హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kuppam Politics: కుప్పంలో గెలుపు మనదే అంటున్నారు అధినేత జగన్.. కానీ అక్కడ పరిస్థితి ఇదీ

Kuppam Politics: కుప్పంలో గెలుపు మనదే అంటున్నారు అధినేత జగన్.. కానీ అక్కడ పరిస్థితి ఇదీ

 అధినేత అంచనాలు ఎక్కడ..? నేతలు ఆలోచనలు ఇక్కడే..?

అధినేత అంచనాలు ఎక్కడ..? నేతలు ఆలోచనలు ఇక్కడే..?

Kuppam Politics: 175 కు 175 లక్ష్యం అంటున్నారు సీఎం జగన్.. అందులో భాగంగా కుప్పంలో గెలుపు పక్కా అని లెక్కలు వేసుకుంటున్నారు..? కానీ కుప్పంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.. అసలు ఏం జరిగింది అంటే..?

  • News18 Telugu
  • Last Updated :
  • Kuppam, India

GT Hemanth Kumar, Tirupathi, News18

Kuppam Politics:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో  అధికార వైసీపీ (YCP) అధినేత జగన్ ఒకటి అనుకుంటే.. అక్కడ జరుగుతోంది వేరా..? 175కి 175 స్థానాల్లో నెగ్గడమే మన టార్గెట్ అంటున్నారు వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy).. అందులో భాగంగా మొదటిగా తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నియోజకవర్గం కుప్పం పైనే ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు.. కుప్పం వైసీపీ లో అంతా సూపర్ అని.. గెలుపు మనదే అని ఆయన పదే పదే చెబుతున్నారు. కానీ అక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అక్కడి వైసీపీ నేతలు  బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు.   తాజాగా కుప్పం వైసీపి నేత మున్సిపల్ కమీషనర్ తో మాట్లాడిన మాటలు అక్కడ వైసీపీ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. 

కుప్పంను మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకుని వచ్చేందుకు చంద్రబాబు నాయుడు హయాంలో నిర్ణయించుకున్నప్పటికీ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది..  2019లో ఏపిలో వైసీపీ అధికారం చేపట్టడంతో ప్రతిపక్షనేత సొంత నియోజకవర్గంమైన కుప్పంపై ప్రత్యేక దృష్టి పెట్టింది.. ఈ క్రమంలో కుప్పంను మున్సిపాలిటీ పరిధిలో తీసుకుని వచ్చింది.

తొలిసారి‌ కుప్పంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడే కుప్పంకు చేరుకుని ప్రచారం చేశారు..  అయినా టీడీపీ భంగపాటు తప్పలేదు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 25 స్ధానాలకు గానూ వైసీపీ అనూమ్యంగా 19 స్ధానాలు కైవసం చేసుకుంది. టిడిపి కేవలం ఆరు స్ధానాలు మాత్రమే గెలుచుకుంది.

ఇదీ చదవండి : శ్రీవారి ఆలయంలో వైభవంగా పుష్పయాగం.. ఎన్ని రకాల పుష్పాలు వినియోగించారంటే?

అప్పటి నుండి వైసీపి నేతలు కుప్పంలో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ప్రజలు తమ పార్టికి మద్దతూ తెలిపే విధంగా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.. అధికార పార్టి నేతల వ్యాహాలను ఎప్పటికప్పుడు చిత్తు చేస్తూ ప్రతిపక్ష నేతలు సైతం అదే రీతిలో ప్రజలకు చేరువ అయ్యేందుకు తమ స్టైల్ లో ప్రయత్నం సాగిస్తున్నారు.

ఇదీ చదవండి : ఏవోబిలో కాల్పుల కలకలం.. ఇద్దరు మావోయిస్టుల మృతి.. ఏం జరిగింది అంటే?

తాజాగా కుప్పం మున్సిపాలిటీ సమావేశానికి  టీడీపీ, వైసీపి కౌన్సిలర్లు హాజరయ్యారు. దాదాపు మూడేళ్లు గడుస్తున్న తమ తమ వార్డుల్లో ఇప్పటి వరకూ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించలేక పోతున్నాం అని, తమకు వేంటనే అభివృద్ధి కార్యక్రమాలకు నగదు విడుదల చేయాలని కొందరు కౌన్సిలర్లు ప్రస్తావించారు.

ఇదీ చదవండి : రాష్ట్రం అతలాకుతలం అవుతున్నా ఎందుకీ మౌనం.. ఓటును ఆయుధంగా చేయండంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు

ప్రతిపక్ష కౌన్సిలర్ల నుంచి ఇలాంటి డిమాండ్ రావడం సహజమే.. కానీ 17వ వార్డు వైసీపి‌ కౌన్సిలర్ దేవకీ భర్త రంగయ్య కోపంతో ఊగిపోయారు. తాము గెలిచినప్పటి నుండి నేటి వరకూ ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదంటూ మండిపడ్డారు. ఎన్నో హామీలు ఇచ్చి గెలిచిన తాము.. ఇప్పుడు  ప్రజల ముందుకు ఎలా వెళ్లాలని ప్రశ్నించారు. 

మున్సిపాలిటీ ఎన్నికల్లో ఒక ఓటుకు ఐదు వేల రూపాయలు ఇచ్చి గెలిచాం అని.. అంత ఖర్చు చేసి గెలిచినీ.. కనీసం తమ సొంత కార్యకర్తల కోసం చిన్న చిన్న పనులు కూడా చేయలక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం నుండి అభివృద్ధి పనులకు గానూ ప్రతి నెల ఇరవై వేల రూపాయలు విడుదల చేస్తోందని..  దానిని ఉపయోగించుకోవాలని చెప్పిన కమీషనర్ తో కొందరు కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు.

ఇదీ చదవండి: జగన్ సర్కార్ కు బిగ్ షాక్.. అమరావతి కేసు విచారణ నుంచి తప్పుకున్న సీజేఐ.. ఎందుకంటే?

ఇది కుప్పంలో ప్రస్తుత పరిస్థితికి అద్దం.. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపును చూసి..  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోను గెలుపు మనదే అని వైసీపీ అధిష్టానం చెబుతోంది. కానీ ఓటుకు ఐదు వేలు ఇచ్చి గెలిచామని.. కౌన్సిలర్లు అంటున్నారు. మరోవైపు కుప్పానికి భారీగా నిధులు విడుదల చేస్తామని సీఎం చెబుతున్నారు.. కానీ అక్కడ కౌన్సిలర్లు చిన్న పని చేయడానికి కూడా నిధులు లేవు అంటున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics, Chandrababu Naidu, Kuppam

ఉత్తమ కథలు