Home /News /andhra-pradesh /

TIRUPATI BIG LAND SCAM BUSTED IN CHITTOOR DISTRICT AS ACCUSED REGISTERED GOVERNMENT LAND TO HIS FAMILY FULL DETAILS HERE PRN TPT

Land Scam: టెన్త్ క్లాస్ తెలివితో వందల కోట్ల స్కామ్.. ప్రభుత్వ భూమిని వారసులకు రాసిచ్చేశాడు..

చిత్తూరు జిల్లాలో భారీ భూకుంభకోణం

చిత్తూరు జిల్లాలో భారీ భూకుంభకోణం

AP Land Scam: సాధారణంగా ప్రతి ప్రాంతంలో కొన్ని ఎకరాలు, కొత్త సెంట్ల భూములను ఆక్రమించుకొని లబ్ది పొందేవారు కొందరైతే..! మరికొందరు ఈ స్థలం మాదంటూ కొందరు కోర్టు మెట్లు ఎక్కుతూ ఉంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఒకటి కాదు రెండు అంతకన్నా కాదు ఏకంగా 2320 ఎకరాల ప్రభుత్వ భూమిపై కన్నేశాడు.

ఇంకా చదవండి ...
  GT Hemanth Kumar, Tirupati, News18

  సాధారణంగా ప్రతి ప్రాంతంలో కొన్ని ఎకరాలు., కొత్త సెంట్ల భూములను ఆక్రమించుకొని లబ్ది పొందేవారు కొందరైతే..! మరికొందరు ఈ స్థలం మాదంటూ కొందరు కోర్టు మెట్లు ఎక్కుతూ ఉంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఒకటి కాదు రెండు అంతకన్నా కాదు ఏకంగా 2320 ఎకరాల ప్రభుత్వ భూమిపై కన్నేశాడు. అందుకు అనుగుణంగా స్కెచ్‌ వేసి.., పూర్వీకుల వద్ద నుంచి సంక్రమించిన ఆస్తిలాగా తండ్రి నుంచి తల్లికి, ఆమె నుంచి తన నలుగురి పిల్లలకు వారసత్వ హక్కు వచ్చినట్లుగా రికార్డులు రూపొందించారు. 1,577 ఎకరాలను వెబ్‌ల్యాండ్‌ పోర్టల్‌లో వివరాలు ఎక్కించేశారు. ఇదంతా చేసిన మోహన్‌ గణేష్‌ పిళ్లై అనే ఘనుడు చదివింది కేవలం పదో తరగతి మాత్రమే. భూ దాహంతో కాజేయాలని అనుకున్న గ్రామంలో గ్రామకరణం, వీఏవోగా పనిచేసాడు. ఒకేరోజు 1577 ఎకరాల ప్రభుత్వ భూమి నలుగురి పేరిట పోర్టల్‌ నమోదు చేయించేసాడు. ఇంత పెద్ద స్కాం ను 12 ఏళ్ళు అయినా రెవెన్యూ శాఖా అధికారులు అసలు గురించలేకపోయారు. ఎంఆర్ఓ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీఐడీ అధికారుల దర్యాప్తుతో భారీ భూ కుంభకోణం విషయం వెలుగులోకి వచ్చింది.

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని  చిత్తూరు జిల్లా (Chittoor District) యాదమరి మండలం గొల్లపల్లికి చెందిన మోహన్‌ గణేష్‌ పిళ్లై 1977-84 నడుమ గ్రామ కరణంగా విధులు నిర్వహించే వాడు. అప్పట్లో ప్రభుత్వం ఆ వ్యవస్థను రాదు చేసింది. దీంతో 1992లో వీఏవో హోదాలో తిరిగి ప్రభుత్వ విధుల్లో చేరి 2010లో పదవీవిరమణ పొందాడు. ఈ నేపథ్యంలో భారీగా ల్యాండ్ స్కాంకు వ్యూహం రచించాడు పిళ్ళై. భూ కుంభకోణంపై విచారణ చేపట్టిన సీఐడీ 1985 నుంచి కుంభకోణంకు సంబందుంచిన అధరాలు సేకరించారు. భూమి తమది కావాలంటే పత్రాలు కావాలి. ఆ పత్రాలు నాకిలివైన ఒరిజినల్ పాత్రల్లా కలరింగ్ ఇచ్చేలా సృష్టించారు.

  ఇది చదవండి: డ్రగ్స్ వ్యవహారంపై తొలిసారి స్పందించిన సీఎం జగన్.. అధికారులకు కీలక ఆదేశాలు..


  వారసత్వ సంపదగా తండ్రికి వచ్చినట్లు 13 మండలాల్లోని 18 రెవెన్యూ గ్రామాల పరిధిలో 93 సర్వే నెంబర్లకు చెందిన 2,320 ఎకరాల భూమి ఉన్నట్లు గణేష్‌ పిళ్లై నకిలీ పత్రాలు తయారుచేయించాడు. ఆ భూములపై తన తండ్రి హక్కులు వదులుకుని తన తల్లి అమృతవల్లెమ్మ పేరిట బదిలీ చేసినట్లు మరో పత్రాన్ని రాయించాడు. అమృతవల్లెమ్మ ఆ భూములను తన కుమారుడి పిల్లలైన కోమల, ధరణి, మధుసూదన్‌, నటరాజన్‌ అలియాస్‌ రాజన్‌కు చెందేలా వీలునామా రాసినట్టు డాక్యుమెంట్లు సృష్టించాడు. ఈ వీలునామాను బంగారుపాళ్యం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో 1985లో రిజిస్టర్‌ చేయించాడు. తన తండ్రికి వేలాది ఎకరాలు ఎలా వచ్చాయన్న అనుమానం ఎవరికీ రాకుండా జమీందారుల ద్వారా వచ్చినట్టు మళ్లీ నకిలీ పత్రాలు సృష్టించాడు.

  ఇది చదవండి: ఏపీలో స్కూళ్ల మూత తప్పదా... ఒకే బడిలో 72మంది విద్యార్థులకు పాజిటివ్...


  పిళ్ళై స్కెచ్ ఆచరణలో రావడానికి దాదాపు 15 నుంచి 20 సంవత్సరాలు పట్టింది. 2005లో కలెక్టరేట్‌ కేంద్రంగా జిల్లాలోని భూముల వివరాలు వెబ్‌ల్యాండ్‌ పోర్టల్‌లో నమోదు చేసే కార్యక్రమం ప్రారంభించారు. అదే సమయంలో కలెక్టరేట్‌లో విధులు నిర్వహిస్తూన్నా గణే్‌షపిళ్ళైకి మంచి అవకాశం వచ్చింది. తాను అనుకున్న పని నెరవేచుకొనే రోజు దగ్గరకు వచ్చింది. సృష్టించిన నకిలీ పత్రాల ఆధారంగా 9 మండలాల్లో 1,577 ఎకరాల ప్రభుత్వ భూమిని 2009 జూలై ఒకటో తేదీన వెబ్‌ల్యాండ్‌ పోర్టల్‌లో ఎల్‌ఆర్‌ఎంఐఎస్‌ సాఫ్ట్‌ వేర్‌లో నమోదు చేయించేశాడు. అయితే మీ సేవలో వెబ్‌ల్యాండ్‌ పోర్టల్‌ సాఫ్ట్‌వేర్‌లో నమోదైన 1,577 ఎకరాల ప్రభుత్వ భూమికి అడంగల్‌, 1-బి కాపీలను తీసుకున్నారు. అడంగల్, 1-బి కాపీలను చూపి పట్టాదారు పాస్‌ పుస్తకాలకు దరఖాస్తు కోసం దరఖాస్తు చేసుకోవడంతో అసలు బండారం బయట పడింది.

  ఇది చదవండి: భార్య ఉండగానే ఇద్దరితో ఎఫైర్... ప్రియురాలు వీడియో తీస్తుండగా కూతురిపై ఘోరం... వీడికి ఏ శిక్ష వేయాలి..?  సోమల మండలం పెద్ద ఉప్పరపల్లె రెవెన్యూ గ్రామం సర్వే నంబరు 459లో తమకున్న 160.09 ఎకరాలకు పట్టాదారు పాస్‌ పుస్తకాలు కావాలని గతేడాది మే నెలలో గణేష్‌ పిళ్లై కుటుంబీకులు తహసీల్దారును కలిశారు. వారు ఇచ్చిన సర్వే నెంబరు భూమి మొత్తం ప్రభుత్వానిదే. మొత్తం భూమే 45.42 ఎకరాలు కావడంతో తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ఆరంభంలోనే ఇది భారీ ల్యాండ్ స్కాంగా సిఐడి గుర్తించింది. యాదమరి మండలం 184 గొల్లపల్లి, కొటాల, బంగారుపాళ్యం మండలం బోడబండ్ల, చిత్తూరు మండలం బోదగుట్టపల్లి, గుర్రంకొండ, పుంగనూరు పరిధిలోని ఆరడిగుంట, ముత్తుకూరు, బొమ్మరాజుపల్లి, సోమల మండలం ఆవులపల్లి, పెద్ద ఉప్పరపల్లి, కేవీపల్లి మండలంలోని కేవీపల్లె, ఎగవూరు, పుత్తూరు పరిధిలోని దామరకుప్పం, సత్రకుప్పం, సత్యవేడు పరిధిలోని కదిరివేడు, ఏర్పేడు మండలం కృష్ణంపల్లి, చంద్రగిరి మండలం డోర్నకంబాల తదితర 18 రెవిన్యూ గ్రామాల్లో భూములున్నట్టు సీఐడీ అధికారులు గుర్తించారు. వీటిలో వెబ్‌ల్యాండ్‌ పోర్టల్‌లోకి తొమ్మిది మండలాలకు చెందిన 1577 ఎకరాలను నమోదు చేసినట్టు గుర్తించినా.. ఆ మండలాల వివరాలు మీడియాకు వెల్లడించలేదు.

  ప్రభుత్వ భూములపై లోపించిన పర్యవేక్షణతోనే ఈ స్కాం జరిగింది అనటంలో ఎలాంటి అదిసయోక్తి లేదు.అక్రమాలు కలెక్టరేట్‌లో వెబ్‌ల్యాండ్‌ పోర్టల్‌లో నలుగురి పేరిట 1577 ఎకరాలను సాఫ్ట్‌వేర్‌లోకి ఎక్కించేశారు. భారీ స్థాయిలో ప్రభుత్వానికి చెందిన భూములు ఇతరుల పేర్లతో వెబ్‌ల్యాండ్‌ పోర్టల్‌లో నమోదైనా ఎవరు పట్టించుకోలేదు. అసలు వాటి గురించి కొంతైనా ఆలోచన చేయలేదు.దాదాపు 12 ఏళ్ల పాటు అధికారుల. అసలు అలంటి స్కాంకు పాల్పడినట్లు అధికారులు సైతం గుర్తించలేకపోయారు. పోర్టల్ ప్రారంభించిన సమయంలో పోర్టల్లో నమోదు అయినా భూముల దస్తావేజులు పరిశీలించి ఉంటె అక్రమాలు జరిగే అవకాశమే ఉండేది కాదు. భూములపై శీతకన్ను వేయడంతోనే ఈ ఉదంతం జరిగిందని సిఐడి సమగ్ర విచారణ జరుగుంతోంది. పిళ్ళై కుమారుడు మధుసూదన్‌ కు కంప్యూటర్ పరిజ్ఞానంలో ఆరి తేరాడు. కుమారుడి సహాయంతో పిళ్ళై పోర్టల్లో భూమి మొత్తం తమ పేరుపైకి మార్చుకోవడం జరిగిందని సీఐడీ విచారణలో వెల్లడైంది.

  మధుసూదన్ రెవెన్యూ ఉద్యోగి కాకపోవడం ఒకరోజంతా కాపుట్ర ముందు కూర్చొని 1,577 ఎకరాల వివరాలు నమోదు చేస్తునా పట్టించుకోకపోవడం ప్రశ్నర్థకంగా మారింది. ఇందులో కలెక్టరేట్‌లో పనిచేసే సిబ్బంది సహకారం సహకారం ఉంటుంది. దదువుపరి సిఐడి దర్యాప్తులో వారినీ గుర్తించి చర్యలు తీసుకోవాల్సి అవసరం ఏంతైనా వుంది. కానీ రెవెన్యూ అధికారుల డొల్లతనం మాత్రం పొట్టోచ్చినట్లు కనిపిస్తుంది.

  భూ స్కాం వీరుడు గణేష్ పిళ్ళై కన్నేసిన భూములన్నీ అటవీ ప్రాంతానికి అనుకోని ఉన్నవే. ఇవ్వని మారుమూల పల్లెలు, భూములకు డిమాండ్ లేని ప్రాంతాలు అవడంతో ఎవరూ పట్టించుకోలేదు. ఈ అవకాశాన్ని అదునుగా చేసుకొని అతడు అనుకూలంగా మార్చేసుకున్నాడు. వీటికి పట్టాదారు పాస్‌ పుస్తకాలు తీసుకున్నా, క్రయవిక్రయాలు జరిపినా ఆ ప్రాంత వాసుల నుంచి పెద్దగా అభ్యంతరాలు, ప్రతిఘటన ఎదురుకావన్న ఉద్దేశంతోనే ఈ భూములపై కన్నేశాడు. అయితే ఈ స్కాంలో 1,577 ఎకరాలను రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయించినా పట్టాదారు పాస్‌ పుస్తకాలు జారీ కాకపోవడం, రిజిస్ట్రేషన్లు జరగకపోవడమే ప్రస్తుతానికి ఊరట కలిగిస్తోంది. కాకపోతే నకిలీ పత్రాలు చూపి పాస్‌ పుస్తకాలు వచ్చాక విక్రయిస్తామంటూ పలువురి నుంచి స్వల్ప మొత్తాలు అడ్వాన్సుగా పుచ్చుకున్నట్టు సీఐడీ అధికారులు గుర్తించారు. నకిలీ పత్రాలతో బ్యాంకులు వంటి సంస్థల నుంచీ రుణాలు పొంది ఉండొచ్చనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Chittoor, Crime news, Land scam

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు