Board)నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించిన ప్రభుత్వం లిస్ట్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం పై తీవ్ర ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో సంఖ్యను 75కు పెంచినట్లు సమాచారం.

  GT Hemanth Kumar, Tirupati, News18

  Tirumala Temple: ఏడుకొండలవాడు కొలువైన పవిత్ర పుణ్య క్షేత్రం వెంకటాచలం. ఆపదమొక్కుల వాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్నది. బ్రిటిష్ పాలనా నుంచి నేటి వరకు శ్రీవారి దేవస్థానం (Tirumala Temple) పరిపాలన అవసరాలకు అనుగుణంగా పాలకమండలి నియామకం చేపడుతారు. ప్రస్తుతం ఈ పాలకమండలి ఏర్పాటు సీఎం నేతృత్వంలో ప్రభుత్వ అధికారులు నియామకం చేపడుతారు. స్వామి వారి దర్శనానికి విచ్చేసే భక్తుల సంఖ్య క్రమంగా పెరుతున్న విధంగానే.., శ్రీవారి దర్శనాలు (Tirumala Darshan)., సేవలకు ఎనలేని డిమాండ్ ఉంటుంది. శ్రీవేంకటేశ్వరుని దివ్యమంగళ స్వరూపాన్ని ఒక్కసారి దర్శించుకుంటే సరిపోదు.., నిత్యం అయన సేవలోనే ధరిస్తే ఎంత బాగుణ్ణో అనే భావన ప్రతి భక్తుని మనసులో కోర్కెగా మిగిలిపోతుంది. ఆయనను ఎన్నిసార్లు దర్శించుకున్నా.. మళ్లీ, మళ్లీ ఆ భాగ్యం దక్కుతుందా అనే భావన ప్రతి ఒక్కరిలో రావడంతోనే ఇంత డిమాండ్ ఉంటుంది.

  టీటీడీ పాలకమండలిలో చోటు కోసం రాజకీయ నాయకుల నుంచి బడా బడా పారిశ్రామిక వేత్తల వరకు సభ్యుని చోట. కోసం పైరవీలు చేస్తుంటారు. చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని నియమించిన ఏపీ ప్రభుత్వం సభ్యుల నియామకంపై కసరత్తు పూర్తిచేసి ఓ లెక్కకు వచ్చినట్లు తెలుస్తోంది. నూతన పాలకమండలి నియమించే ప్రతి సారి రాష్ట్ర ప్రభుత్వంకు భారీగా సిఫార్సులు వస్తుంటాయి. సభ్యులుగా మా వారికీ అవకాశం ఇవ్వండి అంటూ పీఠాధిపతులు, వివిధ రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రుల నుంచి రికమండేషన్స్ వస్తుంటాయి. ఇక రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ (YSRCP) అధికారంలోకి రాగానే మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) అధ్యక్షతన 50వ పాలకమండలిని ఏర్పాటు చేసింది.

  ఇది చదవండి: ఢిల్లీలో దిశ యాప్ రక్షణ... తెలుగు యువతిని కాపాడిన ఆంధ్రా పోలీసులు...


  పాత పాలకమండలి గడువు ముగియడంతో.... స్పెసిఫైడ్ ఆథారిటీని నియమించింది ప్రభుత్వం చైర్మన్ పదవిపై ఒత్తిడులు ఎక్కువవుతున్న నేపథ్యంలో 52వ పాలకమండలి చైర్మన్ గా తిరిగి వైవీ సుబ్బారెడ్డిని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. సభ్యుల నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించిన ప్రభుత్వం లిస్ట్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం పై తీవ్ర ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో సంఖ్యను 75కు పెంచినట్లు సమాచారం.

  ఇది చదవండి: ప్రజల కోసమే ఈ నిర్ణయం.., సినిమా టికెట్లపై క్లారిటీ ఇచ్చిన మంత్రి


  రాష్ట్ర విభజనకి ముందు వరకు 12 మంది పాలకమండలి సభ్యులు., టీటీడీ ఈవో., రెవెన్యూ ప్రినిసిపల్ సెక్రటరీ, దేవాదాయశాఖ కమిషనర్లు ఎక్స్ ఆఫీసియో మెంబర్లుగా ఉండే వారు. రాష్ట్ర విభజన ముందు వరకు ఈ పద్దతే అవుతూ వచ్చింది. విభజన అనంతరం చంద్రబాబు ఆ సంఖ్యను 15కు పెంచుతూ ముగ్గురిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. చంద్రబాబు అనంతరం సీఎం పీఠం ఎక్కిన జగన్ ఆ సంఖ్యను 25కి పెంచుతూ...11 మంది ప్రత్యేక ఆహ్వానితులని నియమించారు.

  ఇది చదవండి: పెన్షన్ దారులకు అలర్ట్... వారం రోజులే డెడ్ లైన్.. లేదంటే పెన్షన్ కట్..


  ఇక సభ్యుల నియామకం కోసం కసరత్తు చేస్తున్న ప్రభుత్వానికి కేంద్ర మంత్రులు అమిత్ షా (Amit Shah), నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman), తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల నుంచి సిఫార్సులు వచ్చినట్లు సమాచారం. వీరే కాకుండా సీఎం జగన్ (AP CM YS Jagan) కేబినెట్లో ఉన్న మంత్రుల బంధువులు, వైసీపీ కీలక నేతలు, సీఎం మిత్రులు, బడా పారిశ్రామిక వేత్తలు సిఫార్సు చేసిన వారి సమాఖ్య దాదాపు 100మందికి చేరిందని చెప్తున్నారు. వీరిలో ఎంత ఫిల్టర్ చేసినా 80 మంది వస్తున్నారట. వారిని తొలగించడానికి సాధ్యం కానీ పరిస్థితుల్లో 75 మంది వరకు సభ్యులను నియమించనున్నారు.

  టీటీడీ పాలక మండలిపై ఒకటిరెండు రోజుల్లో ఉత్తర్వులు విడుదల కానున్నట్లు తెలుస్తుంది. ఏకంగా 25 మంది సభ్యులతో పాలక మండలి ఏర్పాటు చేయగా., .ఎక్స్ అఫిషియో సభ్యులుగా చెవిరెడ్డి, భూమన, మరియు బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సుధాకర్ ను నియమించనున్నారు. ఇక ప్రత్యేక ఆహ్వానితులుగా 50 మందికి చోటు కల్పించనున్నట్లు సమాచారం. ఇందులో తెలంగాణ కోటా నుంచి 10 మందికి, తమిళనాడు, కర్ణాటక, మరియు మహారాష్ట్రల నుంచి కూడా ఇద్దరి నుంచి నలుగురికి పాలక మండలి లో చోటు దక్కినట్లు తెలుస్తోంది.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Tirumala tirupati devasthanam, Ttd

  తదుపరి వార్తలు