GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18
ప్రేమకు కులమత వ్యత్యాసాలు ఉండవు. ఆకర్షణ.., ఒక్కరిపై మరొకరికి ప్రేమ., ఆప్యాయతలు చిగురిస్తే చాలు. పరిచయం స్నేహంగా మారి.. ఒకరి కోసం ఒకరు అనేలా దగ్గరవువుతుంటారు ప్రేమికులు. తమ మధ్య చిగురించిన ప్రేమ.. పెళ్లి పీఠలు ఎక్కితేచాలు తమ జీవితం సాఫీగా సాగిపోతుందని భావిస్తారు. మన దేశంలో ప్రేమ పెళ్లిళ్లు అంటే ముందు ఇద్దరి కులం చూస్తారు. ఆ తర్వాత ఆస్తిపాస్తులు, ఉద్యోగులు, ఆర్ధిక స్థితిని తెలుసుకుంటారు. కొందరు పెద్దలు కులమతాలు చూడకుండా పెళ్లిళ్లు చేస్తుండగా మరికొందరు మాత్రం కులాలు, మతాలు వేరైతే పెళ్లికి అస్సలు అంగీకరించారు. ప్రస్తుతం ప్రేమ పెళ్లిళ్లు ఖండాంతరాలు దాటుతున్నాయి. దేశంకాని దేశానికి చెందిన అమ్మాయిలు ఇండియాకు కోడళ్లుగా వస్తున్నారు. అలాగే తెలుగమ్మాయిలు విదేశాలకు కోడళ్లుగా వెళ్తున్నారు. తాజాగా ఆంధ్ర అబ్బాయి.. అమెరికా అమ్మాయి మధ్య ప్రేమ చిగురించింది. ఐదేళ్లుగా వేర్వేరు కంపెనీలో వారిద్దరూ ఉద్యోగులుగా కొనసాగిస్తున్న... పరిచయ కార్యక్రమం వారి మనసులు కలిసేలా చేసింది. ఇద్దరు మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఆ ప్రేమ పెళ్లిపీటలెక్కింది.
విరాల్లోకి వెళితే.., ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం మరికుంటవారిపల్లెకు చెందిన చీమలమర్రి నారాయణకు ఇద్దరు కుమారులు. వంటపని చేస్తూ జీవనం సాగించే వారు. చిన్ననాటి నుంచే ఇద్దరు కుమారులు చురుగ్గా చదివే వారు. ఇద్దరు మెరిట్ స్టూడెంట్స్ కావడంతో మంచి ఉద్యోగాలు లభించాయి. పెద్ద కుమారుడు భువన రంగయ్య(32) సెంట్రల్ అమెరికా మెక్సికోలో సోఫాస్ సొల్యూషన్స్ సంస్థలో ఉద్యోగం సంపాదించాడు. ఐదేళ్లుగా అసోసియేటివ్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. సౌత్ అమెరికాకి చెందిన అమ్మాయి ఆనమరియా(29)తో పరిచయం ఏర్పడింది. మరియా... ఎంప్లే అమోస్ కంపెనీ కమర్షిల్ డైరెక్టర్ గా పనిచేస్తోంది.
పనామాలో జరిగిన స్నేహితుల పరిచయ కార్యక్రమంలో ఇద్దరి చూపులు కలిశాయి. అప్పటి నుంచి ఇద్దరు ఉద్యోగ రీత్యా వివిధ ప్రాంతాలకు కలసి ప్రయాణించేవారు. మూడేళ్ళుగా వీరి ప్రేమ వ్యవహారం కొనసాగింది. పెళ్లి చేసుకోవాలని ఇద్దరు నిశ్చయించుకున్నారు. పెళ్ళికి పెద్దలు అంగీకారం తెలపడంతో వారి ప్రేమ సఫలమైంది. అయితే హిందూ సంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకోవాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. దీంతో అనమారియా తన బంధువులతో సహా ఇక్కడికి వచ్చి.. తెలుగింటి పెళ్లికూతురిలా తయారైంది. రంగయ్యతో తాళికట్టించుకొని అతడికి అర్ధాంగి అయింది.
ఇది చదవండి: తిరుమల భక్తులకు శుభవార్త.. శ్రీవారి అన్నప్రసాదంలో మార్పులు.. వివరాలివే..!
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chittoor, Love marriage, Marriage, USA