తిరుమలలో మరోసారి అపచారం చోటుచేసుకుంది. మొన్నటికిమొన్న తిరుమల ఆలయంపై డ్రోన్లు కలకలం రేపిన విషయం తెలిసిందే.. ఈ ఘటన ఇంకా మరచిపోక ముందే.. మరోసారి తిరుమలలో అపచారం చోటుచేసుకుంది. భద్రత వైఫ్యలం వెల్లడైంది.తాజాగా చోటు చేసుకున్న ఘటనతో తిరుమల శ్రీవారి ఆలయం వద్ద భద్రతా వైఫల్యం పై సర్వత్రా విమర్శలు వినిపించాయి. ఈసారి ఓ కారు ఏకంగా తిరుమల మాఢ వీధుల్లోకి దూసుకొచచింది.
అయితే ఇన్నోవా కారుపై CMO స్టిక్కర్ ఉండటంతో భద్రతా సిబ్బంది చూసీ చూడనట్టు వ్యవహరించారు. భద్రతా సిబ్బంది అడ్డుచెప్పకపోవడంతో కారును మాడ వీధుల్లోకి తీసుకొచ్చాడు ఆ డ్రైవర్. పార్కింగ్‌లో స్థలం లేకపోవడంతోనే తీసుకొచ్చానని..కారు డ్రైవర్ చెబుతున్నాడు. భద్రతా సిబ్బంది అక్కడ లేరని ఆయన సమాధానం చెబుతున్నారు. తిరుమలలో ఉన్న భద్రతా నిబంధల ప్రకారం మాఢవీధుల్లోకి వాహనాలు నిషేధం. టీటీడీ చైర్మన్, ఈఓ వాహనాలను కూడా మాడ వీధులకు దూరంగా నిలిపివేస్తారు.
అయితే తిరుమలకు వీవీఐపీలు వచ్చినప్పుడు బ్యాటరీ బగ్గీల్లో మాడ వీధుల్లో తిరుగుతారు. భక్తులు కూడా చెప్పులు లేకుండానే వెళ్లాలి. ఎవరు చెప్పులు వేసుకోకూడు. అలాంటి ప్రాంతంలోకి వాహనం రావడంపై భక్తులు మండిపడుతున్నారు. సీఎంఓ స్టిక్కర్ తో మాడ వీధుల్లోకి వచ్చిన కారు సీఎం కార్యాలయానికి చెందిందా లేక ఫేక్ వెహికలా అని పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటన ఎలా జరిగిందనే దానిపై విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సీఎంవో స్టిక్కర్ ఉన్న కారు తిరగటంపై భక్తులు విమర్శలు చేస్తున్నారు. తిరమల ఆలయంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని కోరుతున్నారు. ఇలా వాహనాలు మాఢవీధుల్లోకి రావడం ఏంటని శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Tirumala news, Tirumala Temple