హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ప్రేమించి పెళ్లాడాడు, తీరా కడుపు రావడంతో సీన్ రివర్స్..! కట్ చేస్తే పోలీస్ స్టేషన్‌లో..?

ప్రేమించి పెళ్లాడాడు, తీరా కడుపు రావడంతో సీన్ రివర్స్..! కట్ చేస్తే పోలీస్ స్టేషన్‌లో..?

ప్రియుడు నిరంజన్

ప్రియుడు నిరంజన్

వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు (Chittoor) జిల్లా కార్వేటినగరం (Karvetinagaram) మండలం ఈదువారిపల్లి గ్రామానికి చెందిన నిరంజన్ కుమార్, కడప (Kadapa) జిల్లా పులివెందుల (Pulivendula)కు చెందిన శిరీషా విజయవాడలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదివారు. ఇద్దరు మనస్సులు కలవడంతో ఒక్కటయ్యారు. ఒకరిపై మరొకరికి విడదీయరాని ప్రేమతో పెళ్లి కూడా చేసుకున్నారు. మూడు సంవత్సరాల పాటు ఇద్దరూ కలిసి కాపురం కూడా చేశారు. 2021లో శిరీష గర్భం దాల్చింది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Kadapa (Cuddapah), India

  వాళ్లిద్దరూ మూడేళ్ల పాటు చెట్టాపట్టలేసుకుని తిరిగారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత విడదీయరాని బంధం ఏర్పడింది. గర్భవతిని చేసి.. ఆపై పెళ్లి కూడా చేసుకున్నాడు. ఆ తర్వాత అబార్షన్ చేయించి.. నెమ్మదిగా దూరం పెట్టడం మొదలుపెట్టాడు. అడిగితే మా ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదని సాకుతో ఫోన్ కూడా చేయడం మానేశాడు. తీరా ఆరా తీస్తే ఇంకో పెళ్లికి సిద్ధమయ్యాడని తెలిసింది దాంతో న్యాయం కోసం ఆ అభాగ్యురాలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది.

  వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు (Chittoor) జిల్లా కార్వేటినగరం (Karvetinagaram) మండలం ఈదువారిపల్లి గ్రామానికి చెందిన నిరంజన్ కుమార్, కడప (Kadapa) జిల్లా పులివెందుల (Pulivendula)కు చెందిన శిరీషా విజయవాడలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదివారు. ఇద్దరు మనస్సులు కలవడంతో ఒక్కటయ్యారు. ఒకరిపై మరొకరికి విడదీయరాని ప్రేమతో పెళ్లి కూడా చేసుకున్నారు. మూడు సంవత్సరాల పాటు ఇద్దరూ కలిసి కాపురం కూడా చేశారు. 2021లో శిరీష గర్భం దాల్చింది. దాంతో నిరంజన్ శిరీషని ఇంటికి తీసుకెళ్లి జరిగిన విషయమంతా చెప్పేశాడు.

  ఇదీ చదవండి: నా ప్రాణాలు పోయినా ఫర్వాలేదు.. ఏపీ భవిష్యత్‌ కోసం దేనికైనా రెడీ.. జనసేనాని సంచలన వ్యాఖ్యలు


  బీటెక్‌లో ఉండంగానే శిరీషను ప్రేమించానని.. పెళ్లి కూడా చేసుకున్నానంటూ తల్లిదండ్రులకు చెప్పగానే వాళ్లు షాకయ్యారు. అయితే శిరీషను నిరంజన్ తల్లిదండ్రులు కోడలిగా అంగీకరించేందుకు ఒప్పుకోలేదు. దాంతో నిరంజన్ శిరీషకు మాయమాటలు చెప్పి అప్పుడు ఇంటికి పంపించేశాడు. ఆ తర్వాత నుంచి శిరీషను మెల్లమెల్లగా దూరం పెట్టసాగాడు. ఇలానే ఉంటే శిరీషను వదిలించుకోవచ్చని ప్లాన్ కూడా చేశాడు. అంతే.. శిరీషకి ఫోన్ కూడా చేయడం మానేశాడు, శిరీష ఫోన్ చేసినా తీసేవాడు కాదు.

  దాంతో అనుమానం వచ్చిన శిరీష.. నిరంజన్ ఇంటికి వెళ్లి నిలదీయగా అసలు విషయం బయటకు వచ్చింది. తాను ఇంకో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నానని.. తన ఇంట్లో వాళ్లకి నువ్వు నచ్చలేదంటూ శిరీషతోనే డైరెక్ట్‌గా చెప్పేశాడు. తీవ్ర ఆవేదనకు గురైన శిరీష.. నిరంజన్ తల్లిదండ్రులతో తనకు అన్యాయం చేయొద్దని వేడుకుంది. కాళ్లావేళ్లా పడ్డానని, తనని కాదని వేరొక పెళ్లి చేసుకుంటే అన్యాయమైపోతానని, ఆత్మహత్యే శరణ్యం అన్నా వాళ్లు కనికరించలేదని శిరీషా బోరున విలపించింది. దాంతో కార్వేటినగరం పోలీసులను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది. శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  First published:

  Tags: Chittoor, Crime news, Kadapa, Pulivendula

  ఉత్తమ కథలు