Home /News /andhra-pradesh /

Businessman Letter: ఐపీ పెట్టిన వ్యాపారి.. అప్పులిచ్చిన వారికి లెటర్.. వైరల్ గా మారిన వాట్సాప్ మెసేజ్..

Businessman Letter: ఐపీ పెట్టిన వ్యాపారి.. అప్పులిచ్చిన వారికి లెటర్.. వైరల్ గా మారిన వాట్సాప్ మెసేజ్..

ప్రస్తుతం తన సమస్యలు తీరేందుకు రెండు మార్గాలు మిగిలాయని, ఒకటి ఆత్మహత్య చేసుకోవడం, రెండు తాను బతికినంత కాలం అప్పు తీర్చేందుకు శ్రమిస్తానంటూ మెసేజ్‌లో రాసుకొచ్చారు.

ప్రస్తుతం తన సమస్యలు తీరేందుకు రెండు మార్గాలు మిగిలాయని, ఒకటి ఆత్మహత్య చేసుకోవడం, రెండు తాను బతికినంత కాలం అప్పు తీర్చేందుకు శ్రమిస్తానంటూ మెసేజ్‌లో రాసుకొచ్చారు.

ప్రస్తుతం తన సమస్యలు తీరేందుకు రెండు మార్గాలు మిగిలాయని, ఒకటి ఆత్మహత్య చేసుకోవడం, రెండు తాను బతికినంత కాలం అప్పు తీర్చేందుకు శ్రమిస్తానంటూ మెసేజ్‌లో రాసుకొచ్చారు.

  GT Hemant Kumar, Tirupati, News18

  వ్యాపారస్తులు స్థిరపడాలి అంటే ముందుగా నమ్మకం కావాలి. మనం నమ్మిన వ్యాపారి వద్దనే ఏదైనా కొనుగోలు చేస్తుంటాం. అది చిన్న గుండు పిన్ను నుంచి.... నిత్యం వినియోగించే వస్తువుల వరకు నమ్మదగిన వ్యక్తుల దుకాణంలోనే కొనుగోలు చేస్తుంటారు. అదే 60 ఏళ్లుగా ఆ కుటుంబం పల్లెలో నివసిస్తూ.. దుకాణంతో పాటుగా వడ్డీ వ్యాపారం చేసేవారు చాలా మంది ఉన్నారు. బయట తక్కువ వడ్డీకి తెచ్చి.. ఎక్కువ వడ్డీకి డబ్బులిస్తూ మార్జిన్ తో లాభాలు ఆర్జిస్తుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని చిత్తూరు జిల్లాలో (Chittoor District) ఓ వ్యాపారి అధిక వడ్డీలు ఇస్తానని చెప్పి అందరిని నట్టేట ముంచాడు. వేలు కాదు లక్షలు ఏకంగా 80 కోట్ల మేర అప్పులు చేసి.... అందరిని షాక్ కు గురిచేసిన సంఘటన చోటు చేసుకుంది.

  వివరాల్లోకి వెళితే... చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో వస్త్రాల వ్యాపారి పాండురంగయ్య శెట్టి గత అరవై ఏళ్లుగా నివాసం ఉంటున్నాడు. పాండురంగయ్య శెట్టి వడ్డీ వ్యాపారం చేస్తూన్నాడు. వడ్డీ వ్యాపారంలో పూర్తిగా నష్టపోయి రూ.87.84 కోట్లుకు కోర్టులో ఐపీ పిటిషన్ వేశారు. 60 ఏళ్లుగా మండల కేంద్రంలో బట్టల వ్యాపారం చేస్తూ ఉండేవాడు ఆయనపై నమ్మకంతో చుట్టుపక్కల నాలుగు మండలాల్లో రైతులు నమ్మకంతో తన వ్యాపారానికి అప్పుగా కోట్ల రూపాయలను ఇచ్చేవారు. అప్పు ఇచ్చిన వారికి సకాలంలో పిలిచి వడ్డీ ఇవ్వడం చూసి మరికొందరు ఆశతో కోట్ల రూపాయలు ఇచ్చి మోసపోయారు. అయితే గత వారం రోజులుగా ఈ బట్టల వ్యాపారి తన కుటుంబ సభ్యులతో సహా అదృశ్యం కావడంతో అప్పులిచ్చిన బాధితులు పెనుమూరులోని తమ షాపు వద్ద భారీ ఎత్తున ధర్నాకు దిగారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులకు నచ్చచెప్పి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

  ఇది చదవండి: ఆన్ లైన్ క్లాసుల కోసం మొబైల్ కొనిస్తే ఇలా చేసిందేంటీ..! చేజేతులా లైఫ్ రిస్కులో పడేసుకున్నావుగా..!  అప్పులిచ్చిన రైతులకు క్షమాపణలు చెప్పిన మనవడు
  ''పరిస్థితి బాగోలేక ఉన్నదీ అమ్మినా సరిపోలేదు అందుకే ఐపీ పెట్టాం. అప్పు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పాదాభి వందనాలు చెప్తున్నా.. నా పరిస్థితి అర్థం చేసుకోండి. కోర్టులో నడుస్తున్న భూమి కేసు పరిష్కారం అయితే కానీ మా కష్టాలు తీరవు’ ఇది వ్యాపారి కోడూరు రంగయ్య శెట్టి మనువడు ప్రవీణ్‌కుమార్‌ ఐపీ బాధితులకు పెట్టిన వాట్సప్‌ మెసేజ్ సారాంశం‌. వారం రోజుల క్రితం వ్యాపారి దుకాణం సద్దేయడంతో డీఎస్పీ సుధాకరరెడ్డి, పాకాల సీఐ ఆశీర్వాదం బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు ధర్నా విరమించారు.

  ఇది చదవండి: విశాఖ బాలిక మృతిపై మంత్రి, ఎంపీ సంచలన వ్యాఖ్యలు.. లిఫ్టులో రక్తపుమరకలు ఎవరివి..?  అప్పు ఇచ్చిన ప్రతి ఒక్కరికి రంగయ్యశెట్టి మనుమడు ప్రవీణ్ వాట్సప్‌ సందేశాన్ని‌ పంపించాడు. ప్రవీణ్ తండ్రి పలు రంగాల్లో నష్టపోయినట్లు వివరించారు. అందులో ముఖ్యంగా ట్రావెల్స్, వడ్డీ, గ్రానైట్స్, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాల్లో పూర్తిగా నష్టపోయినట్లు చెప్పాడు ప్రవీణ్. అప్పు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఆరు నెలల క్రితం వరకూ నెలకు రూ.కోటి వడ్డీ కడుతూ వచ్చినట్లు పేర్కొన్నారు. ఇందుకోసం ప్లాట్లు, 70 ఎకరాల భూమి అమ్ముకున్నట్లు మెసేజ్‌లో రాశాడు. ఇక అమ్మేందుకు ఎలాంటి ఆస్థి లేకపోవడంతోనే ఐపీ పెట్టినట్లు ఆ సందేశంలో పేర్కొన్నాడు. అప్పు ఇచ్చిన వారు తన పరిస్థితి అర్థం చేసుకోవాలని.., అందరికి పాదాభి వందనాలు అని పేర్కొన్నాడు.

  ఇది చదవండి: నీ భర్తను వదిలేసి నాతో వచ్చేయ్.. అర్ధరాత్రి మహిళ ఇంటిముందు ప్రేమోన్మాది హల్ చల్.. అక్కడితో ఆగలేదు..


  ప్రవీణ్ కు ఉన్న స్థిరాస్థులలో కొంత భూమి తిరుపతిలో ఉంది. ఈ స్థలంపై కేసు నమోదు అయ్యి కోర్టులో వాదోపవాదాలు సాగుతున్నాయి . ఆ కేసు పరిష్కారం అయితే కష్టాలు తీరుతాయని ప్రవీణ్ లేఖలో పేర్కొన్నాడు. ప్రస్తుతం తన సమస్యలు తీరేందుకు రెండు మార్గాలు మిగిలాయని, ఒకటి ఆత్మహత్య చేసుకోవడం, రెండు తాను బతికినంత కాలం అప్పు తీర్చేందుకు శ్రమిస్తానంటూ మెసేజ్‌లో రాసుకొచ్చారు. ఆ తర్వాత ప్రవీణ్‌ వాట్సాప్‌ చేసిన ఫోన్‌ స్విచాఫ్‌ వచ్చింది. పోలీసులు ఆ మెసేజ్‌ ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు.

  మీ నగరం నుండి (​తిరుపతి)

  ఆంధ్రప్రదేశ్
  ​తిరుపతి
  ఆంధ్రప్రదేశ్
  ​తిరుపతి
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Chittoor, Tirupati

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు