హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Bride Escape: కాసేపట్లో పెళ్లి.. పందిట్లో సందడి... కానీ గదిలో పెళ్లికూతురు లేదు..

Bride Escape: కాసేపట్లో పెళ్లి.. పందిట్లో సందడి... కానీ గదిలో పెళ్లికూతురు లేదు..


10. పెళ్లి ఏర్పాట్లకు తన కుటుంబం రూ.7 లక్షలు వెచ్చించిందని, నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా కోరినట్లు వరుడు తెలిపాడు.  (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

10. పెళ్లి ఏర్పాట్లకు తన కుటుంబం రూ.7 లక్షలు వెచ్చించిందని, నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా కోరినట్లు వరుడు తెలిపాడు. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

Twist before Marriage: పందిట్లో భాజాభజంత్రీలు మోగుతుంటాయి. పంతులుగారు పెళ్లికుమార్తెను తీసుకురండీ అన్న తర్వాత గదిలో చూస్తే పెళ్లి కూతురు కనిపించడం లేదని పెద్దకేక.

GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18

అమ్మాయికి.. అబ్బాయికి పెళ్లి ఫిక్సవుతుంది. గ్రాండ్ గా ఎంగేజ్ మెంట్ జరిపి నిశ్చయతాంబూలాలు కూడా పుచ్చేసుకుంటారు. పెళ్లిబట్టల షాపింగ్ చేయడం, శుభలేఖలు ముద్రించి బంధుమిత్రులకు ఆహ్వానాలు పంచిన తర్వాత వివాహ వేదిక సిద్ధమవుతుంది. పందిట్లో భాజాభజంత్రీలు మోగుతుంటాయి. పంతులుగారు పెళ్లికుమార్తెను తీసుకురండీ అన్న తర్వాత గదిలో చూస్తే పెళ్లి కూతురు కనిపించడం లేదని పెద్దకేక. సాధారణంగా ఇలాంటి సన్నివేశాలు సినిమాల్లో జరుగుతుంటాయి. పెళ్లి నచ్చకో, అబ్బాయి నచ్చకో, లేక మరో వ్యక్తిని ప్రేమించో అమ్మాయిలు ఇలా చేస్తుంటారు. ఇలాంటి సీన్ రీల్ లో కాదు రియల్ లైఫ్ లో జరిగింది. కాసేపట్లో పెళ్లనగా పెళ్లికూతురు కనిపించలేదు. రిసెప్షన్ పూర్తై.. తెల్లవారుజాము ముహూర్తానికి వేదిక సిద్ధం చేయగా అమ్మాయి కనిపించలేదు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా ఎన్.పీ కుంటకు చెందిన యువకుడికి.. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలం గురుజుపల్లెకు చెందిన ఓ యువతితో పెళ్లి కుదిరింది. ఈ ఏడాది జూలై 7వ తేదీన నిశ్చితార్థం జరిగింది. ఆ ఫంక్షన్ కూడా ఇరు కుటుంబాలు గ్రాండ్ గా జరిపించాయి.

పెళ్లికొడుకు బెంగళూరు సమీపంలోని హోస్పేట్ వద్ద ఓ పరిశ్రమలో కూలీగా పనిచేస్తున్నాడు. నిశ్చితార్థం జరిపించిన తర్వాత షాపింగ్ కూడా చేశారు. శుభలేఖలు ముద్రించి బంధువులను ఆహ్వానించారు. ఈనెల 25న (బుధవారం) తెల్లవారుజామున పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. ఐతే పెళ్లి కోసం వధువును సిద్ధం చేసి మండపానికి బయలుదేరుతుండగా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని అమ్మాయి తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగింది. ఐతే ఇక్కడి వరకు వచ్చిన తర్వాత పెళ్లి వద్దనడం సరికాదని.. అదేదైనా ఉంటే నిశ్చితార్థం ముందే ఈ విషయాన్ని చెప్పాలని కదా అని ఆమెకు సర్దిచెప్పారు. ఇంటి దగ్గర నుంచి మదనపల్లెలోని పెళ్లిమండపానికి తీసుకొచ్చారు. ఆగస్టు 24వ తేదీ రాత్రి రిసెప్షన్ ను సందడిగా నిర్వహించారు.

ఇది చదవండి: పెళ్లికి ముందే ప్రియుడితో యువతి సహజీవనం... ఏం జరిగిందో ఏమో.. శవమై తేలింది..


తెల్లవారుజాము ముహూర్తం కావడంతో అందరూ నిద్రపోయారు. అర్ధరాత్రి దాటక పెళ్లిమండపం సిద్ధమైంది. భాజాభజంత్రీలు మోగుతున్నాయి. అమ్మాయికి మంగళస్నానం చేయించేందుకు అమ్మాయిని నిద్రలేపేందుకు గదిలోకి వెళ్లి చూడగా షాకింగ్ దృశ్యం కనిపించింది. రాత్రి గుడ్ నైట్ చెప్పి నిద్రపోయిన పెళ్లికూతురు కనిపించలేదు. పెళ్లికూతురు కనిపించడం లేదంటూ అమ్మాయి తల్లిదండ్రులు వరుడి బంధువులకు చెప్పారు. అందరూ కలిసి కల్యాణమండపం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోయింది. ఐతే పెళ్లి కూతురు ఓ యువకుడితో వెళ్లిపోయినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.


ఇది చదవండి: ప్రియుడి మోజులో భార్య.. భర్త అడ్డుగా ఉన్నాడని మేనల్లుడితో కలిసి మర్డర్ స్కెచ్..

మరోవైపు చివరి నిముషంలో పెళ్లి ఆగిపోవడంతో వరుడి తరపు బంధువులు.. అమ్మాయి తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం అబ్బాయి తరపువారు మదనపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము రెండున్నర లక్షలు ఖర్చు చేసిన తర్వాత అమ్మాయి వెళ్లిపోవడంతో ఆర్ధికంగా నష్టపోయామని.. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Marriage, Tirupati

ఉత్తమ కథలు