Home /News /andhra-pradesh /

CM Jagan Tour : తిరుపతిలో సీఎం జగన్ పర్యటన.. వరద బాధితులకు భరోసా..

CM Jagan Tour : తిరుపతిలో సీఎం జగన్ పర్యటన.. వరద బాధితులకు భరోసా..

వరద బాధితులతో మాట్లాడుతున్న సీఎం జగన్

వరద బాధితులతో మాట్లాడుతున్న సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) పర్యటన కొనసాగుతోంది. తొలిరోజు కడప జిల్లాలో పర్యటించిన సీఎం.. రెండో రోజు తిరుపతి (Tirupathi) లోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) పర్యటన కొనసాగుతోంది. తొలిరోజు కడప జిల్లాలో పర్యటించిన సీఎం.. రెండో రోజు తిరుపతి (Tirupathi) లోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. శ్రీకృష్ణానగర్ లో వరద తీవ్రత తెలిపే పోటో ప్రదర్శనను తిలకించారు. బాధితులతో నేరుగా మాట్లాడిన సీఎం.. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తిరుపతి నగరంలోకి వరదనీరు రాకుండా చర్యలు తీసుకుంటామని జగన్ అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యం బాధితులకు అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరికీ వరదసాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తిరుపతిలో పర్యటించిన అనంతరం తిరుపతి రూరల్ మండలం పాడిపేట వరద బాధితులను జగన్ పరామర్శిస్తారు. సీఎంతో పాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆర్.కే.రోజా, ఇతర అధికారులు పాల్గొన్నారు.

    కడప జిల్లా (Kadapa District) రాజంపేట నియోజకవర్గంలోని పులపుత్తూరు గ్రామంలో జగన్ పర్యటించారు. కాలినడకన గ్రామంలో కలియదిరిగిన సీఎం జగన్.. బాధితులతో నేరుగా వెళ్లి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమకు వరదసాయం అందలేదని ఐదు కుటుంబాలు జగన్ కు విన్నవించుకున్నాయి. వెంటనే కలెక్టర్ తో మాట్లాడిన సీఎం సాయంత్రానికల్లా డబ్బులు వస్తాయని.. ఒకవేళ రాకపోతే ఈ నెంబర్ కు కాల్ చేయాలంటూ సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి ధనుంజయ రెడ్డి ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఎవరూ అధైర్యపడవద్దని తానున్ననానని భరోసా ఇచ్చారు. ఓ మహిళ వద్ద ఉన్న పసికందును ఎత్తుకొని ఆడించిన సీఎం.. బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే వరద సహాయక చర్యల్లో అధికారులు చక్కనిపనితీరు కనబరిచారని సీఎం అభినందించారు.

    ఇది చదవండి: అఖండ మూవీకి అధికారుల బ్రేక్.. ఏపీలో థియేటర్ సీజ్.. కారణం ఇదే..!

    ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్.. వరద బాధితులను అన్నిరకాలుగా అండగా ఉంటామని హమీ ఇచ్చారు. రేపటి నుంచే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే డ్వాక్రా మహిళల రుణాలకు సంబంధించి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని.. పనులు లేకపోవడంతో వారు నెలసరి వాయిదాలు చెల్లించే పరిస్థితుల్లో లేరన్నారు. వారికి ఉపశమనం కలిగించేలా మంచి నిర్ణయం తీసుకుంటామని జగన్ హామీ ఇచ్చారు. ఐతే డ్వాక్రా మహిళలకు రుణంపై ఏడాది మారటోరియం ఇప్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు జాబ్ మేళాలు నిర్వహిస్తామని.. ప్రభుత్వంలో ఔట్ సోర్సింగ్ లేదా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలిచ్చేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.

    మీ నగరం నుండి (​తిరుపతి)

    ఆంధ్రప్రదేశ్
    ​తిరుపతి
    ఆంధ్రప్రదేశ్
    ​తిరుపతి
    Published by:Purna Chandra
    First published:

    Tags: Ap cm ys jagan mohan reddy, AP Floods, Tirupati

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు