హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tirumala: శ్రీవారి దర్శనం పేరుతో మోసం .. గుజరాత్‌ భక్తుల నుంచి లక్షలు కాజేసిన కేటుగాళ్లు

Tirumala: శ్రీవారి దర్శనం పేరుతో మోసం .. గుజరాత్‌ భక్తుల నుంచి లక్షలు కాజేసిన కేటుగాళ్లు

Tirumala

Tirumala

Tirumala: గుజరాత్ నుంచి 540 మంది భక్తుల బృందం అనేక వివిధ ఆలయాలను సందర్శిస్తూ తిరుపతికి చేరుకున్నారు. శ్రీవారిని వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తామని నకిలీ టికెట్లు అంటగట్టారు దళారులు. ఎంత డబ్బు తీసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Tirumala, India

(G.THemant Kumar,new18 reporter,Thirupathi)

తిరుమల( Tirumala)శ్రీవారి దర్శనానికి వచ్చే అమాయక భక్తులను టార్గెట్ గా చేసుకుని నిలువు దోపిడి చేస్తున్నారు కొందరు దళారులు.. టోకెన్లు Tokensలేని భక్తులను మాయమాటలు చెప్పి అధిక మొత్తంలో వారి వద్ద నుండి నగదు వసూలు చేయడంతో పాటుగా నట్టేట ముంచుతున్నారు. గుజరాత్(Gujarat)నుండి వచ్చిన ఓ భక్త బృందం వద్ద భారీ మొత్తంలో నగదు వసూలు చేసి వారికి నకిలీ దర్శన టోకెన్లు(Duplicate darshan tokens అందజేశారు. ఇదంతా చేసింది ఎవరో కాదు తిరుపతి నగరానికి చెందిన ఒక లాడ్జీ (Lodge)యజమాని కావడం విస్మయానికి గురి చేస్తోంది. దర్శన టోకెన్లను ప్రింట్ తీసుకునే సమయంలో జిరాక్స్ షాప్ యజమాని ఇచ్చిన క్లూతో మేలుకొన్న భక్త బృందం విజిలెన్స్ అధికారులను ఆశ్రయించారు. విజిలెన్స్(Vigilance)అధికారులు రంగంలోకి దిగి నగదును తిరిగి భాధితులకు అందజేశారు.. విజిలెన్స్ ఫిర్యాదుతో కేసు నమోదు పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

Kailasa Kona Falls: కైలాస కోన‌ జలపాతంలో స్నానం చేస్తే .. ఆ సమస్యలే ఉండవు..! ఎక్కడుందో తెలుసా..?

తిరుమలలో మాయగాళ్లు..

కొద్ది రోజుల క్రితం గుజరాత్ నుంచి 540 మంది భక్తుల బృందం అనేక వివిధ ఆలయాలను సందర్శిస్తూ తిరుపతికి చేరుకున్నారు. శ్రీవారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని పూనీతులు అవ్వాలని భావించారు. తిరుపతిలో తెలిసిన వ్యక్తిని సంప్రదించారు. అయితే ఆ వ్యక్తి టూరిజంకు చెందిన మరోక వ్యక్తిని వారికి ఫోన్ ద్వారా పరిచయం చేయించారు. అయితే తమకు తెలిసిన లాడ్జ్ యజమాని ఉన్నారని, అతని ద్వారా దర్శనాలు చేయిస్తామని టూరిజంకు చేందిన వ్యక్తి భక్త బృందానంను నమ్మించాడు. అది నమ్మిన భక్త బృందం టూరిజంకు చేందిన వ్యక్తికి, తిరుపతిలోని ఓ‌ లాడ్జ్ యజమానికి కలిపి దాదాపు 6.8 లక్షల రూపాయలు ఫోన్ ఫే, గూగుల్ ఫే ద్వారా నగదును జమ చేశారు.

మోసపోయిన గుజరాత్ భక్తులు..

గుజరాత్‌కు చెందిన భక్తులు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత టూరిజం పేరుతో పరిచయమైన వ్యక్తి, లాడ్జ్ యజమాని ఫోన్ చేసి దర్శన టోకెన్లు‌ సిద్దంగా ఉందని చెప్పారు. అది నమ్మిన భక్తు బృందం నేరుగా తిరుపతికి చేరుకుని టూరిజం చెందిన ఉద్యోగితో పాటుగా లడ్జ్ యజమాని వద్దకు వెళ్ళారు. అయితే అప్పటికే తాము ముందస్తుగా ప్లాన్ చేసిన నకిలీ టోకెన్లను డాక్యుమెంట్ రూపంలో ఫోన్ లో సిద్దం చేసిన టోకెన్లను భక్త బృందంలోని వ్యక్తికి పంపి, వాటిని జిరాక్స్ తీసుకుని‌ తిరుమలకు వెళ్ళవచ్చని చెప్పారు. అయితే అది నమ్మిన భక్త బృందం జిరాక్స్ షాప్ వెళ్లగా జిరాక్స్ యజమాని ఆ టికెట్లను చూడగానే ఇవి నకిలీ టోకెన్లని చెప్పడంతో షాకయ్యారు భక్తులు.

నకిలీ టికెట్ల ముఠా..

జిరాక్స్ యజమాని సూచనలతో తిరుపతిలోని టిటిడి విజిలెన్స్ అధికారులను సంప్రదించారు. అయితే భాధితుల ఫిర్యాదు మేరుకు రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు నమ్మి మోసపోయిన గుజరాతీయులకు న్యాయం చేసేందుకు వివరాలు తీసుకుని టూరిజం, లాడ్జ్ యజమాని అదుపులోకి తీసుకుని నగదుని భక్త బృందంకు అప్పగించారు. అయితే భక్త బృందంను మోసగించిన టూరిజం చెందిన ఉద్యోగస్తుడిని, లాడ్జ్ యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేసారు.. దీంతో విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.

First published:

Tags: Andhra pradesh news, Tirumala news

ఉత్తమ కథలు