హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

TTD EO Dharma Reddy: టీటీడీకి బిగ్ షాక్.. ఈఓ ధర్మారెడ్డి‎కి నెల రోజులు జైలు శిక్ష.. ఎందుకో తెలుసా..?

TTD EO Dharma Reddy: టీటీడీకి బిగ్ షాక్.. ఈఓ ధర్మారెడ్డి‎కి నెల రోజులు జైలు శిక్ష.. ఎందుకో తెలుసా..?

టీటీడీ ఈవోకు జైలు శిక్ష

టీటీడీ ఈవోకు జైలు శిక్ష

TTD EO Dharma Reddy: తిరుమల తిరుపతి దేవస్థానానికి ఊహించని షాక్ తగిలింది.. ఈఓ ధర్మారెడ్డికి నెల రోజుల పాటు జైలు శిక్ష విధించింది కోర్టు.. కోర్టు ధిక్కరణ కేసులో భాగంగానే శిక్ష విధించారు.. ఎందుకో తెలుసా..?

  • News18 Telugu
  • Last Updated :
  • Tirumala, India

TTD EO Dharma Reddy: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి (Lord Venkateswar Swamy) కొలువై ఉన్న తిరుమలలో అధికారులకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అయితే ప్రస్తుతం టీటీడీ (TTD)లో కీలల పొజిషన్ లో ఉన్న ఆయనకు ఊహించని షాక్ తగిలింది. తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) ఈవోగా ఉన్నధర్మారెడ్డికి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయనకు నెల రోజులు జైలుశిక్ష విధించింది. ముగ్గురు టీటీడీ ఉద్యోగుల సర్వీస్ రెగులరైజ్ చేయాలని ధర్మారెడ్డిని గతంలో న్యాయస్థానం ఆదేశించింది. కానీ ఆ ఆదేశాలు ఇప్పటి వరకు అమలు కాలేదు. అందుకే ధర్మారెడ్డి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన న్యాయస్థానం ధర్మారెడ్డికి నెల రోజుల జైలు శిక్ష, 2 వేల రూపాయల జరిమానా విధించింది. అయితే ఆ జరిమానా చెల్లించకుంటే మరో వారం జైలుశిక్ష పొడిగించాలని ధర్మాసనం ఆదేశించింది.

కోర్టు ఉత్తర్వులు అమలు చెయ్యలేదని టీటీడీ ఈవోకు జైలు శిక్ష విధించడం ఇప్పుడు తిరుమలలో హాట్ టాపిక్ గా మారింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు ఈ తీర్పు వెలువరిస్తున్నామని ధర్మాసనం ఘాటుగానే వ్యాఖ్యానించింది. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు అధికారుల తీరును సైతం పలు సందర్భాల్లో ధర్మాసనం తప్పు పట్టింది.

అసలు కోర్టు ఏం చెప్పింది అంటే..?

గతంలో టీటీడీలో పని చేస్తున్న ముగ్గురు తాత్కాలిక సిబ్బంది క్రమబద్దీకరణ కోసం పోరాడారు.. అయినా ఫలితం లేకపోయివడంతో న్యాయ పోరాటం అంటూ కోర్టును ఆశ్రయించారు. వారి తరపు అడ్వకేట్ల వాదనతో ఏకీభవించిన కోర్టు.. ఆ ముగ్గురినీ క్రమబద్దీకరించాలని ఆదేశాలిచ్చింది. కోర్టు ఆదేశాలు ఇచ్చినా.. వాటిని అమలు చేయలేదు. దీంతో ఉద్యోగులు కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన కోర్టు.. ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇదీ చదవండి : తెలుగు రాష్ట్రాలను వదలని మండూస్.. భయపెడుతున్న మరో తుఫాను.. బాధితుల కోసం సీఎం జగన్‌ కీలక నిర్ణయం

టీటీడీ ఈవో తీరును తప్పు పట్టింది. కోర్టు చెప్పినా మాట వినారా అంటూ గట్టిగానే ప్రశ్నించింది. ఇలాంటింది మళ్లీ రిపీట్ కాకూడదని వార్నింగ్ ఇస్తూ.. టీటీడీ ఈవోకి నెలరోజుల శిక్ష విధించిన హైకోర్టు సింగిల్ బెంచ్. దాంతో పాటే రూ.2వేల జరిమానా విధించింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులు 27వ తేదీలోపు అమలు చేయపోతే శిక్షా ఉత్తర్వులు అమలు చేయాలని ఆదేశించింది. అయితే, ఈవోపై సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్‌కు వెళ్లనుంది టీటీడీ. అక్కడ తమ వాదన నెగ్గుతుందని టీటీడీ ఆశిస్తోంది.

First published:

Tags: Andhra Pradesh, AP News, Tirumala Temple, Tirumala tirupati devasthanam, Ttd news