GT Hemanth Kumar, Tirupathi, News18
Big Shock to TTD: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు (Lord Venkateswara Swamy) కొలువైన దివ్య క్షేత్రం తిరుమల (Tirumala). దుష్ట శిక్షణ శిష్టరక్షణార్థం వైకుంఠాన్ని విడి ఇలా వైకుంఠంలో వెలిశారు స్వామి వారు. అందుకే శ్రీవారిని కనులార వీక్షించాలని ప్రతి హిందువు (Hindu Devotees) కోరుకుంటాడు. ఎన్ని సార్లు చూసిన మళ్లీ మళ్లీ చూడాలనే భావనతో నిత్యం లక్షలాది మంది భూలోక వైకుంఠంకు చేరుకుంటారు. ఆరాధ్య దైవానికి జరిగే నిత్య సేవలలో పాల్గొనాలని భక్తుల చిరకాల కోరికగా ఉంటుంది. అందులోనూ పూరాభిషేఖం.. మేల్ చాట్ వస్త్రం.. ఇలాంటి సేవలకు అధిక డిమాండ్ ఉంటుంది.
వివిఐపిలు, వారి సిపార్సు లేఖలపై కొన్ని పూరాభిషేఖం.. మేల్ చాట్ వస్త్రం టిక్కెట్లను జారీ చేస్తుంటే.. మరికొన్ని లక్కీ డిప్ విధానంలో అందిస్తుంటారు. అయితే మేల్ చాట్ వస్త్రం టిక్కెట్ల విషయంలో టీటీడీకి షాక్ ఇచ్చాడు తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఓ భక్తుడికి దర్శనం కల్పించకపోడాన్ని తమిళనాడు కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. అసలేమైంది అంటే..?
శ్రీవేంకటేశ్వరుడి మేల్ చాట్ వస్త్రం టికెట్ అంటేనే సామాన్యుల నుంచి మాన్యులా వరకు ఒక్కసారైనా ఆ సేవలో పాల్గొనాలని భావిస్తారు. శ్రీ వేంకటేశ్వరుని అత్యంత దగ్గరగా., గంట సేపు శ్రీవారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకొని భాగ్యం ఆ సేవలో లభ్యమవుతుంది. ఎలాంటి ఆభరణాలు లేని.. నిజ స్వరూపం కనులారా వీక్షించే భాగ్యం కోసం కొన్ని లక్షల మంది లాగానే తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన హరి భాస్కర్ అనే భక్తుడు 2006 లో మేల్ చాట్ వస్త్రం కోసం అభ్యర్థన పెట్టుకున్నారు.
12,250 రూపాయలు చెల్లించి మేల్ చాట్ వస్త్రానికి స్లాట్ తీసుకున్నాడు. అప్పటి నుంచి టిక్కెట్టు తేదీ మాత్రం ఖరారు చేయలేదు. దీనిపై టీటీడీకి పలుమార్లు పిర్యాదు చేసాడు. కానీ ఎలాంటి స్పందన లేదు. ఇక కరోనా ప్యాండమిక్ తరువాత ఆ సేవకు బదులుగా ప్రోటోకాల్ విఐపి బ్రేక్ ఇస్తామని వెల్లడించారు టీటీడీ అధికారులు. దీనికి హరి భాస్కర్ ఏమాత్రం ఒప్పుకోలేదు. తనకు మేల్ చాట్ వస్త్రం టిక్కెట్టు మాత్రమే ఇవ్వాలని డిమాండ్ చేసాడు.
ఇదీ చదవండి: వెంట వెంటనే రంగులు మారుతున్న బంగాళాఖాతం.. కారణమిదే అంటున్న సైంటిస్టులు
అతని విన్నపాన్ని టీటీడీ పట్టించుకోకపోవడంతో... ఆయన సేలంలోని వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన వినియోగదారుల కోర్టు భాస్కర్ కు సంవత్సరం లోపు మేల్ చాట్ వస్త్రం సేవను కల్పించాలని.. లేకపోతే బాధితుడికి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆదేశించింది.
ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న టీటీడీ అధికారులు మరో అడుగు ముందుకు వేసింది. సేలం కన్జ్యూమర్ కోర్ట్ తీర్పు పై అప్పిలుకు వెళ్లనుంది. 2020 మార్చి 20వ తేది నుంచి 2022 మార్చి వరకు శ్రీవారి ఆలయంలో కరోనా కారణంగా ఆర్జిత సేవలను రద్దు చేసారు టీటీడీ అధికారులు. అదే సమయంలో 17946 మంది భక్తులు అడ్వాన్స్ రిజర్వేషన్ లో ఆర్జిత సేవా టిక్కేట్లను పోంది ఉన్నారు. టిక్కేట్టు కలిగిన భక్తులుకు సేవలు రద్దు కారణంగా నగదు వాపసు లేదా విఐపి బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశం కల్పించింది టిటిడి.
టిటిడి ఆఫ్షన్ ని 95 శాతం మంది భక్తులు వినియోగించుకున్నారు. మిగిలిన 5% శాతం మంది భక్తులు టీటీడీ తీరుపై హైకోర్ట్ ని ఆశ్రయించారు. దింతో విచారణ చేపట్టిన ధర్మాసనం టిటిడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దినితో సేలం కన్జ్యూమర్ తీర్పు పై అప్పిలుకు వెళ్లనున్నారు టిటిడి అధికారులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Tirumala, Tirumala tirupati devasthanam, Ttd news