AP Parishath Election Result: చంద్రబాబు కంచుకోటకు బీటలు... కుప్పంలో జెండాపాతిన వైసీపీ...

చంద్రబాబు, లోకేష్ (ఫైల్)

పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) మాదిరిగానే చంద్రబాబునాయుడుకు (Nara Chandra Babu Naidu) కుప్పంలో (Kuppam) షాక్ తప్పలేదు. పరిషత్ ఎన్నికల్లోనూ అదే సీన్ రిపీట్ అయింది.

  • Share this:
    GT Hemanth Kumar, Tirupati, News18

    టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి (TDP Chief Nara Chandra Babu naidu) కంచుకోట కుప్పం నియోజకవర్గం (Kuppam Assembly Constituency). ఈ నియోజకవర్గం నుంచే చంద్రబాబు 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రతి ఎన్నికల్లో చంద్రబాబుకు కుప్పంలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. భారీ మెజారిటీతో విజయాన్ని కట్టబెడుతూ వస్తున్నారు. 2019లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ఎప్పుడు మొదటి రౌండ్ నుంచే ఆధిక్యం కనపరిచే చంద్రబాబు.... గత ఎన్నికల్లో మొదటి రెండు రౌండ్లలో వెనుకంజలోకి వెళ్లారు. చిత్తూరు జిల్లా (Chittoor District)లో టీడీపీ సున్నాకే పరిమితమవుతుందనుకున్న సమయంలో మూడవ రౌండ్ నుంచి ఆధిక్యం వచ్చింది. అయితే చంద్రబాబు ఓడి గెలిచాడన్న వాదనలు జిల్లాలో విస్తృతంగానే జరుగుతూ వచ్చాయి. సార్వత్రిక ఎన్నికల నుంచి పంచాయతీ ఎన్నికల వరకు ప్రజల ద్రుష్టి అంట కుప్పం వైపే ఉంటుంది. అందుకు ముఖ్య కారణం టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గం కావడమే.

    1989 నుంచి కుప్పంలో చంద్రబాబుకి తప్ప వేరొకరికి చోటు లేదని అక్షర సత్యం. 2019 ఎన్నికల్లో చంద్రబాబు 30 వేల ఓట్ల తేడాతో గెలుపొందడాన్ని నైతిక ఓటమిగా భావించే వారి సంఖ్య ఎక్కువ. వైసీపీ తరపున కొత్త ఎమ్మెల్యేలు పోటీ చేసి చంద్రబాబు కంటే ఎక్కువ మెజారిటీని సాధించారు. చంద్రబాబు కంచుకోటలో ప్రాబల్యం తగ్గింది అనడానికి పంచాయతీ ఎన్నికల ద్వారా రుజువైంది. గతంలో పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో వైసీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు గెలుపొందారు. కుప్పం నియోజకవర్గ పరిధిలో 93 పంచాయతీలుఉన్నాయి. అందులో మెజారిటీ స్థానాలను వైసీపీ మద్దతు దారులు కైవసం చేసుకున్నారు. 70 చోట్ల వైసీపీ, 12 చోట్ల టీడీపీ మద్దతు దారులు గెలుపొందారు.

    ఇది చదవండి: వైన్ షాపులో చల్లని బీరు కావాలి.. ఓటుతో పాటు మందుబాబుల లెటర్ వైరల్...


    ఇప్పుడు పరిషత్ ఎన్నికల్లోనూ (AP Parishath Elections) చంద్రబాబుకు ఎదురుగాలి వీసింది. టీడీపీ ఎన్నికలను బహిష్కరించినా కొందరు తెలుగు తమ్ముళ్లు బరిలోకి దిగారు. కుప్పం పరిధిలోని 19 ఎంపీటీసీ స్థానాలకుగానూ 17 వైసీపీ కైవసం చేసుకోగా.., 2 స్థానాల్లో టీడీపీ గెలుపొందింది. రామకుప్పం మండలంలో 16 ఎంపిటిసి స్థానాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయగా... గుడిపాల మండలంలో 13 స్థానాల్లో 12 వైసీపీ, ఇతరులు ఒక్క స్థానంలో గెలుపొందారు. ఇక శాంతిపురం మండలంలో 18 స్థానాల్లో వైసీపీ 17 కైవసం చేసుకోగా... టీడీపీ ఒక్క స్థానంలో నిలిచింది. ఇక చంద్రబాబునాయుడు స్వగ్రామం నారావారి పల్లె ఎంపీటీసీ స్థానాన్ని వైసీపీ అభ్యర్థి కైవసం చేసుకున్నారు. వెయ్యి ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్ధి రాజయ్య గెలిచినట్లు సమాచారం.

    ఇది చదవండి: వైసీపీలో ఇద్దరి యువనాయకుల మధ్య ఆధిపత్య పోరు... జగన్ కు తలనొప్పిగా మారిన వ్యవహారం


    ఇక చిత్తూరు జడ్పీటీసీ ఎన్నికల్లో ఫలితాల్లో అధికార వైసిపి హవా కొనసాగింది.. 33 జడ్పీటీసీ స్థానాలకుగానూ 33 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. అంతకు ముందే మరో 30 జడ్పీటీసీ స్థానాలను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. మరో రెండు స్థానాల్లో ఎన్నికలు జరగలేదు. అలాగే ఎన్నికలు జరిగిన 419 ఎంపీటీసీ స్థానాల్లో 389 స్థానాలను వైసీపీ కైవసం చేసుకోగా టీడీపీ 25స్థానాల్లో గెలిపొందింది. 5 స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలుపొందారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 866 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 413 స్థానాలను ఇప్పటికే వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది.
    Published by:Purna Chandra
    First published: