హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tirupati Bypoll 2021: నేడు తిరుపతిలో పవన్ కళ్యాణ్ పాదయాత్ర... జనసేనలో ఫుల్ జోష్

Tirupati Bypoll 2021: నేడు తిరుపతిలో పవన్ కళ్యాణ్ పాదయాత్ర... జనసేనలో ఫుల్ జోష్

మరోవైపు పవన్ తనకు సరైన నియోజకవర్గం వెతికే పనిని అత్యంత నమ్మకస్తులకు అప్పగించినట్టు తెలుస్తోంది. అయితే వారు ఇప్పటికే పవన్  కు తిరుపతి సూచించారని ప్రచారం ఉంది. ఇటీవల తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల కోసం ఆ ప్రాంతంలో సుడిగాలి పర్యటన చేశారు పవన్ కల్యాణ్. అక్కడ జనసేనకు మంచి గ్రిప్ ఉందని, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో తన సామాజిక వర్గం బలంతో పాటు, అజన్ని వర్గాలు మెగా ఫ్యామిలీకి అండగా ఉంటాయని డిసైడ్ అయ్యారట..

మరోవైపు పవన్ తనకు సరైన నియోజకవర్గం వెతికే పనిని అత్యంత నమ్మకస్తులకు అప్పగించినట్టు తెలుస్తోంది. అయితే వారు ఇప్పటికే పవన్ కు తిరుపతి సూచించారని ప్రచారం ఉంది. ఇటీవల తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల కోసం ఆ ప్రాంతంలో సుడిగాలి పర్యటన చేశారు పవన్ కల్యాణ్. అక్కడ జనసేనకు మంచి గ్రిప్ ఉందని, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో తన సామాజిక వర్గం బలంతో పాటు, అజన్ని వర్గాలు మెగా ఫ్యామిలీకి అండగా ఉంటాయని డిసైడ్ అయ్యారట..

Tirupati Election 2021: తిరుపతి ఎన్నికల ప్రచారం మరింత హీట్ ఎక్కనుంది. ఈ రోజు కోసం జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Tirupati Bypoll 2021: తిరుపతి లోక్‌సభ (Tirupati loksabha seat) స్థానాన్ని ఎలాగైనా గెలుచుకోవాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ... పొత్తులో భాగంగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan)పై ఎక్కువగా ఆధారపడుతోంది. తెలంగాణలో బీజేపీ, జనసేన మధ్య విబేధాలు రావడంతో... పవన్ కళ్యాణ్‌ని ప్రసన్నం చేసుకునేందుకు రకరకాలుగా ప్రయత్నించిన బీజేపీ... మొత్తానికి ఆయన మెత్తబడేలా చేసింది. దాంతో... జనసేనాని ఎన్నికల ప్రచారం షురూ అయ్యింది. "ఏప్రిల్ 3న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తిరుపతిలో పర్యటిస్తారు" అని ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మొన్ననే తెలిపారు. "బీజేపీ, జనసేనల ఉమ్మడి అభ్యర్థి విజయం కోసం తిరుపతిలోని ఎమ్మార్ పల్లి సర్కిల్ నుంచి శంకరంబాడి సర్కిల్ వరకూ పవన్ కళ్యాణ్ పాదయాత్ర ఉంటుంది" అని తెలిపారు. "3న మధ్యాహ్నం 3 గంటలకు పాదయాత్ర ప్రారంభం అవుతుంది" అని నాదెండ్ల స్పష్టం చేశారు.

తిరుపతి స్థానంపై అధికార వైసీపీ, ప్రతిపక్షాలన్నీ బలంగా ఫోకస్ పెట్టాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (Ysr congress party) నుంచి డాక్టర్ గురుమూర్తి బరిలో ఉండగా... తెలుగు దేశం పార్టీ (TDP) నుంచి మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మీ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జనసేన-బీజేపీ పొత్తు ( Bjp-Janasena alliance)లో భాగంగా బీజేపీ నుంచి మాజీ ఐఏఎస్ (IAS) అధికారిణి రత్నప్రభ బరిలో ఉన్నారు. అందువల్ల రత్నప్రభకు అనుకూలంగా ఇవాళ పవన్ కళ్యాణ్ ప్రచారం సాగిస్తారు.

పవన్ కళ్యాణ్ ఏ చెబుతారు?: ప్రస్తుతం వైసీపీ... తమకు ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ, జనసేనను భావిస్తున్నట్లు తెలుస్తోంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ మరింతగా ఓటమి చూడటంతో... బీజేపీ, జనసేన ఎలాంటి ఎత్తుగడలు వేస్తున్నాయి అనే అంశాన్ని వైసీపీ నేతలు ఆసక్తిగా చూస్తున్నారు. ఐతే... ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విశాఖలో ఉక్కు పరిశ్రమలు ప్రైవేటీకరించేస్తూ... బీజేపీ... ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడిగేందుకు వస్తోందని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. మరి వాటికి నేడు పవన్ కళ్యాణ్ ఎలాంటి కౌంటర్లు ఇస్తారనేది రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

ఇది కూడా చదవండి: Horoscope 3-4-2021: నేటి రాశి ఫలాలు... నిరుద్యోగులు శుభవార్తలు వింటారు

తిరుపతి స్థానానికి జనసేన తరపున అభ్యర్థిని నిలబెట్టకపోవడంపై పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఒకింత అసంతృప్తి ఉన్నా... బీజేపీ... పవన్ కళ్యాణ్‌పైనే ఆధారపడటంతో... అభిమానులు కాస్తంత కూల్ అయ్యారు. ఆ క్రమంలో ఇవాళ్టి జనసేనాని పాదయాత్ర ఓ రేంజ్‌లో ఉంటుందని తెలుస్తోంది. ఐతే... కరోనా జాగ్రత్తలు పాటిస్తూ దీన్ని నిర్వహిస్తారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్‌కు ఘనస్వాగతం పలికేందుకు స్థానిక నాయకులు, కార్యకర్తలతో పాటు రాయలసీమ నాలుగు జిల్లాల నుంచి నేతలు, కార్యకర్తలు, మహిళలు పెద్దఎత్తున వస్తారని జనసేన వర్గాలు తెలిపాయి.

First published:

Tags: Pawan kalyan, Tirupati Loksabha by-poll

ఉత్తమ కథలు