Home /News /andhra-pradesh /

TIRUPATI BUS ACCIDENT IN NELLORE DISTRICT BUT BUS CONDUCTOR SAVES PASSENGERS LIVES NGS TPT

Accident: డ్రైవర్ లేకుండానే అకస్మాత్తుగా ముందుకు కదిలిన బస్సు.. కండక్టర్ లేకుంటే ఏం జరిగేది అంటే..?

ప్రతికాత్మక చిత్రం

ప్రతికాత్మక చిత్రం

Bus Accident: డ్రైవర్ లేకుండా ఓ బస్సు దూసుకు వస్తుండడంతో అంతా షాక్ అయ్యారు. అయితే కండక్టర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. మరి బస్సులో డ్రైవర్ ఎందుకు లేడో తెలుసా..?

  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India
    Bus Accident:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో తాజాగా జరిగిన ఓ రోడ్డు ప్రమాదం (Road Accident) అందరికీ షాక్ ఇచ్చింది. డ్రైవర్ లేకుండా ఆర్టీసీ బస్సు (RTC Bus) .. వేగంగా 150 మీటర్లకు పైగా దూరం వెళ్లింది.. ప్రమాదం తప్పదని అందరూ భయపడుతున్న వేళ.. కండక్టర్ (Conductor) కాస్త అప్రమత్తంగా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సాధారణంగా  ప్రయాణాల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న అవతలి వాళ్ళు కూడా అంతే జాగ్రత్తలు తీసుకుంటే ప్రయాణం సాఫీగా సాగుతుంది. లేదంటే అవతలి వారి నిర్లక్ష్యం మరికొందరు ప్రాణాలపైకి తెస్తుంది. ఇలాంటి ప్రమాదాలకు అతి వేగం.. డ్రంక్ అండ్ డ్రైవ్.. కాసుల కక్కుర్తి.. నిద్ర లేమి లాంటివే కారణమని నివేదికలు చెబుతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లా (Nellore District) లో జరిగిన ప్రమాదం అందర్నీ షాక్ కు గురి చేసింది.. భారీగా ప్రాణ నష్టం తప్పదని అంతా భయపడుతున్న వేళ కండెక్టర్ అప్రమత్తంగా వ్యవహరించి ప్రాణ నష్టం లేకుండా చేశాడు..

    స్థానికులు.. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా కావలి. నుంచి బుధవారం నెల్లూరుకు 24 మంది ప్రయాణికులతో ఓ బస్సు ప్రయాణం ప్రయాణం ప్రారంభించింది. సరిగ్గా కావలి సమీపంలో ఉన్న టోల్ ప్లాజాకు చేరుకున్నప్పుడు.. అటువైపు  అనూహ్య రీతిలో కారు వేగంగా బస్సు వైపు దూసుకొచ్చింది. అలా  అత్యంత వేగంగా వస్తున్న కారు నుంచి బస్సుని తప్పించే లోపే కారు బస్సును ఢీకొట్టింది.



    కారు ఢీ కొట్టిన వేగానికి  బస్సు ముందు భాగం నుజ్జు అయింది. దాదాపు గంటకు 120 కిలోమీరల్ల వేగంతో గుద్దడంతో సీట్లో ఉండాల్సిన  డ్రైవర్ ప్రసాద్ అమాంతం ఎగిరి రోడ్డుపై పడిపోయాడు. అయితే స్టీరింగ్ దగ్గర డ్రైవర్ లేకుండానే బస్సు పరుగులు తీసింది. అది చూసి బస్సులో ఉన్న ప్రయాణికులు ప్రాణభయంతో అరుపులు కేకలు వేశారు. కండక్టర్ నాగరాజు  వెంటనే అప్రమత్తమై స్త్రీరింగ్ వద్దకు చేరుకున్నాడు. బస్సు తోలడం రాకున్నా స్టీరింగ్ పట్టి గట్టిగ బ్రేకులు వేయడంతో బస్సు ఆగింది.

    ఇదీ చదవండి : బావమరిదిపై సొంత బావ దారుణం.. దాని కోసం అంత నీచాని ఒడిగట్టాలా..?

    నాగరాజు సాహసం చేయడంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ కండక్టర్ అలా చేయకపోయి ఉంటే, పెద్ద ప్రమాదమే చోటు చేసుకునేది. ఈ ఘటనలో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్ తో పాటు పది మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు సైతం స్వల్ప గాయాలే అయ్యాయి. అయితే.. కారు ముందు భాగం మాత్రం నుజ్జునుజ్జుయ్యింది. అతివేగంతో వచ్చి ఢీకొనడంతో బస్సు ముందు భాగం బాగా దెబ్బతింది. ఆ కారును విశాఖపట్టణానికి చెందిన విజయ పంత్ అనే డాక్టర్ ది గా గుర్తించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Bus accident, Crime news, Nellore, Road accident

    తదుపరి వార్తలు