Home /News /andhra-pradesh /

TIRUPATI CAR THEFT GANG ARRESTED IN CHITTOOR DISTRICT ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT

Tirupati News: సినిమా డెరెక్టర్లు కూడా వీళ్ల తెలివి ముందు దిగదుడుపే.! ఏం స్కెచ్ వేశార్రా నాయనా..?

పోలీసుల అదుపులో దొంగలముఠా

పోలీసుల అదుపులో దొంగలముఠా

Chittoor: ఓ గ్యాంగ్ మాత్రం జనానికి ఫ్యూజులు ఎగిరిపోయే స్కెచ్ తో ఎంచక్కా దొంగనాలు, ఆపై మోసాలకు పాల్పడుతోంది. సినిమా డైరెక్టర్లకు కూడా రాని ఐడియా ఈ దొంగల ముఠాకు వచ్చింది.

    GT Hemanth Kumar, News18, Tirupati

    జల్సాలకు అలవాటు పడి... చెడు వ్యసనాలకు బానిసైన కొందరు డబ్బుల కోసం అడ్డదారులు వెతుకుంటున్నారు. శ్రమ లేకుండా సంపాధించే దొడ్డి దారిని అలవాటు చేసుకొని నేరాలకు పాల్పడుతున్నారు. వస్తువులు, బైక్ దొంగతనాలు, చెన్ స్నాచింగ్ వంటి వాటికి పాల్పడుతూ ఈజీమనీని లాగేస్తుంటారు. వీరంతా ఓ గ్యాంగ్ గా మారి నేరాల్లో కొత్తకొత్త దారులు వెతుక్కుంటూ ఎవరికీ అనుమానం రాకుండా పనికానిచ్చేస్తారు. ఓ గ్యాంగ్ మాత్రం జనానికి ఫ్యూజులు ఎగిరిపోయే స్కెచ్ తో ఎంచక్కా దొంగనాలు, ఆపై మోసాలకు పాల్పడుతోంది. సినిమా డైరెక్టర్లకు కూడా రాని ఐడియా ఈ దొంగల ముఠాకు వచ్చింది. దొంగతనాల్లో వీరి రూటే సెపరేటు... కుదువ పెడుతారు, మల్లి వాటినే దొంగతనం చేసి మరో చోట కుదువ పెట్టేస్తారు. ఇదెలా చేసే వారంటే మనం షాక్ అవ్వాల్సిందే.

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అన్నమయ్య జిల్లా మదనపల్లె పోలీసులు తెలిపిన వివరాల మేరకు తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా వీరలింగంపల్లెకు చెందిన మొహమ్మద్ రియాజ్, షేర్ లింగంపల్లికి చెందిన ప్రసాద్, ఏపీలోని రాయచోటికి చెందిన నందలూరు రాజానర్మదారెడ్డి, రాయచోటిలోని లక్కిరెడ్డి పల్లి రోడ్డుకి చెందిన సుభాహాన్ లు కలసి జల్సాలకు అలవాటు పడ్డారు. ఈజి మని కోసం ఎన్నో నేరాలు చేయాలని భావించారు. ఏ నేరం చేసిన పోలీసులకు దొరకకుండానే ఆలోచన చేసారు.

    ఇది చదవండి: ప్రియుడితో కలిసి భర్తకు దొరికిపోయింది.. గంట తర్వాత షాకింగ్ ఘటన..


    ఈ క్రమంలో కొన్ని కార్లను అద్దెకు తీసుకున్నారు. కార్లు ఎక్కడికి వెళ్లిన తెలుసుకొనే విధంగా వాటికీ ప్రత్యేక జీపీఎస్ సిస్టంను అమర్చారు. నకిలీ తాళం, రిమోట్ కంట్రోలర్ ను తయారు చేసుకున్నారు. డబ్బుల కోసం కార్లను కుదువ వ్యాపారి వద్ద కుదువ పెట్టేసారు. ఆ కారును ఎలాగైనా తీసుకోవాలనే నెపంతో పోలీసుల వేషధారణలో వెళ్లి కార్టాన్ సెర్చ్ పేరిట వాటిని తిరిగి స్వాధీనం చేసుకునే వారు. కారు బాడుగకు ఇచ్చిన అసలైన ఓనర్ కి కారును అప్పజెప్పే వారు.

    ఇది చదవండి: ప్రాణం తీసిన శోభనం.. ఫస్ట్ నైట్ భయంతో యువకుడు ఏం చేశాడంటే..


    ఇలా వీరి జీవితం మూడు పూలు ఆరు కాయలుగా సాగుతున్న తరుణంలో మదనపల్లెలోని ఎస్బిఐ కాలనీ లో కార్టాన్ సెర్చ్ పేరిట మల్లి కారును దొంగతనం చేసారు. అసలైన పోలీసుల తనిఖీల్లో వీరు కారును దొంగతనం చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. వెంటనే మదనపల్లె 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళు విచారణ చేపట్టారు. తీగ లాగితే డొంక కదిలినట్లు అన్ని విషయాలు బట్టబయలైయ్యాయి. వారి వద్దనున్న రూ 5 కోట్లు విలువ చేసే 9 కార్లను స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు. ఇలాంటి వాళ్లకు కఠినమైన శిక్షలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Chittoor, Theft

    తదుపరి వార్తలు