హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Amit Shah: టీడీపీతో పొత్తుపై అమిత్ షా కీలక ఆదేశాలు.. జనసేన విషయంలో ఏమన్నారంటే..!

Amit Shah: టీడీపీతో పొత్తుపై అమిత్ షా కీలక ఆదేశాలు.. జనసేన విషయంలో ఏమన్నారంటే..!

అమిత్​ షా

అమిత్​ షా

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో బలోపేతమయ్యే దశగా భారతీయ జనతాపార్టీ (Bharathiya Janatha Party) రంగం సిద్ధం చేస్తోంది. తిరుపతి (Tirupathi) పర్యటనలో ఉన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amith Shah).. ఏపీ బీజేపీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఇంకా చదవండి ...

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో బలోపేతమయ్యే దశగా భారతీయ జనతాపార్టీ (Bharathiya Janatha Party) రంగం సిద్ధం చేస్తోంది. తిరుపతి (Tirupathi) పర్యటనలో ఉన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amith Shah).. ఏపీ బీజేపీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన సమావేశంలో పలు కీలక అంశాలపై షా దిశానిర్దేశం చేశారు. సమావేశానికి ఏపీ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తో పాటు ఎంపీలు సీఎం రమేష్, సుజనా చౌదరి, ఇతర ముఖ్యనేతలు హాజరయ్యారు. రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్లాలని షా.. ఏపీ నేతలకు సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అమిత్ షా సమావేశం సర్వత్రా చర్చనీయాంశమైంది. తిరుపతి, బద్వేలులో ఓటమి తర్వాత షా ఏ చెప్పారన్నది ఆసక్తికరంగా మారింది.

ఏపీలో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక వాతావరణం ఉండటంతో 2024లో అధికారం సాధించే దిశగా అడుగులు వేయాలని అమిత్ షా సూచించినట్లు రాష్ట్ర బీజేపీ సోము వీర్రాజు తెలిపారు. ఏపీలో ముఖ్యమైన నేతలను బీజేపీలో చేర్చుకుని 2024 లో ఏపీలో అధికారం దిశగా కార్యచరణ రూపొందించుకుంటామని వీర్రాజు తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు బీజేపీ కృషి చేస్తుందని.., ఏపీలో గ్రామీణాభివృద్ధికి సహకారమందిస్తామని అమిత్ షా చెప్పినట్లు వెల్లడించారు. వైసీపీపై పోరాడుతూనే టీడీపీతోనూ సమాన దూరం పాటించాలని షా సూచించినట్లు తెలుస్తోంది. జనసేనతో కలిసి అధికారంలోకి వచ్చే వ్యూహంతో ముందుకెళ్లాలన్నారు.

ఇది చదవండి: ఏపీ రాజధానిపై త్వరగా తేల్చేస్తాం.. హైకోర్టు సీజే సంచలన వ్యాఖ్యలు.. ప్రభుత్వ వాదనకు నో..


ఏపీలో ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాడుతుందని ఆ పార్టీ మహిళా నేత దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. బీజేపీ ప్రజావాణి కావాలని అమిత్ షా దిశా నిర్దేశం చేశారని.., రాష్ట్రంలో పార్టీ బలోపేతం, రాష్ట్రంలో తాజా పరిస్థితులపై అమిత్ షాతో సుధీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. అలాగే ఏపీ విభజన బిల్లు అంశాలపై అమిత్ షాతో చర్చించామని.., విభజన బిల్లులోని 80 శాతానికి పైగా అంశాలు ఇప్పటికే కేంద్రం నెరవేర్చిందని గుర్తుచేశారు. మిగిలిన అంశాలపై కూడా చర్చించామన్నారు. ఏపీలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగడంలేదని.. దీనిపై కూడా పోరాటం చేస్తామని పురందేశ్వరి తెలిపారు.


ఇది చదవండి:ఏపీ వైపు దూసుకొస్తున్న తుఫాన్.. ఈ జిల్లాలకు అలర్ట్... తీరాన్ని తాకేది ఇక్కడే..!


ఇదిలా ఉంటే ఎంపీలు సీఎం రమేష్, సుజనా చౌదరితో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. బద్వేలు ఉపఎన్నిక సమయంలో టీడీపీ, బీజేపీ పొత్తుపై సీఎం రమేష్ కామెంట్స్ చేసిన నేపథ్యంలో అమిత్ షా విడిగా పిలిచి మాట్లాడటం చర్చనీయాంశమైంది. షా వీరితో ఏం చర్చించారు..? పొత్తులపై మాట్లాడవద్దని క్లాస్ తీసుకున్నారా..? లేక సందర్భం కోసం వేచి చూడాలని సూచించారా..? అనేది ఆసక్తికరంగా మారింది.

First published:

Tags: Amit Shah, Andhra Pradesh, Ap bjp, Bjp-janasena, Somu veerraju

ఉత్తమ కథలు