హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

రేప్ చేసి చంపేశాడు : 8ఏళ్ల తేజశ్‌పై 16ఏళ్ల నందకుమార్ అకృత్యం -Chittoor police ఏం చెప్పారంటే..

రేప్ చేసి చంపేశాడు : 8ఏళ్ల తేజశ్‌పై 16ఏళ్ల నందకుమార్ అకృత్యం -Chittoor police ఏం చెప్పారంటే..

మృతుడు తేజశ్ ఫైల్ ఫొటో

మృతుడు తేజశ్ ఫైల్ ఫొటో

చిత్తూరు జిల్లాలో సంచలనం రేపిన 8 ఏళ్ల బాలుడి హత్యోదంతానికి సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడు తేజశ్ రెడ్డి(8)పై లైంగిక దాడి జరిగిందని పోలీసులు నిర్ధారించారు. అనూహ్యంగా ఈ కేసులో నిందితుడు కూడా 16 ఏళ్ల బాలుడే కావడం గమనార్హం...

ఇంకా చదవండి ...

చిత్తూరు జిల్లాలో సంచలనం రేపిన 8 ఏళ్ల బాలుడి హత్యోదంతానికి సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడు తేజశ్ రెడ్డి(8)పై లైంగిక దాడి జరిగిందని పోలీసులు నిర్ధారించారు. అనూహ్యంగా ఈ కేసులో నిందితుడు కూడా 16 ఏళ్ల బాలుడే కావడం గమనార్హం. తేజష్ హత్య కేసులో నిందితుడైన నందకుమార్ రెడ్డి(16)ని పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా పోలీసులు సోమవారం మీడియాకు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి..

చిత్తూరు జిల్లా కేవీ పల్లి మండలం ఎగువ మేకలవారి పల్లిలో ఈ నెల 12న తేజశ్ రెడ్డి అనే 8ఏళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. మేనమామ వేణుగోపాల్ రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. మరుసటి రోజే ఊరికి కిలోమీటర్ దూరంలో ఉన్న బొప్పాయి తోటలో తేజేశ్ మృతదేహం కనిపించింది. దసరా సెలవుల కోసం అమ్మమ్మ ఇంటికి వచ్చిన బాలుడు దారుణంగా హత్యకు గురికావడంపై అనేక అనుమానాలు వెల్లువెత్తాయి. ఆస్తి గొడవల వల్లే ఈ హత్య జరిగి ఉండొచ్చని, దగ్గరి బంధవులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని తొలుత పోలీసులు అనుమానించారు. కానీ ఆ దిశగా ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కేసును మరింత లోతుగా అధ్యయనం చేసిన పోలీసులు అసలు నిజాన్ని రాబట్టగలిగారు..

అదిగో..పట్టాభి.. విదేశాలకు జంప్ -టీడీపీ నేత తాజా ఫొటోలు వైరల్ -పిత్తపరిగల కేసుకు భయపడి.


మృతదేహం లభించిన బొప్పాయి తోటలో ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించిన పోలీసులు.. లైంగికదాడి కోణంలో దర్యాప్తు చేసి చివరికి నిందితుడిని పట్టుకోగలిగారు. ఎగువ మేకలవారి పల్లికే చెందిన నంద కుమార్‌ రెడ్డి(16) అనే మరో బాలుడే రితేశ్ హత్యకు కారకుడని పోలీసులు నిర్ధారించారు. ఇంటి వద్ద ఆడుకుంటోన్న రితేశ్ కు మాయమాటలు చెప్పి బొప్పాయి తోటకు తీసుకెళ్లిన నందకుమార్.. అక్కడే అత్యాచారానికి పాల్పడ్డాడని, ఈ విషయాన్ని ఎవరికైనా చెబుతాడనే భయంతోనే బాలుణ్ని హత్యచేశాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిందితుడు నందకుమార్ రెడ్డి కూడా నేరాన్ని అంగీకరించాడని తెలిపారు. నిందితుడు నందకుమార్ రెడ్డికి హోమో సెక్సువల్ కలాపాలు అలవాటుగా ఉన్నట్లు గుర్తించామని పోలీసులు చెప్పారు.

ఉద్యోగాలు వచ్చేలా చదువులు -ఏపీ కాలేజీలు, వర్సిటీల్లో విప్లవాత్మక మార్పులు -ఇదీ జగన్ ప్లాన్


రితేశ్ హత్యోదంతంతో వారి కుటుంబాలతోపాటు గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. బాలుడి తల్లిదండ్రులు నాగిరెడ్డి, జ్యోతి ఉపాధి కోసం కువైట్ లో పనిచేస్తుంటారు. దీంతో బాలుడు పీలేరులో ఉన్న పెద్దమ్మ ఇంట్లో ఉంటూ చదువుకునేవాడు. ఈ ఏడాది మూడో తరగతి చదువుతున్న రితేశ్.. దసరా సెలవులు కావడంతో అమ్మమ్మ ఊరైన మేకలవారిపల్లికి వచ్చి చివరికిలా హత్యకు గురయ్యాడు.

First published:

Tags: Chitoor, Rape and murder, School boy

ఉత్తమ కథలు