హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tirupati Airport: ప్రైవేటీకరణ దిశగా తిరుపతి ఎయిర్ పోర్ట్.., కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

Tirupati Airport: ప్రైవేటీకరణ దిశగా తిరుపతి ఎయిర్ పోర్ట్.., కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

తిరుపతి ఎయిర్ పోర్ట్ (ఫైల్)

తిరుపతి ఎయిర్ పోర్ట్ (ఫైల్)

Privatization: ఆర్థిక పరమైన ఒడి దుడుకులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పెట్టుబడుల దిశగా అడుగులు వేస్తోంది. ఆర్థికంగా నష్టాలు వచ్చే ప్రతి సంస్థను ప్రైవేటీకరణ దిశగా కేంద్రం పావులు కదుపుతోంది.

  GT Hemanth Kumar, Tirupati, News18

  ఆధ్యాత్మిక నగరి తిరుపతి (Tirupati) అంతర్జాతీయ విమానాశ్రయంను (International Airport) కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రైవేటీకరణకు (Privatization) రంగం సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా 13 విమానాశ్రయాలను ప్రైవేటీకరణకు కేంద్రం ఇచ్చిన అనుమతిలో తిరుపతి రేణిగుంట విమానాశ్రయం ఒకటి. నిత్యం శ్రీవారి దర్శనార్థం లక్షలాది మంది భక్తులు శ్రీవారి దర్శనార్థం మన రాష్ట్రము నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి తిరుపతికి చేరుకుంటారు. ఇలా వచ్చే భక్తులు వివిధ మార్గాల గుండా తిరుపతికి చేరుకుంటారు. ముఖ్యంగా ప్రముఖులు, రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు, ఐటీ ఉద్యోగులు ఎక్కువగా విమానాల్లో తిరుపతికి చేరుకొని అక్కడ నుంచి రోడ్డు మార్గం గుండా తిరుమలకు చేరుకుంటారు. ఆంతర్జాతీయ టెర్మినల్ రావడంతో ఎంతో సుందరంగా ఎయిర్ పోర్టును తీర్చిదిద్దారు అధికారులు. పచ్చని హరిత తోరణాలతో పాటుగా గరుడ పక్షి ఆకారంలో నిర్మించబడ్డ ఎయిర్ పోర్ట్ ముందు భాగం అందరికి స్వాగతం పలుకుతుంది.

  ఆర్థిక పరమైన ఒడి దుడుకులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పెట్టుబడుల దిశగా అడుగులు వేస్తోంది. ఆర్థికంగా నష్టాలు వచ్చే ప్రతి సంస్థను ప్రైవేటీకరణ దిశగా కేంద్రం పావులు కదుపుతోంది. ఇండియన్ రైల్వేలో వాటాలు సైతం వదిలేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పుడు విమానాశ్రయాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో తిరుపతి విమానాశ్రయాన్ని కూడా ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వెంకన్న దర్శనంకోసం వచ్చే భక్తులు ప్రస్తుతం అధిక మొత్తంలో విమాన ప్రయాణాన్నే ఎంచుకుంటున్నారు. వాయుమార్గం ద్వారా హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు నుంచి తక్కువ సమయంలోనే తిరుపతికి చేరుకోవడమే ఇందుకు ముఖ్య కారణం. అందుకే విమానాల రాకపోకలు సైతం పెరుగుతున్నాయి. ఆంతర్జాతీయ విమానాశ్రయం అయినప్పటికీ ఇంతవరకు అంతర్జాతీయ విమానాల రాకపోకలు సాగలేదు. కడప, చిత్తూరు జిల్లాల నుంచి జీవనాధారం కోసం అధిక శాతం ప్రజలు గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు.

  ఇది చదవండి: ఏపీలో కరెంటు బిల్లులు ఎందుకు పెరిగాయి..? ట్రూ అప్ ఛార్జీలు అంటే ఏమిటి..?


  దీంతో ఇక్కడ నుంచి త్వరలోనే ఇంటర్నేషనల్ విమానాలను సైతం నడపాలని కేంద్రం భావిస్తున్న తరుణంలో ప్రైవేటీకరణ నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే దేశంలో లాభాల్లో ఉన్న మేజర్ ఎయిర్ పోర్టులను నష్టాల్లో ఉన్న మైనార ఎయిర్ పోర్టులకు అనుసంధానం చేస్తూ తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి ముడేసింది కేంద్రం. తమిళనాడులోని తిరుచ్చి ఎయిర్ పోర్టును తిరుపతి ఎయిర్ పోర్టుతో అనుసంధానం చేయనుంది.

  ఇది చదవండి: చంద్రబాబుకు కొత్త తలనొప్పులు... అగ్గిరాజేసిన జేసీ కామెంట్స్.. టీడీపీలో ఏం జరుగుతోంది..?


  రెండు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ (Hyderabad), వైజాగ్ (Visakhapatnam), విజయవాడ (Vijayawada) తర్వాత అత్యధిక రాకపోకలు సాగె విమానాశ్రయం తిరుపతి. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో కాస్త ప్రయాణికుల హడావిడి తగ్గినా గత కొన్ని రోజులుగా పెరుగుతున్నాయి. ఇక ప్రయాణికుల సంఖ్య తగ్గటం సర్వీసులు అంతంత మాత్రమే రాకపోకలు సాగిస్తుండటంతో తిరుపతి ఎయిర్ పోర్టును ప్రైవేట్ పరం చేయాలంటుంది కేంద్రం. తిరుపతి ఎయిర్ పోర్టు ఇప్పటికే రూ.35 కోట్ల మేర నష్టాల్లో నడుస్తూ ఉండటంతో నష్టాన్ని పూరించేందుకు కేంద్రం రూ.22కోట్ల ఆదాయంతో దూసుకుపోతున్న తిరుచ్చి ఎయిర్ పోర్టుతో అనుసంధానికి మార్గం సుముగం చేస్తోంది. 2019-20 ఆర్థిక సంవత్సరంకు గాను తిరుపతి విమానాశ్రయం ద్వారా 8,40,963 మంది ప్రయాణించినట్లు ఎయిర్ పోర్ట్ అథారిటీ గణాంకాలు చెపుతున్నాయి.

  ఇది చదవండి: సీబీఐ కోర్టులో జగన్ కు ఊరట.. రఘురామ పిటిషన్ కొట్టివేత


  2020 మార్చిలో 44వేల 575 మంది ప్రయాణించగా.. 2021 మార్చిలో ప్రయాణికుల సంఖ్య 65వేల 110కి పెరిగింది. 2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి వరకు 8లక్షల 34వేల 984 మంది ప్రయాణికులు తిరుపతికి ప్రయాణించారు. కరోనా ప్రభావంతో విమానా ప్రయాణాలు పూర్తిగ. నిలిచిపోయాయి. 2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి వరకు 3లక్షల 52వేల 375 మంది రాకపోకలు సాగించారు.ఎయిర్ పోర్టుల ప్రైవేటేజేషన్ ప్రక్రియలో తొలిసారి మేజర్ ఎయిర్ పోర్టులతో చిన్న ఎయిర్ పోర్టులను కలుపుతున్నారు. దేశంలోని 13 ఎయిర్ పోర్టులను ప్రైవేటీకరించేందుకు ఎయిర్ పోర్టు అథార్టీ ఆఫ్ ఇండియా ఓకే చెప్పింది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Airport, Andhra Pradesh, Tirupati

  ఉత్తమ కథలు