హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Red Sandal Smuggling: శేషాచలంలో రియల్ పుష్ప మూవీ సీన్... స్మగ్లర్లు ఎలా చిక్కారంటే..!

Red Sandal Smuggling: శేషాచలంలో రియల్ పుష్ప మూవీ సీన్... స్మగ్లర్లు ఎలా చిక్కారంటే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Red Sandal Smuggling: ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఎర్రచందనం శేషాచలం అటవీ ప్రాంతంలో (Seshachalam Forest) మాత్రమే లభ్యమవుతుంది. కోట్లు కురిపించే వృక్ష సంపదను దోచుకునేందుకు స్మగ్లర్లు కొత్త కొత్త స్కెచ్ లు వేస్తుంటారు.

GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18

ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఎర్రచందనం (Red Sandal) శేషాచలం అటవీ ప్రాంతంలో (Seshachalam Forest) మాత్రమే లభ్యమవుతుంది. కోట్లు కురిపించే వృక్ష సంపదను దోచుకునేందుకు స్మగ్లర్లు కొత్త కొత్త స్కెచ్ లు వేస్తుంటారు. పోలీసులు కళ్లుగప్పి ఎర్ర బంగారాన్ని బోర్డర్ దాటిస్తుంటారు. ఎర్రచందనం అక్రమ రవాణా అంటే ముందుగా మనకు గుర్తుకు వచ్చే తమిళ తంబీలే. వేలూరు జిల్లా నుండి అధిక‌ మొత్తంలో కూలీలు ఎర్రచందనం చెట్లు నరికి వేత కోసం వందల సంఖ్యలో చిత్తూరు జిల్లాకు (Chittoor District) తరలివస్తుంటారు.. శేషాచలం‌ అటవీ ప్రాంతంలో మాత్రమే లభ్యంమయ్యే ఎర్రచందనం చెట్లను అటవీ శాఖ, పోలీసుల (AP Police) కన్ను కప్పిమరీ తరలిస్తుంటారు. తమకు అడ్డు వచ్చిన వారిని తొలగించేందుకు ఏం చేసేందుకైనా సిద్దపడుతారు.. పోలీసులైనా,అటవీ శాఖ అధికారులైనా లెక్క చేయకుండా నేరుగా వారిపై దాడికి దిగ్గుతుంటారు.

అయితే ఎర్రచందనం అక్రమ రవాణా అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ఉన్నతాధికారులు ఎన్ని ఎత్తులు వేసినా వాటిని చిత్తు చేస్తూ ఎర్రచందనంను సునాయాసంగా బార్డర్ దాటించేస్తారు.. రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలేక పోతున్నారు. జిల్లా నలుమూలల ఏర్పాటు చేసిన పోలీసుల తనిఖీ కేంద్రాల్లో ప్రతి రోజు ఏదోక‌ మూలన ఎర్రచందనం పట్టుబడుతూనే ఉంది.

ఇది చదవండి: ఫుల్ బాటిల్ ఇస్తే మీ ఫ్యూచర్ మీ చేతిలో పెట్టేస్తాడు.. తంబీలతో ఆడుకుంటున్న తెలుగు బాబా...


తాజాగా పీలేరు సమీపంలోని పొంతల చెరువు క్రాస్ వద్ద పోలీసులు తనిఖీలో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. సుమారు రూ.1.5 కోట్ల విలువైన 3.5 టన్నుల బరువున్న 15 ఎర్రచందనం దుంగలు, 4 వాహనాలు పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఇద్దరు తమిళ స్మగ్లర్స్ తో పాటుగా 11 మందిని కడప, తిరుపతికి చేందిన స్మగ్లర్స్ లపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.


ఇది చదవండి: బయటపడ్డ డాక్టర్ గారి ఎఫైర్... రోడ్డుమీదే రచ్చరచ్చ.. వీడియో వైరల్...


పీలేరు పోలీసులకు వచ్చిన పక్కా సమాచారంతో పొంతల చెరువు వద్ద పోలీసులు ఉన్నతాధికారులు తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో తెల్లవారుజామున సుమారు 3.00 గంటల సమయంలో అనుమానస్పదంగా వస్తున్న రెండు ఉన్న 2 కార్లు చూసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే వీరు ఇచ్చిన సమాచారం మేరకు వీర వెనుక భాగంలో వస్తున్న ఓ‌ కంటైనర్ ను, మరో రెండు కార్లను తనిఖీ చేశారు. అయితే కంటైనర్ ను తనిఖీ చేయగా 115 ఎర్రచందనం దుంగలను గుర్తించారు పోలీసులు.

ఇది చదవండి: బయటికెళ్లిన కుమార్తె రాత్రైనా ఇంటికి రాలేదు... తర్వాతి రోజు తల్లిదండ్రులకు షాకింగ్ నిజం..


కంటైనర్ తో పాటుగా ఎస్కార్ట్ గా వస్తున్న కడప,తిరుపతి,తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు మొత్తం 11 మందిని అరెస్ట్ చేసారు..వీరు ఇచ్చిన సమాచారం మేరకు తమిళనాడు రాష్ట్రం, వేలూరు దగ్గర కంటైనర్ కోసం వేచి ఉన్న మరో ఇద్దరు తమిళనాడు స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద స్కార్పియో కారును సీజ్ చేశారు. అయితే మొత్తం వీటి విలువ సుమారు 2 కోట్లు వరకు ఉంటుందని జిల్లా ఎస్పి సెంధిల్ కుమార్ తెలిపారు.

First published:

Tags: Andhra Pradesh, Chittoor, Crime news, Forest, Red sandal, Smuggling

ఉత్తమ కథలు