Shocking: నడిరోడ్డుపై నరమాంస భక్షకులు... పుర్రెను పీక్కుతింటూ హల్ చల్.. వీడియో వైరల్

తమిళనాడులో నరమాంస భక్షకుల కలకలం

నరమాంస భక్షకులు.. హర్రర్ సినిమాల్లో, జానపథ కథల్లో ఇలాంటి వారి ప్రస్తావన ఉంటుంది. కానీ ఓ చోట రియల్ గా..

  • Share this:
    నరమాంస భక్షకులు.. హర్రర్ సినిమాల్లో, జానపథ కథల్లో ఇలాంటి వారి ప్రస్తావన ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని దేశాల్లో అయిన వారిని చంపి వారి మాంసాన్ని తినడం లాంటి ఒళ్లు గగుడ్పొడిచే క్రైమ్ స్టోరీలు వింటుంటాంది. ఇక వారణాసి లాంటి ఆధ్యాత్మిక ప్రాంతాల్లో నర మాంసాన్ని తినే సాథువులుంటారనే ప్రచారం కూడా ఉంది. అలాంటివారిపై గతంలో చాలా డాక్యుమెంటరీలు కూడా వచ్చాయి. కానీ వీటికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ ఓ గుడిలో నరమాంస భక్షకులు కలకలం రేపారు. మనిషి తలకాయను కత్తికి గుచ్చి నృత్యాలు చేస్తూ జనాలను భయాందోళనలకు గురిచేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

    వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు రాష్ట్రంలోని తెన్‌కాళి జిల్లా కల్లూరణి గ్రామంలో ఓ గుడిలో ఉత్సవాలు జరుగుతున్నాయి. జాతరలో భాగంగా నృత్యాలు చేస్తున్నవారి చేతిలో ఉన్న మనిషి తలను చూసిన స్థానికులు హడలిపోయారు. మనిషి తలను కత్తికి గుత్తి తింటూ నృత్యాలు చేయడం సంచలనంగా మారింది. ఉత్సవాల నిర్వాహకులే నరమాంస భక్షకులను పిలిపించి నృత్యాలు చేయించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గ్రామ పంచాయతీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీడియో ఆధారంగా పోలీసులు 10 మందిని అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేశారు.

    ఇది చదవండి: పెళ్లికి ముందే ప్రేమాయణం... ప్రియుడ్ని మర్చిపోలేని యువతి ఏం చేసిందంటే..!

    ఐతే వీరిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు. వారి వివరాలేంటనే విషయాలు మాత్రం బయటకు రావడం లేదు. ఆ తలకాయను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు.. వారు నిజంగానే నరమాంసాన్ని భక్షిస్తున్నారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అలయంలో నరసమాంసాన్ని తిన్నారా..? అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఐతే ఉత్సవాలు జరిగినంత సేపు మాంత్రికులంతా మత్తులో ఉన్నారని అంటున్నారు.

    ఇది చదవండి: కొత్త ప్రియుడి మోజులో మహిళ.. పాతప్రియుడ్ని ఇంటికి పిలిపించి దారుణం..


    మాంత్రికులు తిన్నారని చెబుతున్న మృతదేహాన్ని ఎక్కడి నుంచి తెచ్చారు.. చుట్టుపక్కల గ్రామాల్లోని శ్మశానాల నుంచి ఏమైనా తీసుకొచ్చారా అనే కోణంలో విచారిస్తున్నారు. ఐతే రెండేళ్ల క్రితం ఇదే గ్రామంలో ఉత్సవాలు జరిగినప్పుడు కూడా నరమాంస భక్షకులు వచ్చినట్లు స్థానికులు చెప్తున్నారు. అప్పుడు కూడా ఇలాగే జరిగిదంటున్నారు. జాతర సమయంలో ఇలాంటి వారిని తీసుకొచ్చి నృత్యాలు చేయించిన వారిపై స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు వికృతంగా నృత్యాలు చేస్తున్నంత సేపు కొందరు భయంతో వణికిపోయారు.
    Published by:Purna Chandra
    First published: