Home /News /andhra-pradesh /

TIRUPATI CLASS 8TH STUDENT PAYS TRIBUTES TO FREEDOM FIGHTER ALLURE SEETHARAMA RAJU BY CREATING HIS PORTRAIT WITH RUBRIC CUBES IN TIRUPATI FULL DETAILS HERE PRN TPT

Alluri Seetharama Raju: అల్లూరికి ఇంతకంటే గొప్ప నివాళి ఎవరివ్వగలరు..! మన్యం వీరుడికి సలాం

అల్లూరి చిత్రంతో మంజునాథ్

అల్లూరి చిత్రంతో మంజునాథ్

Tirupati: భారతమాత బానిస సంకెళ్లు తెంచేందుకు ఎంతోమంది యోధులు పోరాటాలు చేశారు. అందులో కొందరు ఉద్యమాన్ని తమ భుజాలపై మోస్తూ బ్రిటిష్ వారికి చెమటలు పట్టించేలా చేశారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా భారత మాత స్వతంత్రియం కోసం కృషి చేసిన వీరులే.

ఇంకా చదవండి ...
    GT Hemanth Kumar, News18, Tirupati

    భారతమాత బానిస సంకెళ్లు తెంచేందుకు ఎంతోమంది యోధులు పోరాటాలు చేశారు. అందులో కొందరు ఉద్యమాన్ని తమ భుజాలపై మోస్తూ బ్రిటిష్ వారికి చెమటలు పట్టించేలా చేశారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా భారత మాత స్వతంత్రియం కోసం కృషి చేసిన వీరులే. నేతాజీ సుభాష్ చంద్రబోస్., భగత్ సింగ్ వంటి నాయకులూ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. అలాంటి వారిలో మన్యం దొర అల్లూరి సీతారామరాజు ఒక్కరు. బ్రిటిష్ సామ్రాజ్యంపై తనదైన శైలిలో పోరాటం చేసి మాతృభూమి కోసం ప్రాణాలర్పించిన తెలుగు జాతి ఆణిముత్యం. చుట్టూ బ్రిటిష్ సైన్యం చుట్టుముట్టి తుపాకులు ఎక్కుపెట్టినా.., ప్రాణాలు పోతాయనే భయమన్నదే లేకుండా రొమ్మువిరిచుకొని పోరాడిన యోధుడు అల్లూరి. చనిపోయే చివరి నిమిషంలో కూడా వందే మాతరం అంటూ ప్రాణాలు విడిచి భారత మాతకు నెత్తుటి తిలకం దిద్దిన మహా వీరుడు. అలాంటి అల్లూరి సీతారామరాజు (Alluri Seetharama Raju) 98వ వర్ధంతిని పురస్కరించుకొని రూబిక్స్ క్యూబ్ తో అద్భుతం సృష్టించాడు ఓ చిన్నారి.

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తిరుపతి (Tirupati) కి చెందిన సంగరాజు మంజునాథ్ రూబిక్ క్యూబులతో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. మేకే మై బేబీ జీనియస్ స్కూల్ ఎనిమిదోవ తరగతి చదువుతున్న మంజునాధ్.. ఇప్పటికే రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖుల చిత్రాలతో పాటు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల చిత్రాలను రూబిక్ క్యూబ్ లతో చిత్రించి అందరిని ఆకట్టుకుంటున్నాడు.

    ఇది చదవండి: ఏపీలో రియల్ ఢమాల్.. సర్కార్ నిర్ణయంతో చిక్కులు.., మొదటికే మోసం వస్తుందా..?


    తాజాగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 98వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రాన్ని రూబిక్ క్యూబ్ లతో చిత్రించి తన అభిమానంను చాటుకున్నాడు. దాదాపు 6 వందల రూబిక్ క్యూబ్ లతో పది గంటల సమయం పాటు శ్రమించి అల్లూరి సీతారామరాజుపై తనకున్న అభిమానాన్ని, దేశ భక్తిని చాటుకున్నాడు.

    ఇది చదవండి: ఏపీకి తుఫాన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక


    రూబిక్ క్యూబ్స్ తో వేసిన చిత్రానికి తిరుపతి డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి, సిఐటియూ ప్రధాన కార్యదర్శి కందారుపు మురళి డివైఎఫ్ఐ నాయకులు జయచంద్ర సాయి లక్ష్మిలు పాల్గొని చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సంగరాజు మంజునాథ్ మాట్లాడుతూ ఏడాది కాలంగా మేక్ మై బేబీ జీనియర్స్ స్కూల్ రూబిక్ క్యూబ్ తో చిత్రాలను చిత్రించడం నేర్చుకుంటున్నట్లు చెప్పాడు. అల్లూరి సీతారామరాజు పై అభిమానంతో ఇవాళ ఆయన చిత్రంను ఎంతో శ్రమించి రూపొందించడం జరిగిందన్నాడు.. ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖుల చిత్రాలను రూబిక్ క్యూబ్ ద్వారా వేసి అందరి మన్ననలను పొందినట్లు సంగరాజు మంజునాథ్ అంటున్నాడు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Tirupati

    తదుపరి వార్తలు