హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Bird Walk: క్యాట్ వాక్ గురించి తెలుసు.. మరి బర్డ్ వాక్ అంటే ఎంటో తెలుసా..?

Bird Walk: క్యాట్ వాక్ గురించి తెలుసు.. మరి బర్డ్ వాక్ అంటే ఎంటో తెలుసా..?

శేషాచలం అడవుల్లో బర్డ్ వాక్

శేషాచలం అడవుల్లో బర్డ్ వాక్

Bird Walk: అడవుల్లో తిరగాలంటే చాలా ధైర్యం కావాలి. వందల రకాల వన్యప్రాణులు అడవుల్లో కనిపిస్తుంటాయి. చాలా వరకూ అవేవి బాహ్య ప్రపంచానికి కనిపించవు. కొన్ని వందల రకాల జంతు జాతులు, పక్షుల రకాలు, వింత సర్పాలు దాగి ఉన్న రహస్య బండగారం శేషాచలం అటవీ ప్రాంతం.

ఇంకా చదవండి ...

GT Hemanth Kumar, News18, Tirupati

అడవుల్లో తిరగాలంటే చాలా ధైర్యం కావాలి. వందల రకాల వన్యప్రాణులు అడవుల్లో కనిపిస్తుంటాయి. చాలా వరకూ అవేవి బాహ్య ప్రపంచానికి కనిపించవు. కొన్ని వందల రకాల జంతు జాతులు, పక్షుల రకాలు, వింత సర్పాలు దాగి ఉన్న రహస్య బండగారం శేషాచలం అటవీ ప్రాంతం (Seshachalam Forest). అలాంటి ప్రాంతంలోకి ట్రెక్కింగ్ వెళ్లాలని నేటి యువతకు ఒక డ్రీమ్. ఇక ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పని చేసే ఉద్యోగులు సైతం ట్రక్కింగ్ కు వెళ్లడాన్ని ఎంత గానో ఇష్టపడుతున్నారు. తిరుపతిలో పక్షుల కోసం ప్రత్యేక బర్డ్స్ వాక్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు ఓ స్వచ్చంధ సంస్థ ప్రతినిథులు. శేషాచలం అరణ్యంలో పక్షుల స్వేచ్ఛను, వాటి హోయలను కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నం ఇది. ఈ కార్యక్రమంలో పాల్గొంటే ఆ హాయే వేరప్ప అంటున్నారు స్థానికులు. అసలు ఈ బర్డ్స్ వాక్ ఏంటి..? అది ఎలా ఉంటుంది..?

తిరుపతి (Tirupati) అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది ఏడుకొండల్లో కొలువైయున్న శ్రీనివాసుడి దర్శనం‌ కోసం విచ్చేసే భక్తులను శేషాచలం అటవీ ప్రాంతంలో ఉంటే పచ్చటి చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం ఆకట్టుకుంటాయి. అంతేకాకుండా శేషాచలం అటవీ ప్రాంతంలో అప్పుడప్పుడు కనిపించే అటవీ జంతువులను చూసి యాత్రికులే కాదు.., ఇక్కడి స్ధానికులు కూడా ఎంతగానో ఆశ్చర్యానికి గురవుతుంటారు. శేషాచలం అటవీ ప్రాంతంలో ఎన్నో అరుదైన జంతువులకు, పక్షులకు నెలవు.

ఇది చదవండి: అరుదైన పక్షులన్నీ ఒకే చోట.. అక్కడికెళ్తే ఎగిరి గంతేస్తారు..


అయితే ఇలాంటి అరుదైన పక్షులను ప్రపంచానికి పరిచయం చేసేందుకు తిరుపతికి చెందిన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అనే స్వచ్చంద సంస్ధ బర్డ్ వాక్ అనే కార్యక్రమంను తీసుకొచ్చింది. ప్రతి ఆదివారం, సెలవు దినాల్లో ఈ కార్యక్రమం ద్వారా స్ధానికులకు, యాత్రికులకు శేషాచలం అటవీ ప్రాంతంలోని వివిధ రకాల అరుదైన పక్షి జాతులను పరిచయం చేస్తూ, వాటి ఆహార పద్ధతులు, వాటి మధురమైన అరుపులు వంటి వంటి విషయాలను తెలియజేస్తున్నారు. అంతే కాకుండా శేషాచలం అటవీ ప్రాంతంలోని వివిధ రకాల పక్షులను తన కెమెరాల్లో బంధించి ప్రపంచానికి చూపిస్తున్నారు.

ఇది చదవండి: భీముడు కూర్చున్న కుర్చీ ఇక్కడే ఉంది.. పాండవులు నివాసమున్నదీ అక్కడే..!


తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ వేదికగా జరిగిన ఈ బర్డ్ వాక్ కార్యక్రమంలో దాదాపు 70 మంది యువతి, యువకులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు పాల్గోన్నారు. ఇందులో బ్యాచ్ లుగా విడిపోయి శేషాచలం అటవీ ప్రాంతంలోని పక్షల గురించి వివరించారు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ప్రతినిధులు. బర్డ్ వాక్ ఇన్ తిరుపతి కార్యక్రమం చాలా కొత్తగా అనిపించినా తెలియని విషయాలు తెలుసుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు.‌


ఇది చదవండి: ఏపీలో భర్తలు మరీ అంత సైకోలా..? కేంద్రం సర్వేలో షాకింగ్ నిజాలు


వివిధ రకాల పక్షులను చూడడమే కాకుండా వాటి పేర్లు, వాటి ఆహారపు అలవాట్లు గురించి తెలుసుకుంటున్నాంమని అంటున్నారు బర్డ్ వాక్ ఇన్ తిరుపతి కార్యక్రమంలో పాల్గోన్నవారు. ఈ కార్యక్రమం ద్వారా చాలా మందికి తెలియని విషయాలు తెలియజేయడమే కాకుండా శేషాచలం అటవీ ప్రాంతంలో జీవించే పక్షులను రక్షించే అవకాశం ఉంటుందని అంటున్నారు ఆ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి.

First published:

Tags: Andhra Pradesh, Birds, Tirupati

ఉత్తమ కథలు