హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

TTD Alert: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్‌.. తిరుమలలో ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్స్‌ ఫెయిల్‌ అయ్యాయా.. రిఫండ్‌ కోసం ఇలా చేయాలి

TTD Alert: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్‌.. తిరుమలలో ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్స్‌ ఫెయిల్‌ అయ్యాయా.. రిఫండ్‌ కోసం ఇలా చేయాలి

తిరుమల పేరుతో ఉన్న డిపాజిట్స్ ఎంతంటే?

తిరుమల పేరుతో ఉన్న డిపాజిట్స్ ఎంతంటే?

TTD Alert: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఒక్కసారి కలిగితే చాలు జన్మ ధన్యమైనట్టే అన్నది భక్తుల నమ్మకం.. ఏదైనా కోరికతో స్వామి వారిని దర్శించుకుంటే.. ఆ కోరిక నెరవేరుతుందని నమ్ముతారు. అందుకే నిత్యం తిరుమల పుణ్యక్షేత్రం రద్దీగా ఉంటుంది. అయితే భక్తుల సౌకర్యం కోసం అన్ని సేవలను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచుతోంది టీటీడీ. అయితే ఇలా అన్ లైన్ సేవల్లో ట్రాన్స్ క్సణ్ ఫెయిలైందా..? అయితే నో టెన్షన్.. రిఫండ్ కోసం ఇలా చేయాలి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

TTD Alert: కలియుగ వైకుంఠం తిరుమల (Tirumala) కు భారీగా భక్తులు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా కరోనా (Corona Virus) శాంతించిన తరువాత.. ఊహించని స్థాయిలో నిత్యం భక్తులు స్వామి సన్నిధికి చేరుకుంటున్నారు. అందుకే గతంలో కంటే నిత్యం రికార్డు స్థాయిలో ఆదాయం వస్తోంది. ప్రస్తుతం అంతా డిజిటల్ టైం నడుస్తోంది. అందరూ ఆన్ లైన్ పేమెంట్స్ కు అలవాటు పడుతున్నారు. చేతిలో స్మార్ ఫోన్ (Smart Phone) ఉంటే.. ఇందులో భాగంగా తిరుమల శ్రీవారికి భక్తులకు సేవలను సులభతరం చేసేందుకు.. టీటీడీ ఆన్‌లైన్‌ సేవ (TTD Online Seva) లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirumati Devasthanam) అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా అన్ని రకాల సేవలను అందిస్తోంది. దర్శనం టికెట్ నుంచి రూమ్‌ బుకింగ్ చివరికి క్యాలెండర్లు, డైరీలను కూడా ఆన్‌లైన్‌లోనే కొనుగోలుకు అవకాశం కల్పించింది. దీంతో భక్తులు ఇంటి దగ్గర ఉండే అన్ని సేవలను ముందుగానే బుక్‌ చేసుకోగలుగుతున్నారు.

ఈ సేవలను పొందే సమయంలో కొన్ని అనుకోని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఉదాహరణకు కొన్ని సందర్భాల్లో సర్వర్‌ బిజీగా ఉండడమో, లేదా మరే టెక్నికల్‌ కారణంతో ఆన్‌లైన్‌లో పేమెంట్స్‌ చేసే సమయంలో ట్రాన్సాక్షన్స్‌ ఫెయిల్‌ అవుతుంటాయి. అకౌంట్‌లో నుంచి డబ్బులు కట్‌ అవుతాయి కానీ టికెట్ బుక్‌ అవ్వదు. ఇలాంటి సమయాల్లో ఎవరినీ సంప్రదించాలి..? అన్నదానిపై టీడీడీ కొన్ని సూచనలు చేస్తోంది.

ఒకవేళ ఆన్ లైన్ పేమెంట్ మిస్ అయితే.. ఆ డబ్బులు ఎలా రిఫండ్ పొందాలనే విషయంలో సందిగ్ధత నెలకొంటుంది. ఇలాంటి వారి కోసమే టీటీడీ పలు టోల్‌ ఫ్రీ నెంబర్లను, ఈమెయిల్‌ ఐడీలను పొందిపరించింది. డబ్బులు రీఫండ్‌కు సంబంధించి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

టికెట్లు బుక్‌ చేసుకోవడంలో ఇబ్బంది ఉన్నా, దేవాలయానికి సంబంధించి ఎలాంటి సందేహాలున్నావెంటనే.. టీటీడీ టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1555257ను సంప్రదించాలి. ఈ నెంబరు 24 గంటలకు భక్తుల సేవ కోసం అందుబాటులో ఉంటుంది. అయితే ఆన్ లైన్ పేమెంట్ కట్ అయ్యి.. పని సక్సెస్ కాకపోతే.. ఆ డబ్బులు సహజంగా ఏడు రోజుల్లో రీఫండ్‌ అవుతాయి.. ఒకవేళ అలా కాని పక్షంలో refundservices@tirumala.org ఐడీకి మెయిల్‌ పంపొచ్చు.

ఇదీ చదవండి : ఏపీకి మరోసారి మొండి చేయి.. రైల్వే జోన్ ప్రస్తావన లేదు.. స్టీల్ ప్లాంట్ ఊసే లేదు.. జగన్ చెప్పాల్సింది చెప్పారా?

దీంతోపాటు ఆన్‌లైన్‌లో రూమ్‌లు బుక్‌ చేసుకున్న సమయంలో ఏదైనా ట్రాన్సాక్షన్‌ ఫెయిల్‌ అయి 7 రోజుల్లో రీఫండ్‌ అవ్వకపోతే.. 0877-2264590 నెంబర్‌కు సంప్రదించాల్సి ఉంటుంది. తిరుమల శ్రీవారి దేవస్థానానికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే.. 1800425333333, 18004254141, +91-877-2233333, +91-877-2277777 నెంబర్లకు సంప్రదించొచ్చు. అలాగే ఆన్‌లైన్‌ సేవలు పొందడానికి టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.

First published:

Tags: Andhra Pradesh, AP News, Tirumala, Tirumala Temple, Tirupati

ఉత్తమ కథలు